: బీసీసీఐ కొత్త ప్లాన్!


ఓ ప్రణాళికంటూ లేకుండా క్రికెట్ షెడ్యూల్ ఖరారు చేసేస్తుందని ముద్ర వేయించుకున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆ అపప్రధను తొలగించుకోవాలని భావిస్తోంది. అందుకే, నూతన ప్రణాళికతో ముందుకువచ్చింది. ఇకనుంచి టీమిండియా విదేశీ టూర్లకు ముందు ఆయా దేశాలకు ఇండియా-ఎ జట్టును పంపాలని నిర్ణయించింది. ఈమేరకు పలు దేశాల క్రికెట్ బోర్డులకు విజ్ఞప్తి చేసింది.

తాజా ప్రణాళిక ప్రకారం.. ఈ ఏడాది చివర్లో భారత్.. దక్షిణాఫ్రికాలో పర్యటించనుండగా.. ఇండియా-ఎ జట్టు ఆగస్టు 4న దక్షిణాఫ్రికా పయనమవుతుంది. అక్కడ దక్షిణాఫ్రికా-ఎ, ఆస్ట్రేలియా-ఎ జట్లతో ముక్కోణపు టోర్నీలో ఆడుతుంది. ఇక 2014 జులైలో భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్ టూర్ కు వెళుతుంది. అంతకు ఓ నెల ముందే అంటే, జూన్ లో భారత్-ఎ జట్టు ఇంగ్లండ్ గడ్డపై పలు మ్యాచ్ లు ఆడనుంది. యువ క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించడమే కాకుండా, వారికి పలుదేశాల మైదాన స్థితిగతుల పట్ల అవగాహన కల్పించడమే బీసీసీఐ తాజా ప్లాన్ లక్ష్యం.

  • Loading...

More Telugu News