: జగన్ పార్టీలో చేరిన మోపిదేవి ప్రధాన అనుచరుడు
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రధాన అనుచరుడు శాఖమూరు నారాయణ ప్రసాద్ నేడు వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో నేడు ఆయన పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ప్రసాద్ తో పాటు పలువురు మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా జగన్ పార్టీలో చేరారు. ప్రస్తుతం జైల్లో ఉన్న మోపిదేవి కూడా త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని వార్తలొస్తున్నాయి.