యాపిల్ ఐ ఫోన్ అంత ఖరీదెందుకో తెలుసునా...? తక్కువ ధరకే కొనాలనుకుంటే?

యాపిల్ ఐ ఫోన్ ప్రపంచంలో మొబైల్స్ ప్రియులకు అత్యంత ఇష్టమైన బ్రాండ్. ఈ ఫోన్ ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని ప్రత్యేకత అటువంటిది మరి. ఈ ప్రీమియం బ్రాండ్ ఫోన్ రేటు కాస్త దిగొస్తే బాగుండును... నేను కూడా సొంతం చేసుకోవచ్చని అనుకునే వారు ఎందరో ఉన్నారు. అయినా, యాపిల్ ఫోన్ ధర దిగిరాదు. దాని డిమాండ్ కూడా తగ్గదు. ‘ఎందుకు ధర తగ్గదు... అంత రేటెందుకు?’, ‘మార్కెట్లో అందుబాటు ధరల్లో మంచి ఫోన్లు ఉంటే, యాపిల్ ఎందుకు అంతేసి చార్జ్ వసూలు చేస్తుంది?’ అని ప్రశ్నించే వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారు ఐఫోన్ల ధరలు తగ్గకపోవడానికి గల కారణాలు, విషయాల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.
నాణ్యత
విలువైన సేవలు

పరిశోధన అభివృద్ధి (ఆర్ అండ్ డీ)

ఆప్టిమైజేషన్

- పైన చెప్పుకున్నట్టు యాపిల్ నాణ్యతలో రాజీ పడబోదనడానికి నిదర్శనం యాపిల్ 1 జీబీ ర్యామ్ మోడల్ ను కొద్ది సేపు ఉపయోగించి చూడండి. ఆ తర్వాత ఆండ్రాయిడ్ లో 4 జీబీ ర్యామ్ మోడల్ ను వాడి చూడండి. యాపిల్ లో యాప్స్ ల్యాగ్ అవడం, క్రాష్ అవడం వంటివి కనిపించవు. బుల్లెట్ రైలు వేగాన్ని తలపిస్తుంది. అదే ఆండ్రాయిడ్ లో 4జీబీ ర్యామ్ ఉన్నా సరే హ్యాంగింగ్, క్రషింగ్ వంటి సమస్యలు తరచూ ఎదురవుతుంటాయి.
- ఆండ్రాయిడ్ లో బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది. కానీ, యాపిల్ లో ఈ సమస్య ఉండదు. ఎందుకంటే ఫోన్ ఆప్టిమైజేషన్ సరిగా ఉండడం వల్ల బ్యాటరీ వినియోగం తక్కువగా ఉంటుంది.
- ఆండ్రాయిడ్ తో పోలిస్తే యాపిల్ ఫోన్ భద్రతా పరంగా
దృఢమైనది. ఇందులో సెక్యూరిటీ ఫీచర్లు ఎక్కువ. అందుకే హ్యాకర్లు ఐఫోన్ యూజర్లను టార్గెట్ చేసుకోవడం తక్కువ. అదే ఆండ్రాయిడ్ సిస్టమ్ లో లోపాలు ఎక్కువ. వినియోగారులు ఎక్కువ. దాంతో హ్యాకర్లు సహజంగానే ఆండ్రాయిడ్ ఫోన్లను టార్గెట్ చేసుకుంటారు.
- యాపిల్ సంస్థ ఐవోఎస్, హార్డ్ వేర్ రెండింటినీ తానే తయారు చేయడం వల్ల యూజర్లకు ఉన్న మరో సౌలభ్యం ఏమంటే... యాపిల్ సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ విడుదల చేయడం ఆలస్యం యూజర్లు తమ ఫోన్లలో తక్షణమే వాటిని పొందొచ్చు. ఆండ్రాయిడ్ లో అలా కాదు. గూగుల్ టీమ్ ఆండ్రాయిడ్ తరఫున సాఫ్ట్ వేర్, సెక్యూరిటీ ప్యాచ్ ల పేరుతో అప్ డేట్స్ రూపొందించిన వెంటనే యూజర్లు అందుబాటులోకి రావు. మొబైల్ కంపెనీలు వీటిని తీసుకుని ఫోన్లోని హార్డ్ వేర్ కు అనుగుణంగా మార్పులు చేసి అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. టాప్ కంపెనీలు ఈ పనిచేస్తాయేమో గానీ మిగిలిన కంపెనీలు దాదాపు ఈ పనిచేయడం లేదు.
- యాపిల్ సంస్థ విక్రయానంతర సేవలు కూడా చక్కగా ఉంటాయి. నిపుణులైన ఇంజనీర్లతో ఫోన్లకు బెటర్ సర్వీస్ ను ఆఫర్ చేస్తుంది యాపిల్.
- యాపిల్ పాటించిన నాణ్యతా సూత్రాలతో, ఖరీదైనది కావడంతో దీనికంటూ ప్రీమియం బ్రాండ్ గా మంచి విలువ ఏర్పడింది. దీంతో యాపిల్ ఫోన్ వాడడాన్ని గొప్పగా భావిస్తారు. చౌక బ్రాండ్ గా మార్చేసి ఇతర కంపెనీలతో పోటీ పడే ఉద్దేశం యాపిల్ కు లేదు. ప్రీమియం బ్రాండ్ గానే కొనసాగించాలన్నది సంస్థ విజన్. అందుకే యాపిల్ ధర తగ్గదు.
- యాపిల్ కోరుకుంటే తక్కువ ధరకే ఫోన్లను తయారు చేయగలదు. కానీ నాణ్యత అత్యున్నతంగా ఉండాలని భావించే కంపెనీ. ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వకుండా, నవ్యత, నూతనత్వం, ప్రత్యేకత ఉండేలా ఐఫోన్లను తయారు చేయడం, అందులో కొత్త ఫీచర్లు జోడించడం యాపిల్ చేసే పని.
- యాపిల్ విక్రయ ధరలో సగమే కంపెనీ తయారీకి ఖర్చవుతుంది. మిగిలినదంతా కంపెనీ లాభాలకే వెళుతుంది. కారణం అంత కాలం పాటు పరిశోధన చేసి నాణ్యమైన ఉత్పత్తులను విక్రయిస్తున్నందున ఆ మాత్రం మార్జిన్ ఉండాలన్నది కంపెనీ విజన్.
తరచుగా వినిపించే ఈ ప్రశ్నకు యాపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ లోగడే 2013లో ఓ కార్యక్రమం సందర్భంగా స్పష్టమైన సమాధానమిచ్చారు. ‘‘ధర కోసం యాపిల్ క్వాలిటీని పణంగా పెట్టదు. యాపిల్ గొప్ప ఉత్పత్తులను తీసుకు వస్తుంది. ఓ గొప్ప ఉత్పత్తిని తయారు చేసి దాన్ని 49 డాలర్ల (రూ.3,000కుపైన)కే విక్రయించడం ఎలా సాధ్యమవుతుంది. యాపిల్ మ్యాక్ ను 1,000 డాలర్ల (రూ..64,000సుమారు)లోపే ఎందుకు ఆఫర్ చేయడం లేదని టెక్నాలజీ పరిశీలకులు ఆశ్చర్యపోయేవారు. నిజానికి మేమే ఈ దిశగా ప్రయత్నాలు కూడా చేశాం. తక్కువ ధరకు గొప్ప ఉత్పత్తిని రూపొందించడం అసాధ్యమనే నిర్ణయానికొచ్చాం. అందుకే మేం అలా చేయలేదు’’ టిమ్ కుక్ పేర్కొన్నారు.
మన దేశంలో ధర ఎక్కువ ఎందుకని?

యాపిల్ ఇక్కడ తక్కువకే లభిస్తుంది...
యాపిల్ ఇటీవలే ఐఫోన్ ఎక్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ 64జీబీ వెర్షన్ ధర మన దేశంలో రూ.89,000. 256 జీబీ స్టోరేజీ ఉన్న ఐఫోన్ ఎక్స్ కావాలంటే రూ.1,02,000 భరించాల్సి ఉంటుంది. దీంతో ఐఫోన్ అత్యధిక ధరలు ఉండే దేశాల్లో మన దేశం కూడా చేరిపోయింది. అయితే, కరెన్సీ మారకం విలువల పుణ్యమా అని కొన్ని దేశాల్లో ఇది తక్కువ ధరకే లభిస్తోంది. జపాన్ లో ఐఫోన్ ఎక్స్ (64జీబీ) 1,12,800 యెన్ లు. 256 జీబీ మోడల్ ధర 1,30,045 యెన్ లు. మనదేశ కరెన్సీ మారకం విలువలతో లెక్కించి చూస్తే ఎక్స్ 64జీబీ రూ.65,000, 256జీబీ రూ.75,000కే జపాన్ లో లభిస్తున్నట్టు.
యాపిల్ అధిక ధర ఉన్న దేశాలూ ఉన్నాయి. ఐఫోన్ ఎక్స్ 64 జీబీ 1,000 డాలర్లని యాపిల్ ప్రకటించగా, దీని ధర రష్యాలో 1380 డాలర్లు, పోలాండ్ లో 1385 డాలర్లు. ఇటలీలో 1146 డాలర్లు. ఇలా దేశాన్ని బట్టి ధర మారిపోతుంటుంది. ఉదాహరణకు యాపిల్ 6ఎస్ అమెరికాలో ఆన్ లైన్ ధర 649 డాలర్లు. కానీ, మిగిలిన దేశాల్లో ఇది 636 డాలర్ల నుంచి 1,029 డాలర్ల వరకు ఉంది. టర్కీలో 1,000 డాలర్లు పెడితే గానీ రాదు. ఇటలీలో 842 డాలర్లు, ఫ్రాన్స్, జపాన్, బెల్జియం, నెదర్లాండ్స్ తదితర ప్రాంతాల్లో 809 డాలర్లకు లభిస్తోంది. కెనడా, అమెరికాలో మాత్రం ఇది చౌక. డాలర్ తో ఆయా దేశాల కరెన్సీ మారకం విలువలు, దిగుమతి సుంకాలు ధరను నిర్ణయిస్తాయి.