సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్.. పాల్గొననున్న 25దేశాలు!

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 5వ ఇంటర్నేషనల్ కైట్ అండ్ 3వ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాట్లు ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇతర ప్రభుత్వ అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ కైట్, స్వీట్, స్నాక్స్ పెస్టివల్ తో పాటు తెలంగాణ రాష్ట్ర స్థాయి సంప్రదాయక ఆటలను నిర్వహిస్తున్నామన్నారు. 25 దేశాలకు చెందిన వారు ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటారని వెల్లడించారు. దేశం నలుమూలల నుండి పెద్ద ఎత్తున కైట్ ప్లేయర్ లు, సందర్శకులు ఈ ఫెస్టివల్లో పాల్గొంటారన్నారు.

పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను పర్యవేక్షించిన పర్యాటక , సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఈ ఫెస్టివల్ లో కైట్ ల, స్వీట్ ల తో పాటు స్నాక్స్ ఫెస్టివల్ కూడా జరుగుతుందన్నారు. స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుండి జింఖానా మైదానం లో పురాతన సాంప్రదాయ బద్ధమైన  క్రీడలు.. రాబోయే కాలంలో త్రీ డేస్ నుండి వారం రోజుల పాటు  ఈ ఫెస్టివల్స్ జరుపుతామన్నారు. అన్ని రకాల సాంప్రదాయబద్ధమైన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు , షాపింగ్,  తెలంగాణ వంటకాలు అన్ని ఏర్పాట్లను అందుబాటులో ఉంచుతామన్నారు.


ఈ ఫెస్టివల్ విజయవంతంగా నిర్వహించడం కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈసారి 12 నుండి 15 లక్షల మంది వస్తారని అంచనా.. సందర్శకులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ పాల్గొనే కార్యక్రమాలు ఉంటాయి.. స్వీట్స్, స్నాక్స్, ఫుడ్ లతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సందర్శించవచ్చు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో M D టూరిజం మనోహర్, GHMC జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, పోలీసు శాఖ నుండి అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ACP బేగంపేట నరేష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, టూరిజం అధికారులు శశిధర్, ఓంప్రకాశ్, ట్రాఫిక్ అధికారులు దాశ్రు నాయక్, వాటర్ వర్క్స్ అధికారులు రఘునందన్ రెడ్డి లతో పాటు అనుబంధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.


More Press News