వినూత్న మైన డిజిటల్ ప్రచారం తో నాన్న యొక్క జాదూ పాకెట్ రహస్యాన్ని వెల్లడించిన టాటా AIA

 ముంబయి, 27 జూన్ 2023:  తమ మార్గంలో అడ్డంకులు రానివ్వకుండా, తమ పిల్లలను రక్షించడానికి మరియు వారికి మెరుగైనది అందించటానికి ఒక తండ్రి అన్ని విధాలా కృషి చేస్తాడు మరియు అలా చేయడానికి అతను ఎల్లప్పుడూ తన స్లీవ్‌లో ఒక రహస్యాన్ని కూడా దాచి ఉంచుతాడు. ఈ ఫాదర్స్ డే, భారతదేశంలోని ప్రముఖ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటైన టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్ (టాటా AIA), తమ పిల్లల కలలను నిజం చేయడానికి తండ్రులు పడే కష్టాన్ని 'జాదూ పాకెట్ కా సీక్రెట్' (మ్యాజిక్ పాకెట్ యొక్క రహస్యం) పేరుతో ఒక ప్రత్యేక డిజిటల్ చిత్ర రూపం లో  ఆవిష్కరించింది. 


కుటుంబంలోని ప్రియమైనవారికి బాధ్యతాయుతమైన ప్రదాతగా ఉండటంలో కీలకమైన భాగంగా ఉంటూనే,  ఆర్థిక సదుపాయం యొక్క ప్రాముఖ్యతను ప్రచార చిత్రం నొక్కి చెబుతుంది. ఇది ఒక కొడుకు ప్రయాణాన్ని ప్రదర్శిస్తుంది, అతను తన తండ్రి మాయా జేబు ద్వారా తన కలలను నెరవేర్చుకోవడాన్ని ఎల్లప్పుడూ చూస్తుంటాడు - అది సైకిల్ కావచ్చు, కలల సెలవులు కావచ్చు లేదా అతని MBA విద్య కావచ్చు. అతను స్వయంగా తండ్రి అయినప్పుడు, అతని మాయా లేదా జాదూ  జేబు యొక్క నిజమైన రహస్యాన్ని అతని తండ్రి బయటపెడతాడు. ఫారెస్ట్ ఫిల్మ్స్ అభివృద్ధి చేసి, నిర్మించిన ఈ చిత్రంలో తండ్రి పాత్రలో భారతదేశం యొక్క అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరైన రజత్ కపూర్ నటించారు.


చిన్నతనంలో, డబ్బు యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోలేనప్పుడు, మా నాన్న మా కోరికలను అద్భుతంగా తీర్చారని మేము ఎప్పుడూ అనుకున్నాము. తండ్రులు సాంప్రదాయకంగా తమ చొక్కా జేబుల్లో డబ్బు ఉంచేవారు. ఇందులో 'ది మ్యాజికల్ పాకెట్' అనే కాన్సెప్ట్‌ను సినిమాలో రూపకంగా ఉపయోగించారు. ఈ ఆలోచనను నొక్కిచెప్పడానికి, తన కొడుకు కోరికలను తీర్చడానికి తండ్రి చొక్కా జేబులో నుండి వచ్చే మ్యాజిక్‌ను సినిమా హైలైట్ చేస్తుంది. టాటా AIA యొక్క ఫార్చ్యూన్ గ్యారెంటీ ప్లస్ సేవింగ్స్ ప్లాన్‌తో ఈ మ్యాజిక్ సాధ్యమవుతుందనే సందేశంతో చిత్రం ముగుస్తుంది, ఇది పాలసీ వ్యవధిలో గ్యారెంటీడ్ రెగ్యులర్ ఆదాయాన్ని అందిస్తుంది.


ఈ చిత్రం గురించి టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గిరీష్ కల్రా మాట్లాడుతూ, “కుటుంబంలో సంపాదించే వ్యక్తిగా, ఒక తండ్రి తన పిల్లలు రక్షించబడటానికి మరియు బాగా చూసుకోవడానికి ఎన్నో  నిశ్శబ్ద త్యాగాలు చేస్తాడు. అందుకే అతను మన మొదటి సూపర్ హీరో, ప్రేమ, శ్రద్ధ, బలం మరియు మనం కష్టపడే అన్ని లక్షణాల స్వరూపుడు. మన చిన్ననాటి అనుభవాల ఆధారంగా భావోద్వేగాల పరంగా హత్తుకునే ఈ చిత్రం ద్వారా, తమ ఆత్మీయుల ఆర్థిక భద్రత కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న తండ్రులందరికీ నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాము. మా గ్యారెంటీడ్ ఇన్‌కమ్ ప్లాన్ అనేది వివేకవంతమైన ఆర్థిక ప్రణాళిక ద్వారా తమ పిల్లల ఆకాంక్షలను నెరవేర్చడానికి తండ్రులు ఎంచుకునే సరైన మార్గం.." అని అన్నారు. 


ఫారెస్ట్ ఫిలిమ్స్ సహ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ చెల్కర్ మాట్లాడుతూ, “మేము ఫారెస్ట్ ఫిల్మ్స్‌లో, భారతీయ నాన్నలు తమ డబ్బును ఉంచుకోవడానికి సాధారణంగా ఉపయోగించే నాన్న యొక్క చొక్కా పాకెట్‌ను హైలైట్ చేయాలనే  ఒక ఆలోచనతో ముందుకు వచ్చాము. పిల్లల కోణం నుండి చుస్తే , ఈ చొక్కా జేబులో మాయా శక్తులు ఉన్నాయి. ఎందుకంటే ఇది వారి కోరికలను నెరవేరుస్తుంది మరియు ఎల్లప్పుడూ వారిని ఉత్సాహపరుస్తుంది. దీనిని ఒక రూపకం వలె ఉపయోగించి, మేము పాలసీ హోల్డర్‌లకు క్రమమైన ఆదాయాన్ని అందించే టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ఫార్చ్యూన్ గ్యారెంటీ ప్లస్ ప్లాన్‌తో పిల్లల చిరునవ్వుకు అంతులేని రీతిలో తోడ్పాటు అందించే మ్యాజిక్-ఫిల్డ్ పాకెట్‌ను కనెక్ట్ చేసాము. ఈ చిత్రాన్ని ప్రతిరోజూ మరియు ముఖ్యంగా ఫాదర్స్ డే సందర్భంగా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని ఫారెస్ట్ ఫిల్మ్స్ నమ్ముతుంది" అని అన్నారు. 



More Press News