జీమెయిల్ అకౌంట్ డిలీట్ చేసేది ఎలా? జీమెయిల్ లో ఈ మెయిల్స్ బ్లాక్ చేయడం ఎలా?

జీమెయిల్ నేడు ఎక్కువ మంది వినియోగించే ఆన్ లైన్ సమాచార వారధి. ఎన్నో రకాల సేవలకు ఈ మెయిల్ ఎంతో అవసరం. బీమా పాలసీ తీసుకుంటే అది డిజిటల్ రూపంలో కంపెనీ నుంచి నేరుగా మెయిల్ ఐడీకి వస్తుంది. క్యాబ్స్ బుక్ చేసుకుంటే బిల్లు కాపీ కూడా మెయిల్ కు వస్తుంది. అంతెందుకు, బ్యాంకు నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు, లావాదేవీల అలర్ట్ లు సైతం మెయిల్ కు వస్తుంటాయి. ఇలా ఎన్నింటికో ఈ మెయిల్ ఐడీ అన్నది డిజిటల్ చిరునామా.

ఒకరికి ఎన్ని ఈ మెయిల్ ఐడీలు అయినా ఉండొచ్చు. ఈ విషయంలో ఎటువంటి నియంత్రణలు లేవు. ఒక్కోసారి ఇలా ఒకటికి మించి ఐడీలున్న సందర్భాల్లో కొన్నింటితో ఉపయోగం లేకపోవచ్చు. ఆ సందర్భాల్లో అలా వినియోగించుకోకుండా వదిలేయడం మంచిది కాదు. దుర్వినియోగం జరిగితే అందుకు బాధ్యత వహించాల్సి రావచ్చు. కనుక అవసరం లేని వాటిని డిలీట్ చేసుకోవడం మంచిది.


జీమెయిల్ అకౌంట్ ను డిలీట్ చేసేయాలనుకుంటే అది పూర్తిగా మీ అవసరం, ఇష్టానికి సంబంధించిన విషయమే. ఇది నిమిషాల్లో పని. చాలా సులభం. జీమెయిల్ చిరునామాను డిలీట్ చేయడం అంటే మొత్తం గూగుల్ అకౌంట్ ను డిలీట్ చేయడం కాదు. గూగుల్ ఇతర సర్వీసులతో సహా మొత్తం జీమెయిల్ అకౌంట్ ను డిలీట్ చేసుకుకోవాలంటే సంబంధిత ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఆన్ లైన్ లో ఏదైనా అకౌంట్ ను డిలీట్ చేసుకోవాలంటే అది చాలా క్లిష్టంగానే ఉంటుంది. చాలా సంస్థలు డిలీట్ ఆప్షన్ ను అందించవు. కొన్ని అయితే, డిసేబుల్ (కనిపించకుండా) ఆప్షనే ఇస్తున్నాయి. కానీ, గూగుల్, జీమెయిల్ అకౌంట్లు డిలీట్ చేయడం చాలా సులభం.  

డిలీట్ చేస్తే ఏం జరుగుతుంది?
representational imageఒక్కసారి జీ మెయిల్ అకౌంట్ ను డిలీట్ చేస్తే ఇక దాన్ని ఎప్పటికీ వినియోగించుకునేందుకు అవకాశం ఉండదు. జీమెయిల్ అకౌంట్ డిలీట్ అయిపోతుంది. అయితే, గూగుల్ అకౌంట్, గూగుల్ ప్లే స్టోర్ లో కొనుగోలు చేసిన హిస్టరీ మాత్రం అలానే ఉండిపోతుంది. అది డిలీట్ కాదు. అందుకోసం గూగుల్ అకౌంట్ డిలీట్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

జీమెయిల్ అడ్రస్ డిలీట్ చేసేందుకు...
జీ మెయిల్ లో లాగిన్ అయి, ‘మై అకౌంట్’ సెక్షన్ కు వెళ్లాలి. కుడి వైపు పేజీ పై భాగంలో ఉండే మెయిల్ ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తే అక్కడ జీమెయిల్ చిరునామా దాని కిందే ‘మై అకౌంట్’ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత పేజీలో పలు ఆప్షన్లు ఉంటాయి. అకౌంట్ ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్ వీటిలో ఒకటి. ఇందులోనే ‘డిలీట్ యువర్ అకౌంట్ ఆర్ సర్వీసెస్’ ను క్లిక్ చేయాలి. తర్వాత పేజీకి వెళతారు. ఇక్కడ మరలా కొన్ని ఆప్షన్లు వరుసగా ఒకదాని కింద మరొకటి కనిపిస్తాయి. డిలీట్ యువర్ అకౌంట్ ఆర్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని కింద ‘డిలీట్ ప్రొడక్ట్స్’, ‘డిలీట్ గూగుల్ అకౌంట్ అండ్ డేటా’ కనిపిస్తాయి.

జీమెయిల్ మాత్రమే డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ప్రొడక్ట్స్ సెలక్ట్ చేసుకోవాలి. మొత్తం గూగుల్ అకౌంట్ డిలీట్ చేయాలంటే ‘డిలీట్ గూగుల్ అకౌంట్ అండ్ డేటా’ను ఓకే చేసుకోవాలి. వీటిలో ఏ ఆప్షన్ క్లిక్ చేసినా తిరిగి మరోసారి మీ పాస్ వర్డ్ అడుగుతుంది. పాస్ వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ అవుతారు. ఇక్కడ డిలీట్ ను మరోసారి క్లిక్ చేయాలి. తర్వాత స్క్రీన్ లో కనిపించే సూచనలను ఓ సారి చదవండి. ఇక్కడే రిమూవ్ జీమెయిల్ అని ఉంటుంది. దాన్ని ఓకే చేస్తే అకౌంట్ డిలీట్ అయిపోతుంది.

ఒకవేళ జీమెయిల్ ను ఆఫ్ లైన్ లో ఉపయోగించి ఉంటే గనుక బ్రౌజర్స్ క్యాచే, కుకీలను క్లియర్ చేస్తేనే జీమెయిల్ పూర్తిగా డిలీట్ అవుతుంది. డిలీట్ అయిన తర్వాత మీరు అప్పటికే ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడీ ఇచ్చి ఉంటే దానికి మెయిల్ డిలీట్ అయినట్టు సందేశం కూడా వస్తుంది. ఒకవేళ మీరు సంస్థ తరఫున, స్కూల్ తరఫున మెయిల్ అడ్రస్ ను వినియోగిస్తుంటే దాన్ని సొంతంగా డిలీట్ చేసుకునే అవకాశం లేదు. ఇందుకోసం అడ్మిన్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకు https://support.google.com/accounts/answer/61177?hl=en పేజీని సందర్శించొచ్చు.

డిలీట్ అయిన జీమెయిల్ కావాలంటే?
ఒకవేళ మీరు డిలీట్ చేసిన జీమెయిల్ అకౌంట్ మళ్లీ కావాలనుకుంటే అది సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు. కాకపోతే డిలీట్ చేసిన నిమిషాల వ్యవధిలో రికవరీ చేసుకునేందుకు అవకాశం ఉంది. అందుకోసం ఈ లింక్ కు వెళ్లాలి https://accounts.google.com/signin/recovery.

జీ మెయిల్ లో ఈ మెయిల్స్ బ్లాక్ చేయడం...
ఈ మెయిల్ ఐడీకి ఒక్కోసారి అన్ నోన్ సోర్సెస్ (తెలియని వారు) నుంచి మెయిల్స్ వస్తుంటాయి. సైబర్ నేరగాళ్లు కావచ్చు, కంపెనీలు, వ్యాపార సంస్థల వాణిజ్య మెయిల్స్ కూడా కావచ్చు. ఇలా అవసరం లేని మెయిల్స్ తో ఈ మెయిల్ ఇన్ బాక్స్ నిండుగా ఉంటే వాటన్నింటినీ చెక్ చేసుకోవడం కష్టమైన పని. అందుకే ఈ తరహా అవసరం లేని వాటిని బ్లాక్ చేసుకోవచ్చు. దీనివల్ల అసౌకర్యం, మోసాలకు చెక్ పెట్టొచ్చు.

బ్లాక్ చేసేందుకు...
representational imageఫలానా చిరునామా నుంచి వచ్చిన మెయిల్ ను క్లిక్ చేసి బ్లాక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఇన్ బాక్స్ లో ఏదేనీ ఒక మెయిల్ ను క్లిక్ చేసిన తర్వాత పై భాగంలో సమయం పక్కనే లెఫ్ట్ యారో మార్క్ తర్వాత క్లిక్ చేయాలి. వరుసగా పలు ఆప్షన్ల చిట్టా కనిపిస్తుంది. representational imageఇందులోనే బ్లాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మరోసారి బ్లాక్, క్యాన్సిల్ ఆప్షన్లతో విండో వస్తుంది. బ్లాక్ చేస్తే ఇకపై ఆ అడ్రస్ నుంచి వచ్చే మెయిల్స్ స్పామ్ కింద మార్క్ చేయడం జరుగుతుందనే మెస్సేజ్ వస్తుంది. అంటే బ్లాక్ చేసేస్తే ఆ తర్వాత representational imageనుంచి ఆ అడ్రస్ నుంచి వచ్చే మెయిల్స్ మీ ఇన్ బాక్స్ కు రావు. స్పామ్ కేటగిరీలోకి వెళతాయి. ఒకవేళ ఏదైనా అనుమానాస్పద, మోసపూరిత మెయిల్ అని భావిస్తే ఇదే జాబితాలో ఉండే రిపోర్ట్ స్పామ్, రిపోర్ట్ ఫిషింగ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

అన్ బ్లాక్ చేయాలంటే?
representational imageఒకవేళ ఇలా బ్లాక్ చేసిన ఏవైనా మెయిల్ అడ్రస్ లను తిరిగి అన్ బ్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇందుకోసం మెయిల్ విండోలో కుడివైపు పై భాగంలో ఉండే గేర్ ఐకాన్ క్లిక్ చేయాలి. అందులో ఉండే సెట్టింగ్స్ ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత కనిపించే పేజీలో ఫిల్టర్స్ అండ్ బ్లాక్డ్ అడ్రస్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మీరు బ్లాక్ చేసిన, ఫిల్టర్ చేసిన మెయిల్ అడ్రస్ ల జాబితా కనిపిస్తుంది. వీటిలో కావాలనుకున్న దాన్ని సెలక్ట్ చేసుకుని డిలీట్ చేస్తే సరిపోతుంది.


More Articles