ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణాలో "రెనో ఎక్స్‌ పీరియన్స్ డేస్" ప్రారంభించిన రెనో

ఆంధప్రదేశ్‌లోని 14 ప్రాంతాల్లో & తెలంగాణలోని 19 ప్రాంతాల్లో రెనో వాహన విక్రయాలు, సేవల అనుభవాన్ని పొందేందుకు ఈ  ప్రచార కార్యక్రమం వీలు కల్పిస్తుంది.
రెనో ఎక్స్‌ పీరియన్స్ డేస్ ఈ అన్ని ప్రాంతాల్లోనూ స్పాట్ టెస్ట్ డ్రైవ్, బుకింగ్, ఫైనాన్స్ ఆప్షన్‌లను   కస్టమర్‌కు వన్ స్టాప్ సొల్యూషన్‌గా అందిస్తుంది.
 

హైదరాబాద్, 14 సెప్టెంబర్ 2023: – రెనో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఐపిఎల్) ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా అంతటా "రెనో ఎక్స్‌ పీరియన్స్ డేస్" అనే అద్భుతమైన ప్రచారాన్ని ప్రారంభించినందుకు గర్విస్తోంది. ఈ వినూత్న,  నిమ గ్నం చేసే కార్యక్రమం భారతీయులు ఈ బ్రాండ్‌ను అనుభూతి చెందే,  నిమగ్నమయ్యే విధానాన్ని పునర్నిర్వచించ టానికి హామీ ఇస్తుంది.

ఈ అపూర్వమైన చొరవలో భాగంగా, రెనో భారతదేశంలోని 26 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని  625 లొకేషన్స్ లో "షోరూమ్ ఆన్ వీల్స్"ను పరిచయం చేసింది. ఈ ప్రచారంలో భాగంగా ఇది ఆంధ్ర ప్రదేశ్‌లోని 14 ప్రాంతాలు & తెలంగాణలోని 19 ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఈ ప్రచార కార్యక్రమం  రెనోకు అద్భుతమైన పరివర్తనకు ప్రతీక. ఈ రెండు రాష్ట్రాల్లో  ఆవిష్కరణ, కస్టమర్-కేంద్రిత ధోరణి పట్ల సంస్థ నిబద్ధతను ఇది ప్రదర్శిస్తుంది.

"రెనో ఎక్స్‌ పీరియన్స్ డేస్" ప్రచార కార్యక్రమం అనేది రెనాల్ట్ ఆవిష్కరణ, కస్టమర్-కేంద్రిత ధోరణి పట్ల నిబద్ధతకు నిదర్శనం. షోరూమ్ అనుభవాన్ని నేరుగా "షోరూమ్ ఆన్ వీల్స్" ద్వారా కస్టమర్ల ఇంటి వద్దకు తీసుకురావడం ద్వారా, "వర్క్‌ షాప్ ఆన్ వీల్స్"తో సౌకర్యవంతమైన, సమర్థవంతమైన వాహన సేవలను అందించడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణాలోని వినియోగదారులకు అసమానమైన, ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించడం రెనో లక్ష్యం. వీటితో పాటు, రెనో ఎక్స్‌ పీరియన్స్ డేస్ ఆన్‌స్పాట్ టెస్ట్ డ్రైవ్, బుకింగ్, కార్ ఫైనాన్స్ ఆప్షన్‌లను కూడా అందిస్తుంది, ఇది కస్టమర్‌లకు వన్ స్టాప్ సొల్యూషన్‌గా చేస్తుంది.

 

రెనో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఐపిఎల్) సేల్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సుధీర్ మల్హోత్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో 'రెనో ఎక్స్‌ పీరియన్స్ డేస్'ని పరిచయం చేయడానికి మేం సంతోషిస్తు న్నాం. ఇది ఒక విప్లవాత్మక కార్యక్రమం. మా బ్రాండ్‌తో మా విలువైన కస్టమర్‌లు కలుసుకునే తీరుతెన్నులను ఇది సమూలంగా  మార్చేస్తుంది. ఆవిష్కరణ, కస్టమర్-కేంద్రిత ధోరణ పట్ల మా అంకితభావం మా 'షోరూమ్ ఆన్ వీల్స్', 'వర్క్‌ షాప్ ఆన్ వీల్స్' ఆఫర్‌లతో షోరూమ్, వర్క్‌ షాప్ అనుభవాలను మా కస్టమర్ల ఇంటి వద్దకే తీసుకు రావడా నికి దారితీసింది. సౌలభ్యం ప్రాముఖ్యత, మేము ఆంధప్రదేశ్‌లోని మొత్తం 14 ప్రాంతాలులు & తెలంగాణలోని 19 ప్రాంతాల్లో ఆన్-ది-స్పాట్ టెస్ట్ డ్రైవ్‌లు, బుకింగ్ సౌకర్యాలు, కార్ ఫైనాన్స్ ఎంపికలను కూడా అందిస్తున్నాం. ఈ సమగ్ర విధానం అందరికీ ఒకే పరిష్కారంగా ఉపయోగపడుతుంది. మా కస్టమర్ల ఆటోమోటివ్ అవసరాలు, రాష్ట్రాల్లో మా సేవా నెట్‌వర్క్‌ ను బలోపేతం చేస్తూ అసాధారణమైన కస్టమర్ సేవకు మా నిబద్ధతను నొక్కి చెబుతుంది" అని అన్నారు.

రెనో తన స్వదేశమైన ఫ్రాన్స్‌ లో శ్రేష్టమైన పనితీరు కనబరుస్తోంది.  ప్రస్తుతం విక్రయాల పరిమాణంలో అగ్రస్థానంలో ఉంటూ, ఐరోపాలో రెండవ స్థానాన్ని పొందడం బ్రాండ్ శ్రేష్ఠత, సుస్థిరమైన ఆవిష్కరణల నిబద్ధతకు నిదర్శనాలు. "రెనో ఎక్స్‌ పీరియన్స్ డేస్" ప్రారంభం రెనో ఇండియా వృద్ధి పథంలో తదుపరి దశను సూచిస్తుంది. ఎందుకంటే కంపెనీ చేపట్టిన ఈ కార్యక్రమం భారతీయ మార్కెట్లో తీవ్ర ప్రభావం చూపుతుంది.

"షోరూమ్ ఆన్ వీల్స్" అనేది రెనో షోరూమ్‌ల మొబైల్ ఎక్స్‌ టెన్షన్‌గా ఉపయోగపడుతుంది. కాబోయే కస్టమర్‌లకు సరికొత్త రెనో వాహనాలను దగ్గరగా చూసే, అనుభూతి చెందేఅవకాశాన్ని అందిస్తుంది. వివరణాత్మక సమాచారాన్ని అందించడానికి, అవగాహనతో కూడిన ఎంపికలు చేయడంలో కస్టమర్‌లకు సహాయం చేయడానికి నిపుణులైన సేల్స్ సిబ్బంది  అందుబాటులో ఉంటారు.

మరోవైపున, "వర్క్‌ షాప్ ఆన్ వీల్స్" కార్యక్రమం వినియోగదారుల ఇంటి వద్దనే రెనో వాహనాల నిర్వహణ,  సేవల ను అవాంతరాలు లేకుండా అందిస్తుంది. అత్యాధునిక సాధనాలతో, అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణు లచే నిర్వహించబడే ఈ వర్క్‌ షాప్‌లు దేశవ్యాప్తంగా ఉన్న రెనో యజమానులకు అసమానమైన సౌలభ్యం,  సామ ర్థ్యాన్ని అందిస్తాయి.

  

షోరూమ్ ఆన్ వీల్స్‌ లో రెనో బహుముఖ ట్రైబర్, స్పోర్టీ కిగర్, స్టైలిష్ క్విడ్ వంటి వాటి ఇంటరాక్టివ్ డిస్‌ప్లేలు ఉంటా యి. ఇది సందర్శకులు తమ సౌలభ్యాన్ని బట్టి రెనో తాజా ఆవిష్కరణలు, భద్రతా ఫీచర్లు, అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని పరిశోధించడానికి, వారి ఇష్టమైన మోడళ్లను టెస్ట్ డ్రైవ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. రెనో ట్రైబర్   భారత దేశంలో అత్యంత సురక్షితమైన మాస్ సెగ్మెంట్ 7-సీటర్. అత్యుత్తమ వాల్యూ ప్యాకేజింగ్‌తో అత్యుత్తమ నాణ్యత, మాడ్యులారిటీ, ఆకర్షణీయమైన డిజైన్‌ను అందిస్తుంది. రెనో ట్రైబర్ అన్ని విశిష్టతలతో పాటు తన విభాగంలో 625L అతిపెద్ద బూట్ స్పేస్‌ను అందిస్తుంది. ఇది ఉత్తమ స్థాయి భద్రత లక్షణాలతో నిర్మించబడింది  గ్లోబల్ NCAP ద్వారా పెద్దల  భద్రతకు సంబంధించి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది.

రెనో ఇండియా ‘ప్రాజెక్ట్ విస్టార్ కింద భారతదేశంలో 450 కంటే ఎక్కువ విక్రయకేంద్రాలు, 500 సర్వీస్ టచ్‌ పాయిం ట్‌లకు ఫిజికల్ నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను విస్తరించింది, ఇందులో దేశవ్యాప్తంగా 230 వర్క్‌ షాప్ ఆన్ వీల్స్ స్థానాలు ఉన్నాయి.

రెనాల్ట్ ప్రజలకు అసమానమైన అనుభవాలను అందించడానికి ప్రయత్నిస్తున్నందున, ఈ పరివర్తన ప్రయాణంలో భాగం కావాలని ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలోని ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తోంది.

More Press News