: దృశ్యాన్ని ముందుకూ వెనక్కీ మార్చే కళ్లజోళ్లు
దృష్టి దోషాన్ని బట్టి సరిచేసుకునే సరికొత్త కళ్ల జోడుకు పరిశోధకులు ప్రాణం పోసారు. అమెరికా పరిశోధకులు పలు పరిశోధనల తరువాత కళ్లెదుట దృశ్యాన్ని ముందుకూ, వెనక్కీ మార్చే కళ్ల జోడును రూపొందించారు. 1.17 మిల్లీమీటర్ల మందం ఉండే ఈ కళ్ల జోడులో వేర్వేరు దృష్టి మార్గాలుంటాయి. ఇందులో ఒకటి దృశ్యాన్ని పెద్దగా ప్రత్యేకంగా చూపిస్తే, రెండోది సాధారణంగా కనిపించేలా చేస్తుంది. ఈ కళ్లద్దాలు ధరించినవారు మధ్య భాగంలో నుంచి మామూలుగానే చూడొచ్చు. ప్రత్యేకమైన లిక్విడ్ క్రిస్టల్ అద్దాలను ధరించి సాధారణ భాగాన్ని మూసివేయడం ద్వారా చూసే పద్దతిని ఎంచుకునే అవకాశం ఉంది. దీనితో కళ్లజోడు ధరించినవారు దృశ్యాన్ని ముందుకూ వెనుకకూ మార్చుకునే వీలుఉంది.
వయసు సంబంధిత మాక్యులర్ క్షీణత(ఏఎండీ) వ్యాధితో బాధపడేవారు దృష్టి మెరుగుపరచుకునేందుకు ఈ కళ్ల జోళ్లు ఉపయోగపడతాయని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రోఫెసర్ జోసఫ్ ఫోర్క్ పేర్కొన్నారు. ఈ కళ్లద్దాల తయారీ ప్రాధమిక దశలో కాంటాక్టు లెన్సుల్లో ఉపయోగించిన పదార్ధాల్ని ఉపయోగించారు.