ఈ దీపావళికి “పర్ఫెక్ట్ సౌండ్ ఫర్ ఎవ్రీ మూడ్”ని ఆవిష్కరించిన జేబీఎల్ (JBL)
హర్మాన్ ( HARMAN) కు చెందిన ప్రముఖ ఐకానిక్ ఆడియో బ్రాండ్ జేబీఎల్ ( JBL) , తమ రాబోయే భారతదేశ వ్యాప్త పండుగ వినియోగదారుల (డిజిటల్) ప్రచారం - ‘పర్ఫెక్ట్ సౌండ్ ఫర్ ఎవ్రీ మూడ్’ని ప్రారంభిస్తున్నట్లు ఉత్సాహంగా వెల్లడించింది. ఈ 50-రోజుల డిజిటల్ ప్రచారం ప్రతి ఒక్కరికీ తమ జీవితంలోని ప్రతి అవసరాన్నీ తీర్చగలిగే JBL యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్ ఎలా ఉందో హైలైట్ చేస్తుంది. ప్రీ-ఫెస్టివ్ షాపింగ్ యొక్క సందడి నుండి ఇంటికి చేసే ప్రయాణం మధ్యలో ఉన్న ప్రతి చిన్న అంశం వరకు, ప్రతి భావోద్వేగ స్థితికి JBL ఉంది. JBL యొక్క అద్భుతమైన శబ్ద నాణ్యత మరియు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో, సంగీతాభిమానులు తమ స్వంత ప్రైవేట్ ప్రపంచంలో మునిగిపోవచ్చు , ప్రపంచాన్ని మ్యూట్ చేయవచ్చు మరియు వేడుకలను అన్‌మ్యూట్ చేయవచ్చు.
సాంప్రదాయ అడ్వర్టైజింగ్ పద్ధతులకు భిన్నంగా, ఈ సంవత్సరం JBL దీపావళి ప్రచారం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వినియోగదారులతో సన్నిహితంగా ఉండే కంటెంట్-ఆధారిత విధానాన్ని అనుసరిస్తుంది. విస్తృత స్థాయిలో విభిన్న మార్గాల ద్వారా లక్ష్య ప్రేక్షకులతో కనెక్ట్ కావడానికి సంబంధిత మరియు సృజనాత్మక కంటెంట్ యొక్క శక్తి పై ఈ ప్రచారం ఆధార పడుతుంది.
ఈ కొత్త కంటెంట్ విస్తరణ విధానానికి సంబంధించి ప్రధాన ఉదాహరణలలో ఒకటిగా, 'మ్యూట్ ది వరల్డ్ పెర్ఫార్మర్' విభాగాన్ని ప్రారంభించేందుకు క్రిక్ బజ్ తో JBL భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ భాగస్వామ్యం క్రికెట్ ఔత్సాహికులకు JBLతో, మ్యాచ్‌లను వీక్షిస్తున్నప్పుడు లీనమయ్యే ఆడియో అనుభవాన్ని ఆస్వాదించవచ్చని వారికి రిమైండర్‌గా ఉపయోగపడుతుంది.
అదనంగా, JBL ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ మరియు బెంగళూరులోని ప్రధాన విమానాశ్రయ టెర్మినల్స్‌లో ‘మ్యూట్ ది వరల్డ్ విత్ పర్ఫెక్ట్ సౌండ్’ ప్రచారాన్ని చేస్తుంది. ఈ ప్రచారం JBL యొక్క ప్రతిష్టాత్మక ప్రీమియం నాయిస్ క్యాన్సిలేషన్ ఉత్పత్తులను హైలైట్ చేస్తుంది, సందడిగా ఉండే విమానాశ్రయాలు మరియు విమానాలలో తమ సొంత లోకం కోసం నిరంతరం వెతుకుతున్న ప్రయాణీకుల కోసం ఉద్దేశించబడింది.
JBL హెడ్ఫోన్లను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావటానికి మరియు ఆర్థికంగా చేరువ చేయడానికి, ఈ బ్రాండ్ ప్రముఖ బ్యాంకులతో భాగస్వామ్యం చేసుకుని క్యాష్‌బ్యాక్ డీల్స్ అందిస్తుంది. ఈ అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అక్టోబర్ 1 నుండి నవంబర్ 20, 2023 వరకు అందుబాటులో ఉంటాయి, దీపావళి సీజన్లో ప్రతి ఒక్కరూ JBL యొక్క ఖచ్చితమైన శబ్ద సౌండ్ యొక్క ఆనందాన్ని అనుభవించవచ్చని నిర్ధారిస్తుంది.
హర్మాన్ ఇండియా వద్ద లైఫ్‌స్టైల్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ ఖేర్ మాట్లాడుతూ, "మేము దీప కాంతుల పండుగను వేడుక చేసుకుంటున్న వేళ , JBL సంగీతం మరియు సాంకేతిక మాయాజాలంతో హృదయాలను మరియు ఇళ్లను ప్రకాశవంతం చేయడం పట్ల గర్వంగా ఉంది. మా దీపావళి డిజిటల్ ప్రకటన ప్రచారం, దీపావళి స్ఫూర్తితో ప్రతిధ్వనించే వినూత్న అనుభవాల ద్వారా ఈ సీజన్ యొక్క ఆనందం మెరుగుపరచాలానే మా నిబద్ధతకు నిదర్శనం. ప్రతి ఒక్కరికీ సంతోషం , ఐక్యత మరియు జీవితపు మధురమైన సింఫొనీతో నిండిన దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను" అని అన్నారు.
JBL ఉత్పత్తులపై పండుగ ఆఫర్లు:
· గరిష్టంగా 25% తక్షణ క్యాష్‌బ్యాక్ లేదా 1 EMI ఉచితం
· 2999/- కంటే ఎక్కువ JBL ఉత్పత్తులపై నో కాస్ట్ EMI
వినియోగదారుల ఆఫర్లు ప్రధాన రిటైలర్ ల వద్ద మరియు www.JBL.comలో అందుబాటులో ఉన్నాయి