నూతన సచివాలయంలో పనిచేసే అదృష్టం కలగడం అదృష్టం -సి.ఎస్ శాంతి కుమారి

హైదరాబాద్, ఏప్రిల్ 30 :: తన 34 సంవత్సరాల ఉద్యోగ ప్రయాణంలో అద్భుతమైన కొత్త కార్యాలయంలో కూర్చుని పనిచేసే అవకాశం తొలిసారిగా రావటమేకాకుండా, నూతన సచివాలయంలో మొట్ట మొదటి చీఫ్ సెక్రటరీగా పనిచేసే అవకాశం దొరకటం ఒక గొప్ప పురస్కారంగా భావిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సి.ఎస్ శాంతి కుమారి స్వాగతోపన్యాసాన్ని చేశారు.


దేశానికే దిక్సూచిగా మన రాష్ట్ర సచివాలయం వెలుగొందాలనే ఆశయానికి అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాల కనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరం చిత్త శుద్దితో పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ సచివాలయం పై భాగంలో అమర్చిన 34 డోములు,, గోడలకు పొదిగిన ఢోల్పూర్ స్టోన్స్ , 8 ఎకరాల సువిశాలమైన lawns, ఫౌంటైన్స్ లతో, ఈ రాష్ట్ర సచివాలయం ప్రస్తుతం “Talk of the Town” గా మారిపోయిందని సి.ఎస్ అన్నారు. కరోనా ప్రభావాన్ని అధిగమించి, భవన నిర్మాణాన్ని 2 సం. 90 రోజుల రికార్డ్ సమయంలో పూర్తిచేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన నిరంతర సమీక్ష వల్లనే సాధ్యమైనదని తెలిపారు. హిందూ, దక్కనీ, కాకతీయుల సాంప్రదాయల అద్భుత సమ్మిళితంగా నిర్మించిన సచివాలయ భవనం, 28 ఎకరాల విస్తీర్ణంలో, 10.52 లక్షల చదరపు అడుగులతో, 265 అడుగుల ఎత్తుతో , లోయర్ గ్రౌండ్, గ్రౌండ్ మరియు 6 అంతస్తులలో నిర్మితమై రాష్ట్రానికే ఒక ఐకాన్ గా నిలిచిందని పేర్కొన్నారు. ఈ అద్భుత సచివాలయ భవన నిర్మాణానికి రాళ్ళెత్తిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

“ ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంతృష్టులై, ఆరంభించి పరిత్య జించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్,  ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచు ధృత్యున్నతో త్సాహులై ప్రారబ్దార్థములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్” అన్న ఏనుగు లక్ష్మణ కవి మాటలను ఉటంకిస్తూ, ఈ అద్భుత నిర్మాణ యజ్ఞం ముఖ్యమంత్రి గారి కార్యసాధనకు ఇది ఒక నిదర్శనమని శాంతి కుమారి పేర్కొన్నారు.

More Press News