కాలేయ క్యాన్సర్ నిర్వహణలో సంచలనం
అటెజోలిజుమాబ్-బెవాసిజుమాబ్ కలయిక కాలేయ క్యాన్సర్ రోగుల మనుగడను విస్తరించింది చికిత్సలో కొత్త యుగాన్ని వాగ్దానం చేస్తోంది
● అటెజోలిజుమాబ్-బెవాసిజుమాబ్ కలయికతో సగటు మొత్తం మనుగడ 12 నెలలు
● మంచి కాలేయ పనితీరు ఉన్న రోగులలో, మనుగడ 21 నెలలు
భారత్, 14 ఆగస్ట్ 2023 – భారతదేశం లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG)చే నిర్వహించబడిన, వాస్తవ ప్రపంచ నేపథ్యంలో ఈ తరహాలో జరిగిన మొదటి అధ్యయనంలో ఇమ్యునో థెరపీ Atezolizumab-Bevacizumab కాంబినేషన్ లివర్ కేన్సర్ చికిత్సలో ఓ విప్లవాత్మకమైందిగా వెల్లడైంది. సకాలంలో గుర్తించి, సత్వరమే చికిత్స చేసినప్పుడు గణనీయమైన సంఖ్యలో కాలేయ కే న్సర్ రోగులలో చికిత్స, వ్యాధిరహిత మనుగడపరంగా ఆశాజనక ఫలితాలను ఈ కాంబినేషన్ ప్రద ర్శించింది. జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్ పెరిమెంటల్ హెపటాలజీలో ఈ అధ్యయనం ప్రచురిం చబడింది.
ఇమ్యునోథెరపీ Atezolizumab-Bevacizumab శరీర రోగనిరోధక వ్యవస్థను ఉపయోగిస్తుంది, కేన్సర్ కణాలను చంపుతుంది. ఇది వాస్తవ-ప్రపంచ పరిస్థితులలో గుర్తించలేని హెపాటోసెల్యులర్ కార్సినోమా (uHCC)లో కూడా సురక్షితంగా, ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది. రోగుల సరైన ఎంపికతో, అటె జోలిజుమాబ్-బెవాసిజుమాబ్ మనుగడ కాలం, కణితి అదృశ్యం (కణితి రిజల్యూషన్) పరంగా మంచి స్పందనను సాధించగలదు.
అధ్యయనంలో భాగంగా, గుర్తించలేని హెపాటోసెల్లర్ కార్సినోమా ఉన్న 67 మంది రోగులు అటె జోలి జుమాబ్-బెవాసిజుమాబ్ కాంబినేషన్ పొందారు. ఈ అధ్యయనంలో హైదరాబాద్‌లోని ఎఐజి హాస్పి టల్ నుండి 59 మంది రోగులు, జైపూర్‌లోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీ నుండి 8 మంది రోగులు పాల్గొన్నారు. అటెజోలిజుమాబ్-బెవాసిజుమాబ్ కాంబినేషన్ థెరపీని పొందిన 67 మంది రోగుల మధ్య స్థ వయస్సు 61 (29–82) సంవత్సరాలు. వీరిలో 86% మంది పురుషులు. ఈ అధ్యయనం నవంబర్ 1, 2020 నుండి జూలై 1, 2022 వరకు రెండు కేంద్రాలలో నిర్వహించబడింది, జూలై 2023లో ప్రచురిం చబడింది.
12.9% మంది రోగులు కణితి నుంచి పూర్తి విముక్తి సాధించారని, 25.8% మందికి పాక్షికంగా నయమైందని లేదా కణితులను తగ్గిన అంశాన్ని పరిశోధకులు ప్రముఖంగా ప్రస్తావించారు. మొత్తం మీద అధ్యయనం చేసిన 66.12% మంది రోగులలో వ్యాధి పురోగతి చెందలేదు.
మంచి కాలేయ పనితీరు ఉన్న రోగులలో, మొత్తం మనుగడ 21 నెలలుగా ఉంది. కాలేయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న చాలా మంది రోగులు ముదిరిపోయిన దశలో చికిత్సను సవాలుగా మార్చారు. అ యినప్పటికీ, వారు మంచి కాలేయ పనితీరును కలిగి ఉంటే, Atezolizumab-Bevacizumab కాంబినే షన్ తో చికిత్స చేస్తే అది మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తుంది.
లోకల్ రేడియేషన్ థెరపీ, Atezolizumab-Bevacizumab కాంబినేషన్ పొందిన రోగులకు మెరుగైన స్పందన రేట్లు ఉన్నాయని అధ్యయనం తెలిపింది. లోకల్ రేడియేషన్ థెరపీ చేయించుకున్న రోగుల లో Atezolizumab-Bevacizumab కాంబినేషన్ అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని ఇది వెల్లడించిం ది.
కాలేయ క్యాన్సర్‌కు కారణమయ్యే నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH) యొక్క పెరుగుతున్న ఉదంతాలను కూడా ఈ అధ్యయనం కనుగొంది. ఏఐజీ హాస్పిటల్స్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ & చీఫ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “ఇటీవలి సంవత్సరాలలో జీర్ణశయాంతర, కాలేయ క్లినిక్‌లలో చాలా తరచుగా ఎదుర్కొన్న క్యాన్సర్‌లలో కాలేయ క్యాన్సర్ ఒకటి. కాలేయ క్యాన్సర్‌కు కారణం వైరల్ హెపటైటిస్ బి అని చాలా కాలంగా చెప్పబడింది. ఇప్పుడు ట్రెండ్ నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH లేదా ఫ్యాటీ లివర్)గా మారుతోంది. దీనికి కారణం నిశ్చల జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మధుమేహం వచ్చే పెరగడం. ఈ రోగులకు చికిత్స నోటి మాత్రలకే పరిమితం చేయబడింది. అయితే కొత్త ఇమ్యునోథెరపీ చికిత్స అధునాతన కాలేయ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మ క మార్పులు చేసింది’’ అని అన్నారు.
ఈ అధ్యయనం భారతదేశంలోని కాలేయ క్యాన్సర్ రోగులకు కొత్త ఆశను అందిస్తుంది. అంతేగాకుండా సిర్రోసిస్ ఉన్న రోగులకు రెగ్యులర్ చెక్-అప్‌ల ప్రాముఖ్యతను కూడా ఇది చాటి చెబుతోంది’’ అని డాక్టర్ రెడ్డి అన్నారు.
‘‘Atezolizumab, bevacizumab వంటి ఇమ్యునోథెరపీ కాలేయ క్యాన్సర్ అడ్వాన్స్ దశలో ఉన్న రోగు లకు మంచి మనుగడ అవకాశాన్ని అందిస్తుంది. అడ్వాన్స్ కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగు లకు ఇది అద్భుతమైన చికిత్స. సంప్రదాయిక చికిత్సతో, కణితిని పూర్తిగా రూపుమాపడం కష్టం. అ యితే, Atezolizumab, Bevacizumab లతో సుమారు 10-13% మంది రోగులు కణితి సమస్యను పూ ర్తిగా అధిగమించారు. నాలుగో వంతు మంది పాక్షిక పరిష్కారం సాధించారని మేం గుర్తించాం. ఈ మం దులు తప్పనిసరిగా ప్రతి 3 వారాలకు పర్యవేక్షణలో ఇవ్వాలి. రోగులందరికీ, ముఖ్యంగా కామెర్లు ఉ న్న రోగులకు ఇవి తగినవి కావు" అని డాక్టర్ ఆనంద్ కులకర్ణి, MD, DM, సీనియర్ కన్సల్టెంట్, హెపటాలజీ & కాలేయ మార్పిడి విభాగం ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (హైదరా బాద్) చెప్పారు. డాక్టర్ ఆనంద్ ఈ అధ్యయనానికి ప్రధాన రచయిత కూడా.
హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రికి చెందిన హెపటాలజీ డైరెక్టర్ డాక్టర్ PN రావు మాట్లాడుతూ, అ డ్వాన్స్ క్యాన్సర్ ఉన్న రోగులకు శస్త్రచికిత్స, కాలేయ మార్పిడి వంటి నివారణ చర్యలు అందించలేని పరిస్థితుల్లో, రోగుల చికిత్సలో ఇమ్యునోథెరపీ గణనీయమైన పురోగతిని సూచిస్తుందని అన్నారు.
మహాత్మా గాంధీ హాస్పిటల్ జైపూర్‌లోని గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ హెడ్ ప్రొఫెసర్ వివేక్ సరస్వత్ అటెజోలిజుమాబ్-బెవాసిజుమాబ్ ప్రధాన ప్రభావం గురించి మాట్లాడుతూ, ‘‘కనీసం ఆరు ప్రధాన అమె రికన్, యూరోపియన్ మార్గదర్శకాలు (AASLD, NCCN, AGA, ASCO, EASL, ESMO) ఫస్ట్-లైన్ చికిత్సగా కలయికగా దీనిని సిఫార్సు చేస్తున్నాయి.కారణం ఈ కలయికతో సాధించిన అపూర్వమైన ఫలితాలు. ఇది మునుపు అందుబాటులో ఉన్న దైహిక చికిత్స విధానాల కంటే మెరుగైనది’’ అని అన్నారు.
ఇటీవలే ఇండియన్ లివర్ క్యాన్సర్ మార్గదర్శకాలను రచించిన సర్ గంగారామ్ హాస్పిటల్ (దిల్లీ) సీని యర్ కన్సల్టెంట్ డాక్టర్. ఆశిష్ కుమార్ మాట్లాడుతూ, ‘‘అడ్వాన్స్ కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు అటెజోలి జుమాబ్-బెవాసిజుమాబ్ మొదటి శ్రేణి చికిత్సగా సిఫార్సు చేయబడింది. కాలేయ విధులు చక్కగా ఉన్న రోగులకు ఇది ప్రభావవంతంగా చూపబడింది’’ అని అన్నారు.
ముంబయిలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్ హెపటాలజీ డైరెక్టర్ డాక్టర్ ఆకాష్ శుక్లా మాట్లాడు తూ ‘‘కాలేయ క్యాన్సర్‌కు సంబంధించిన ప్రతి దశకు ప్రస్తుతం చికిత్స అందుబాటులో ఉంది. మల్టీ డిసిప్లినరీ టీమ్ విధానం వల్ల కాలేయ క్యాన్సర్‌కు మెరుగైన ఫలితాలు లభిస్తాయని’’ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలకు కాలేయ క్యాన్సర్ 4వ అత్యంత సాధారణ కారణం గా ఉంది. భారతదేశంలో క్యాన్సర్ సంబంధిత మరణాలకు 8వ అత్యంత సాధారణ కారణంగా ఉంది. దేశంలో 100,000 జనాభాకు పురుషులలో కాలేయ క్యాన్సర్/హెపాటోసెల్యులర్ కార్సినోమా ఏజ్ అ డ్జస్టెడ్ ఇన్సిడెన్స్ రేటు 0.7 నుండి 7.5 వరకు, స్త్రీలలో సంవత్సరానికి 0.2 నుండి 2.2 వరకు ఉం టుంది. భారతదేశంలోని పురుషులకు హెచ్‌సిసికి వయస్సు ప్రామాణిక మరణాల రేటు 100,000 జనాభాకి 6.8, స్త్రీలలో సంవత్సరానికి 100,000 జనాభాకు 5.1 గాఉంది.