ఈ తరహా ఆండ్రాయిడ్ యాప్స్ తో జాగ్రత్త.. ఫోన్ స్లో అవుతుంది, వ్యక్తిగత డేటాకూ ప్రమాదమే!

ఏదో ఒక కొత్త తరహా యాప్ వస్తుంటుంది. మనం ఇన్ స్టాల్ చేస్తూ వెళుతుంటాం. దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. ఫోన్ పనితీరు దెబ్బతినడంతోపాటు మన వ్యక్తిగత అంశాలూ ప్రమాదంలో పడతాయి. మన బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డుల వివరాలు వంటివీ పరుల పాలయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల కొన్ని రకాల యాప్ లకు దూరంగా ఉండడమే ఉత్తమం. గూగుల్ ప్లేస్టోర్ లో రోజూ కొన్ని వేల సంఖ్యలో కొత్త యాప్ లు పుట్టుకొస్తున్నాయి. అందువల్ల అన్నింటినీ గూగుల్ సంస్థ ట్రాక్ చేయలేదు. ఒక వేళ వినియోగించాల్సి వచ్చినా.. కాస్త పేరున్న, రక్షణపరంగా ఉత్తమమైనవిగా రేటింగ్ ఉన్న వాటిని ఇన్ స్టాల్ చేసుకోవడం బెటర్. మరి ఎలాంటి యాప్ లతో ప్రమాదం, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో చూద్దాం...
వాతావరణ (వెదర్) వివరాల యాప్స్ తో ప్రమాదం

సోషల్ మీడియా యాప్స్ తో ఫోన్ స్లో
ఇప్పుడంతా ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ట్వీటర్ వంటి ఎన్నో సోషల్ మీడియా అకౌంట్లను వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఫోన్లో వాటన్నింటి యాప్స్ ను ఇన్ స్టాల్ చేస్తూ ఉంటాం. అయితే ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ తో భద్రతా పరమైన ప్రమాదం పెద్దగా లేకపోయినా.. వాటి వల్ల ఇతర సమస్యలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్ వంటి యాప్స్ చాలా ఎక్కువ మెమరీని వినియోగించుకుంటూ, ఎక్కువ మొత్తంలో బ్యాటరీని వినియోగించుకుంటూ ఉంటాయి. సోషల్ మీడియా యాప్స్ నిరంతరం బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ.. ఇంటర్నెట్ కు కనెక్ట్ అవుతూ.. డేటా సింక్రనైజేషన్ కు ప్రయత్నిస్తాయి. దీనివల్ల ఫోన్ బాగా స్లో అవుతుంది. తక్కువ ప్రాసెసర్, ర్యామ్ సామర్థ్యమున్న ఫోన్లు అయితే వీటి వల్ల తరచూ ల్యాగ్ అవుతూ ఉంటాయి కూడా.- మన వినియోగించేవి మినహా అవసరం లేని సోషల్ మీడియా యాప్స్ ను వెంటనే ఫోన్ లోంచి తొలగించడం చాలా బెటర్.
- ముఖ్యంగా ఫేస్ బుక్ యాప్ చాలా ఎక్కువగా డేటాను కూడా వినియోగించుకుంటుంది. దాని బదులుగా నేరుగా క్రోమ్ వంటి ఇంటర్నెట్ బ్రౌజర్ ను ఇన్ స్టాల్ చేసుకుని దానిలో ఫేస్ బుక్ ను వినియోగించడం బెటర్. దీనివల్ల డేటా తక్కువగా వినియోగం అవడంతోపాటు ఫోన్ కూడా చాలా వేగంగా పనిచేస్తుంది.
ఫోన్ ఆప్టిమైజర్ యాప్ లు దండగ
స్మార్ట్ ఫోన్ లో జంక్ ఫైల్స్ ను, అనవసరపు డేటాను, బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్ లను తొలగించి.. ఫోన్ లో మెమరీని ఫ్రీ చేస్తామని, వేగంగా పనిచేసేలా చేస్తామని పేర్కొంటూ ఎన్నో రకాల యాప్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాస్తవంగా చెప్పాలంటే అలాంటి యాప్ ల వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. పైగా ఫోన్ స్లో అవడంతో పాటు మన వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఎక్కువ. అంతేగాకుండా వాటి వల్ల అనవసరపు యాడ్స్ ను భరించాల్సి ఉంటుంది.
- ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో కస్టమ్ ఆపరేటింగ్ సిస్టం వస్తోంది. అంటే ఫోన్ తయారీదారులే ఫోన్ కు తగినట్లుగా ఆ ఫోన్ మెరుగ్గా పని చేసేలా ఆండ్రాయిడ్ లో మార్పులు చేసి అందజేస్తున్నారు. అలాంటివాటిలోనే ఇన్ బిల్ట్ గా డేటా క్లీనింగ్, బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్ లను క్లోజ్ చేయడం వంటి ఆప్షన్లు ఉంటున్నాయి.
- గూగుల్ ప్లే స్టోర్ లో అత్యధిక రేటింగ్ ఉన్న క్లీన్ మాస్టర్, డీయూ బ్యాటరీ డాక్టర్ సహా అన్ని రకాల ఆప్టిమైజర్ యాప్ లు కూడా ఫోన్ పనితీరు మందగించేలా చేస్తాయని ఇప్పటికే టెక్నాలజీ నిపుణులు నిర్ధారించారు.
- ఆప్టిమైజర్ యాప్ లు వినియోగించడానికి బదులుగా.. కొద్ది రోజులకోసారి ఫోన్ లోని డేటాను బ్యాకప్ తీసుకుని, ఫోన్ ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మేలు. దానివల్ల ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది.
స్మార్ట్ ఫోన్ లో ఇన్ బిల్ట్ గా వచ్చే బ్రౌజర్లతో సమస్యలు

- ఇన్ బిల్ట్ గా వచ్చే బ్రౌజర్లు పాత వెర్షన్లకు సంబంధించినవి అయి ఉంటాయి. వాటిల్లో సెక్యూరిటీ లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువ. అందువల్ల మన డేటా హ్యాకర్లు, మాల్ వేర్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది.
పేరులేని సంస్థల యాంటీ వైరస్ లతో ప్రమాదం

- కాస్పర్ స్కీ, అవైరా, ఏవీజీ, అవాస్ట్, మెకఫీ వంటి ఏదైనా ప్రముఖ సంస్థకు చెందిన యాంటీ వైరస్ ను మాత్రమే వినియోగించడం బెటర్.
- ఇటీవల గూగుల్ సంస్థ ప్లేప్రొటెక్ట్ పేరుతో యాంటీ వైరస్, ట్రోజాన్ స్కానర్ ను తీసుకువచ్చింది. ఏదైనా యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే ముందు ప్లే ప్రొటెక్ట్ అప్రూవ్ ఉందా లేదా చూడాలి.
అదనపు సౌకర్యాలున్న ఇంటర్నెట్ బ్రౌజర్లతో జాగ్రత్త

- అటు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి, ఇటు స్ట్రీమింగ్ కు ఉపయోగపడే యాప్ లను వినియోగించకపోవడం చాలా బెటర్. దానికి బదులుగా విడిగా స్ట్రీమింగ్ కు వినియోగించే.. మంచి సంస్థల యాప్ లను ఉపయోగించాలి.
ర్యామ్ ఇంప్రూవ్ మెంట్ యాప్స్ తో లాభం సున్నా..

లై డిటెక్టర్లు పనిచేయవు.. అవి జస్ట్ ఫర్ ఫన్

- సాధారణంగా ఇలాంటి ఫన్నీ యాప్స్ కు మన ఫోన్ లోని కాంటాక్టులు, ఎస్సెమ్మెస్ లు, లొకేషన్ వంటి వ్యక్తిగత వివరాల పర్మిషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
- అయినా ఇలాంటి ఏదైనా యాప్ ఇన్ స్టాల్ చేస్తున్నప్పుడు అలాంటి పర్మిషన్లు అడిగితే.. దానిని ఇన్ స్టాల్ చేయకుండా ఉండటమే బెటర్. లేకుంటే మన వ్యక్తిగత సమాచారం ఇతరుల పాలవుతుంది.