తానా ఆధ్వర్యంలో “తెలుగు నాటకసాహిత్యం” పై జరిపిన చర్చావేదిక విజయవంతం
డాలస్, టెక్సాస్: ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” (ప్రతినెలా ఆఖరిఆదివారం) 47వ అంతర్జాతీయ అంతర్జాలదృశ్యసమావేశం (ఏప్రిల్16, కందుకూరి వీరేశలింగం జయంతి) తెలుగు నాటకరంగదినోత్సవం సందర్భంగా “తెలుగు నాటకసాహిత్యం” అనే అంశంపై విస్తృత సమావేశం విజయవంతంగా జరిగింది.
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర శతాబ్దాల చరిత్ర కల్గిన నాటకరంగంలో పద్యనాటకాలు, పౌరాణిక, సాంఘిక నాటకాలు, రంగస్థల నాటకాలు, రేడియో నాటకాలు సమాజంపై ఒకప్పుడు చూపిన ప్రభావం, ప్రస్తుత దుస్థితి, దాన్ని మెరుగుపరచడానికి వ్యక్తుల, సంస్థల, ప్రభుత్వాలు పోషించవలసిన పాత్రను విశదీకరించి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరికీ ఆహ్వానం పలికారు.
ఆచార్య డా. డి.ఎస్.ఎన్ మూర్తి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు, ప్రముఖ నాటకరచయిత, దర్శకులు ముఖ్యఅతిథిగా పాల్గొని నాటకరంగ పూర్వవైభవం, పునరిద్దరించదానికి తీసుకోవలసిన చర్యలను సోదాహరణంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా శారదా శ్రీనివాసన్, సుప్రసిద్ధ రేడియోకళాకారిణి – “రేడియోనాటకాల స్వర్ణయుగం” అనే అంశంపైన, డా. మామిడి హరికృష్ణ, తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతికశాఖ సంచాలకులు – “తెలంగాణలో నాటకరంగం నేడు-రేపు” అనే అంశంపైన, డా. దీర్ఘాసి విజయభాస్కర్, ప్రముఖ నాటకరచయిత – “దళిత, గిరిజననేపథ్య నాటకాలు” అనే అంశంపైన, డా. బులుసు అపర్ణ, ప్రముఖ శతావధాని – “స్త్రీల సమస్యలపై వెలువడిన నాటకాలు” అనే అంశంపైన, వాడ్రేవు సుందర్రావు, ప్రముఖ రచయిత, వ్యాఖ్యత, నటులు, విశ్రాంతఅధ్యాపకులు – “దేశభక్తి, జాతీయోద్యమ స్పూర్తిదాయక నాటకాలు” అనే అంశంపైన, గుమ్మడి గోపాలకృష్ణ, సుప్రసిద్ధ రంగస్థలనటులు – “పౌరాణిక, చారిత్రాత్మికనాటకాలు” అనే అంశంపైన, డా. కందిమళ్ళ సాంబశివరావు, ప్రముఖ నాటకరచయిత, విశ్రాంతఅధ్యాపకులు – “తెలుగు నాటకకళాపరిషత్తులు” అనే అంశంపైన తమ విలువైన అభిప్రాయాలను వెలిబుచ్చి దివంగత నాటక రచయితలకు, కళాకారులకు నివాళులర్పించారు.
పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించ వచ్చును.
https://www.youtube.com/live/3fmJgYQzrqg?feature=share