మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్.. ప్రశంసలందుకుంటున్న బాలీవుడ్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ 8AM మెట్రో

ఏ వృత్తిలో అయినా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలే గానీ గుర్తింపుతో పాటు పాపులారిటీ దానంతట అదే వస్తుంది. కొనసాగుతున్న వృత్తి పట్ల నిబద్దతతో ఉంటూ అందుకు తగ్గట్టుగా కష్టపడితే ఫలితం ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. 
సరిగ్గా అదే బాటలో వెళుతున్నారు సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్. అంచెలంచెలుగా ఎదుగుతూ సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తున్నారు. తొలుత షార్ట్ ఫిలిమ్స్‌కి సంగీతం అందించిన ఆయన రేంజ్ ఇప్పుడు బాలీవుడ్ దాకా ఎగబాకింది. అంతేకాదు ఈ షార్ట్ జర్నీలో ఆయన సంగీతాన్ని మెచ్చి చాలా అవార్డ్స్ కూడా వరించాయి.

2017లో మ్యూజిక్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు మార్క్ కె రాబిన్. మళ్ళీ కలుద్దాం అనే షార్ట్ ఫిల్మ్‌తో కెరియర్‌ ప్రారంభించి.. అదే మూవీకి SIIMA అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో డిలీ బిలీ అనే షార్ట్ ఫిల్మ్‌కి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఆ వెంటనే డైలాగ్ ఇన్ ది డార్క్ అనే మరో షార్ట్ ఫిల్మ్ చేసి పలువురి మెప్పు పొందారు.


అలా సినిమాల్లోకి వచ్చి రావడంతోనే నేషనల్ అవార్డ్స్ కూడా అందుకొని సత్తా చాటారు మార్క్ కె రాబిన్. ఆయన సంగీతం అందించిన మల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాంబి రెడ్డి సినిమాలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అదేవిధంగా విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన లైగర్ మూవీలో చార్ట్‌బస్టర్ నంబర్ వాట్ లగా దేంగే సాంగ్ కి బాణీలు కట్టి సంగీత ప్రియుల మనసు దోచుకున్నారు. నాగార్జున లీడ్ రోల్ పోషించిన యాక్షన్-ప్యాక్డ్ ఫిల్మ్ ఘోస్ట్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడమే గాక మొదటి RAP సాంగ్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్ట్ 8 AM మెట్రో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కోసం పని చేసి బాణీలు కట్టారు మార్క్ కె రాబిన్. ఇందులో ప్రముఖ నూరన్ సిస్టర్స్ వో ఖుదా (ఈద్ ముబారక్ వెర్షన్)ని పాడారు. ఇది మ్యూజిక్ సెన్సేషన్ అయింది. అదేవిధంగా ఇటీవల జూబిన్ నాటియాల్ పాడిన - ఘూమీ పాట ఆర్కెస్ట్రేషన్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలవడం విశేషం.

దీంతో మార్క్ కె రాబిన్ సంగీతానికి బాలీవుడ్ లో డిమాండ్ చేకూరింది. బీ టౌన్ లో ప్రేక్షకాదరణ పొందడమే గాక పలు బెస్ట్ ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. చూస్తుంటే రానున్న రోజుల్లో మార్క్ కె రాబిన్ సంగీతం మరెన్నో అవార్డ్స్ రివార్డ్స్ దక్కించుకుంటుందని తెలుస్తోంది. సమీప భవిష్యత్ లోనే ఆయన కెరియర్ ఉన్నత శిఖరాలకు చేరుతుందని చెప్పుకోవచ్చు.

More Press News