: తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తాం: కోదండరాం


ప్రత్యేక తెలంగాణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ఉద్ఘాటించారు. ఢిల్లీలో నేడు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. ఇకపైనా తెలంగాణ సాధనే తమ లక్ష్యమని కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేయాల్సి రావడం ప్రజాస్వామ్యానికే అవమానమని వ్యాఖ్యానించారు. కాగా.. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం లేదని అందరూ భావించినా.. ఇటీవలే ఆ పార్టీలో చేరిన కేకే, వివేక్ లు సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ నుంచి మాజీ మంత్రి దత్తాత్రేయ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News