: పుప్పిపళ్లు తిరిగి బాగుపడతాయి


మీకు పుప్పి పళ్లున్నాయా... అయితే వాటి స్థానంలో తిరిగి కొత్త దంతాలు పెరగే అవకాశం ఉంది. దీంతో మీకు రూట్‌కెనాల్‌ ట్రీట్‌మెంట్‌ బాధ కూడా తగ్గుతుంది. ఎందుకంటే జపాన్‌ శాస్త్రవేత్తలు పుప్పి పళ్లకు సంబంధించి చేస్తున్న ప్రయోగాల్లో పాడైన పుప్పి పళ్లను తిరిగి మామూలు దంతాలుగా చేసే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ జెరియాట్రిక్స్‌ అండ్‌ జెరోంటాలజీకి చెందిన శాస్త్రవేత్తలు పుప్పి పళ్లను తిరిగి పునరుద్ధరించేందుకు మూలకణాలతో చికిత్స పద్ధతిలో ప్రయత్నించారు. ఈ విషయం గురించి పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మిసాకో నకషిమా మాట్లాడుతూ సాధారణంగా పుప్పి పళ్లకు తొడుగులు వేసి, వాటి చుట్టుపక్కల ఉండే ఉబ్బిన డెంటిన్‌ గుజ్జును తొలగిస్తారు. అయినా కూడా ఈ సమస్య మళ్లీ మళ్లీ తిరగబెడుతుంటుంది. చివరికి పంటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఈ విషయంలో కుక్కలపై తాము చేసిన ప్రయోగం చక్కటి ఫలితాలను ఇచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పుప్పిపళ్లతో బాధపడుతున్న కుక్కలను ఎంచుకొని వాటి డెంటిన్‌ గుజ్జు నుండి మూలకణాలను సేకరించి, వాటిని ప్రయోగశాలలో జీ-సీఎస్‌ఎఫ్‌ అనే వృద్ధి కారకంతో కలిపిన తర్వాత తిరిగి ఆ మూలకణాలను కుక్కల పుప్పి పళ్లలోకి ప్రవేశపెట్టారు. కొద్దిరోజుల తర్వాత ఈ డెంటిన్‌ కణజాలం పునరుత్పత్తి కావడమే కాదు, అది పుప్పిపళ్ల రంధ్రాల్లో కూడా పూర్తిగా నిండిపోయినట్టు ఈ పరిశోధనల్లో తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News