వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వ పరంగా కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం: తెలంగాణ సీఎస్
Friendly Environment for the Disabled (FED) సంస్థ చైర్మన్ యం.గంగా రామ్, సెక్రటరీలు నారాయణ, యం.వి.నరసింహా రెడ్డి, సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ని బి.ఆర్.కె.ఆర్ భవన్ లో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు.
తెలంగాణలో తమ సంస్థ (FED) అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో కలసి వికలాంగుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నదని, దీనిలో భాగంగానే తొలిసారిగా మన దేశంలో తెలంగాణలో నేషనల్ పార్కు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పార్కులో అన్ని జిల్లాల నుండి వికలాంగులను సేకరించి చేర్పిస్తున్నామని అన్నారు. Rights of the Persons with Disabilities Act (RPD Act -2016)ను అన్ని జిల్లాల వారిగా అవగాహన కల్పించి, అమలు చేయుటకు తగు చర్యలు తీసుకొనుటకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆ వినతి పత్రంలో కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పందిస్తూ, వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వ పరంగా కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.