: శంకర్రావు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: డీజీపీ ఆరోపణ
రెడ్డి అనే పేరుతో ఏ ఆస్తి ఉన్నా అది తనదే అని ఆరోపిస్తూ శంకర్రావు తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నిస్తున్నారని డీజీపీ దినేశ్ రెడ్డి అంటున్నారు. పలు కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న మాజీ మంత్రి శంకర్రావు తనపై పగ పెంచుకున్నారని ఆయన ఆరోపించారు. తన ఆస్తులపై ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని దినేశ్ రెడ్డి ప్రకటించారు. శంకర్రావు ఆరోపణలు అవాస్తవమని తేలితే ఆయనపై పరువునష్టం దావా వేసేందుకూ వెనుకాడబోనని డీజీపీ స్పష్టం చేశారు. రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళితే తన ఆస్తుల వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.