: అమెరికాలో సిక్కు జంటకు అవమానం


వైవిధ్య ఆహార్యం వల్ల సిక్కులు అమెరికాలో తరచూ అవమానాలకు గురౌతున్నారు. తాజాగా కృపాణం ధరించారన్న కారణంగా సిక్కు జంటను కాలిఫోర్నియాలోని సినిమా ధియేటర్ నుంచి గెంటివేశారు. ఈ నెల 22న ఏఎంసీ ధియేటర్ లో సినిమాకు వెళ్లిన తమను బలవంతంగా బయటకు పంపేశారని మన్జోత్ సింగ్ తెలిపారు. దీనిపై క్షమాపణలు చెప్పాలన్న తమ డిమాండ్ ను ఏఎంసీ దియేటర్ యాజమాన్యం తేలిగ్గా తీసుకోవడమే కాకుండా, అమెరికాలో ఉన్న తమ 347 ధియేటర్లలోకి ఆయుధాలు తీసుకురావడం నిషేధమని పేర్కొని గెంటివేతను సమర్ధించుకుంది. దీంతో మనస్థాపానికి గురైన మన్జోత్ సింగ్ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సమాయత్తమౌతున్నారు.

మరో సిక్కుకు ఇలాంటి అనుభవం ఎదురుకాకుండా పోరాటం చేస్తానన్న మన్జోత్ సింగ్ కు యునైటెడ్ సిక్ సంస్ధ మద్దతు పలుకుతోంది. జాతి వివక్షపై అమెరికాలోని భారతీయులనుంచి తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. మరో వేపు భారత దేశం కూడా స్పందించాలని ఇక్కడి సిక్కు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News