: జింబాబ్వే పర్యటనకు సీనియర్లు దూరం
జింబాబ్వేతో వన్డే సిరీస్ కు భారత జట్టు సీనియర్లకు విశ్రాంతినివ్వాలని భావిస్తోంది. జింబాబ్వేలో పర్యటించనున్న భారత జట్టు ఐదు వన్డేలను ఆడుతుంది. చాలాకాలంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పటికీ జింబాబ్వే క్రికెట్ బోర్డులో పేరుకుపోయిన జాత్యహంకార ధోరణులుతో జింబాబ్వే జట్టు ప్రతిభ మసకబారిపోయింది. దీంతో ఫ్లవర్ బ్రదర్స్ ఉన్నప్పుడే అంతర్జాతీయ స్థాయి ఆటతీరు కనబరిచిందీ జట్టు. తాజాగా ద్వితీయ శ్రేణి జట్టు స్థాయిలో ప్రదర్శన కనబరుస్తుండడంతో టీమిండియా సీనియర్లకు విశ్రాంతి దిశగా ఆలోచన చేస్తోంది. అయితే గాయం కారణంగా ధోనీ ఇప్పటికే విండీస్ సిరీస్ కు అందుబాటులో లేకుండా పోయాడు. అతను జింబాబ్వే సిరీస్ కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదంటున్నారు సెలెక్టర్లు.
దీంతో అతని స్థానంలో తెలుగు కుర్రాడు అంబటి రాయుడు జట్టుతో పాటు కోనసాగే అవకాశముంది. అంతే కాక పఠాన్ ప్లేస్ లో వచ్చిని షమీ అహ్మద్, గాయం నుంచి కోలుకున్న ఛటేశ్వర్ పూజారా, ప్రవీణ్ కుమార్ లను కూడా జట్టులోకి తీసుకునే అవకాశముంది. అయితే జట్టులో నలుగురు కొత్త ఆటగాళ్లు రానుండడానికి తోడు, రిజర్వ్ బెంచ్ బలంగా ఉండడంతో టీమిండియా సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటోంది.