2018 సంవత్సరంలో బ్లాస్ట్ అయ్యే షేర్లు ఏవి?... బ్రోకరేజీ సంస్థల షేర్ల సిఫారసులు ఇవిగో!

వేలాది కంపెనీలు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయి ఉన్నాయి. ఏటా పదులు, వందల సంఖ్యలో షేర్లు ర్యాలీ చేస్తుంటాయి. అయితే, అలా పెరిగే అవకాశం ఉన్న షేర్లు ఏవన్నది అందరికీ తెలియదు. అందుకే బ్రోకరేజీ సంస్థలు ఏటా పెరిగేందుకు అవకాశం ఉన్న షేర్లను సూచిస్తుంటాయి.


డాబర్ ఇండియా: ప్రస్తుత ధర రూ.349 స్థాయిలో ఉండగా, దీనికి రూ.410 టార్గెట్ ధరతో మోతీలాల్ ఓస్వాల్ సిఫారసు చేసింది.
నీల్ కమల్: ప్రస్తుత ధర రూ.1,836. రూ.2,215 ధరతో మోతీలాల్ ఓస్వాల్ ఈ షేరును కొనుగోలుకు సిఫారసు చేసింది.
మదర్సన్ సుమి: ప్రస్తుత ధర రూ.379. మోతీలాల్ ఓస్వాల్ ఇచ్చిన టార్గెట్ రూ.458.
representational imageబ్యాంక్ ఆఫ్ బరోడా: ప్రస్తుతం రూ.151 స్థాయిలో ఉండగా, రూ.208 టార్గెట్ తో కొనుగోలుకు జియోజిత్ ఫైనాన్షియల్ సిఫారసు చేసింది.
కెన్ ఫిన్ హోమ్స్: ప్రస్తుతం రూ.473 స్థాయిలో ఉండగా, రూ.612 టార్గెట్ తో కొనుగోలు చేయవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సిఫారసు.
భారత్ ఫోర్జ్: ప్రస్తుత ధర రూ.723 కాగా, రూ.810 టార్గెట్ తో కొనుగోలుకు జియోజిత్ ఫైనాన్షియల్ సూచించింది.
ఏషియన్ గ్రానైటో ఇండియా: ప్రస్తుత ధర రూ.576. రూ.640 లక్ష్యంతో కొనుగోలుకు ఎడెల్వీజ్ సెక్యూరిటీస్ కొనుగోలుకు సిఫారసు చేసింది.
ఎవరెస్ట్ ఇండస్ట్రీస్: ఈ స్టాక్ ధర ప్రస్తుతం రూ.581 దగ్గర ఉంది. రూ.624లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చన్నది ఎడెల్వీజ్ సిఫారసు.
బిర్లా కార్ప్: ప్రస్తుత ధర రూ.1,150. రూ.1,300 టార్గెట్ తో కొనుగోలుకు ఎడెల్వీజ్ సూచించింది.
ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్: ప్రస్తుతం రూ.1,201 దగ్గర ఉన్న ఈ షేరును రూ.1,550 లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ రికమెండ్ చేసింది.
ఎండ్యురన్స్ టెక్నాలజీస్: ప్రస్తుతం రూ.1,355 దగ్గర ట్రేడ్ అవుతుండగా, రూ.1,550 లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ సూచించింది.
representational imageగోద్రేజ్ ఆగ్రోవెట్: ప్రస్తుత ధర రూ.579. రూ.648 లక్ష్యంతో కొనుగోలుకు యాక్సిస్ సెక్యూరిటీస్ సిఫారసు చేసింది.
రామకృష్ణ ఫోర్జింగ్స్: ప్రస్తుత ధర రూ.858. టార్గెట్ రూ.975. రిలయన్స్ సెక్యూరిటీస్ సిఫారసు చేసింది.
అపోలో టైర్స్: ప్రస్తుత ధర రూ.269. లక్ష్యం రూ.305. ఇది కూడా రిలయన్స్ సెక్యూరిటీ సీఫారసే.
కజారియా సిరామిక్స్: ప్రస్తుత ధర రూ.729 కాగా, దీన్ని రూ.851 టార్గెట్ తో కొనుగోలు చేయవచ్చంటూ రిలయన్స్ సెక్యూరిటీస్ సూచించింది.
సౌత్ ఇండియన్ బ్యాంకు: ప్రస్తుత ధర రూ.31. టార్గెట్ రూ.38. దీన్ని హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ సిఫారసు చేసింది.
ఎన్ సీసీ: రూ.134 వద్దనున్న ఈ షేరును రూ.162 లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చని హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ సిఫారసు.
జాగరణ్ ప్రకాశన్: రూ.179 దగ్గరున్న ఈ స్టాక్ ను రూ.199 లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చని హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ సిఫారసు.


More Articles