క్యూఎల్ఈడీ సెగ్మెంట్ లో గూగుల్ టీవీని లాంచ్ చేసిన హయర్

●      చాలా వేగవంతమైన గూగుల్ యూఐ, గూగుల్ డ్యూయో, 10 వేలకు పైగా యాప్స్, డాల్బీ విజన్ ఐక్యూ మరియు 120హెచ్ జెడ్ రిఫ్రెష్ లాంటి అద్భుతమైన ఫీచర్స్

●      అంతేకాకుండా గూగుల్ అసిస్టెంట్, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్, ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, గూగుల్ ప్లే స్టోర్ లాంటి ఫీచర్స్ కూడా

●      65 మరియు 55 ఇంచ్ ల స్క్రీన్ సైజ్ తో

●      తక్కువ మెటాలిక్ తో అద్బుతమైన స్లిమ్ డిజైన్ – స్మార్ట్ హోమ్స్ కు పర్ ఫెక్ట్ ఛాయిస్

 

 న్యూఢిల్లీ, 25 ఏప్రిల్ 2023: ఇంటి కోసం ఉపయోగించే గృహోపకరణాల తయారీలో ప్రపంచవ్యాప్తంగా లీడర్ గా ఉంది హయర్. 14 ఏళ్ల పాటు మేజర్ అప్లయెన్సెస్‌లో ప్రపంచంలోనే నంబర్ 1 బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది హెయిర్ అప్లయెన్సెస్ ఇండియా (హెయర్ ఇండియా). ఇప్పటివరకు ఎన్నో అద్బుతమైన ఉత్పత్తుల్ని ఈ ప్రపంచానికి అందించిన హయర్... తాజాగా క్యూఎల్ఈడీ సిరీస్ టీవీని గూగుల్ తో ప్రారంభించినట్లు ప్రకటించింది. హయర్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ఇండస్ట్రీలో అత్యుత్తమ పిక్చర్ క్వాలిటీతో క్యూఎల్ఈడీ టీవీ  విభాగంలోకి ప్రవేశిస్తుంది.  ఇది ఆవిష్కరణ, రూపకల్పన మరియు స్మార్ట్ సాంకేతిక నైపుణ్యాల యొక్క సంపూర్ణ సమ్మేళనం.



క్యూఎల్ఈడీ టీవీ లాంచ్‌ సందర్భంగా హయర్ అప్లయెన్సెస్ ఇండియా అధ్యక్షుడు శ్రీ సతీష్ ఎన్ఎస్ మాట్లాడారు. ఆయన “సరికొత్త క్యూఎల్ఈడీ టీవీ సిరీస్‌ను ప్రారంభించడంపై మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది వినియోగదారులకు టీవీని చూడటంలో కొత్త అనుభవాన్ని అందిస్తుంది. 'ఇన్‌స్పైర్డ్ లివింగ్' అనే హయర్ బ్రాండ్ ఫిలాసఫీ పట్ల మా నిబద్ధతకు ఈ ప్రయోగం మరో ఉదాహరణ. కొత్త హయర్ క్యూఎల్ఈడీ టీవీ తాజా ఫీచర్లు మరియు స్టైలిష్ బెజెల్-లెస్ డిజైన్ ద్వారా వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడింది. భారతీయ వినియోగదారులు తెలివైనవారు. వారి జీవితాల్లో సరికొత్త స్మార్ట్ వస్తువుల్ని జోడించడానికి కొత్త స్మార్ట్ ఉత్పత్తుల కోసం చూస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు వినోదాన్ని అలరించే విధంగా కొత్త శ్రేణి క్యూఎల్ఈడీ టీవీ ఎస్9క్యూటీ సిరీస్‌ని మేము ప్రారంభించాం అని అన్నారు.


 

గూగుల్ టీవీతో హయర్ క్యూఎల్ఈడీ సిరీస్

హయర్ యొక్క గూగుల్ టీవీ గూగుల్ సహాయంతో పనిచేస్తుంది. ఇది హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్, క్రోమాకాస్ట్, గూగుల్ ప్లే స్టోర్ మరియు గూగుల్ యుఐ ప్యాకేజీతో వస్తుంది. గూగుల్ టీవీ ఆటో తక్కువ లేటెన్సీ మోడ్ (ఏఎల్ఎల్ఎమ్) వంటి ప్రీమియం ఫీచర్‌లను అందిస్తుంది. ఇది గేమ్ కన్సోల్‌ని డిస్‌ప్లేకు సిగ్నల్‌ను పంపేలా చేస్తుంది. గేమింగ్ కోసం హెచ్ డిఎమ్ఐ 2.1 కోసం తక్కువ-లేటెన్సీ, తక్కువ-లాగ్ మోడ్‌కి ఆటోమేటిగ్గా మారేలా చేస్తుంది. వినియోగదారులు తాము ఎక్కువసార్లు చూసిన మరియు సిఫార్సు చేయబడిన కంటెంట్‌ను హోమ్ స్క్రీన్ నుండి నేరుగా యాక్సెస్ చేసుకోవడంపై ఇది దృష్టి సారిస్తుంది. ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ లా, గూగుల్ టీవీ నెట్‌ఫ్లిక్స్, జీ 5, ప్రైమ్ వీడియో మరియు మరిన్ని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంది.



డిజైన్

కొత్త ఎస్9క్యూటీ క్యూఎల్ఈడీ టీవీ సిరీస్ ప్రీమియం సెంటర్ స్టాండ్‌తో మెటాలిక్, బెజెల్-లెస్, స్లిమ్-డిజైన్‌ను కలిగి ఉంది. ఇది స్మార్ట్ హోమ్‌లకు వారి లివింగ్ రూమ్‌లకు స్లిమ్ మరియు సొగసుగా ఉండేలా చేస్తుంది.

 

పర్ఫెక్ట్ డిస్ ప్లే క్వాలిటీ

సరికొత్త ఎస్9క్యూటీ క్యూఎల్ఈడీ టీవీ సిరీస్ రియలిస్టిక్ పిక్చర్స్ ని 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో అందిస్తుంది. డాల్బీ విజన్ ఐక్యూ (లైట్ కండీషన్ స్థితి విజువల్ కంటెంట్ ను ఆప్టిమైజ్ చేసే అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీ), హై డైనమిక్ రేంజ్ (హెచ్ డీఈర్), వైడ్ కలర్ గామట్ కు ఇది పవర్ వస్తుంది. అధిక కాంట్రాస్ట్ రేషియో, లోకల్ డిమ్మింగ్, ఎమ్ఈఎమ్సీ 120హెచ్ జెడ్ వంటి అనేక ఫీచర్లతో ప్యాక్ ఇది చేయబడింది. ఇది వినియోగదారు వీక్షణ అనుభవంపై దృష్టి కేంద్రీకరించడానికి తగిన ఉత్పత్తిగా మారింది.

 

పర్ ఫెక్ట్ సౌండ్ క్వాలిటీ

కొత్త ఎస్9క్యూటీ క్యూఎల్ఈడీ టీవీ సిరీస్‌తో, వినియోగదారులు తమ ఇళ్లలోని సౌలభ్యం నుండి ప్రీమియం సౌండ్ క్వాలిటీని అనుభవించవచ్చు. క్యూఎల్ఈడీ టీవీ డాల్బీ అట్మోస్, ఫ్రంట్ ఫైరింగ్ సౌండ్ ఈక్యూ, 30 వాట్స్ - ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్‌తో ఖచ్చితమైన సౌండ్ క్వాలిటీని హైలైట్ చేస్తుంది.



స్మార్ట్ ఫంక్షన్స్

హయర్ యొక్క క్యూఎల్ఈడీ టీవీ అనేది ప్రత్యేకమైన గేమింగ్ మోడ్‌తో వస్తుంది. టీవీలో కనెక్ట్ చేయబడిన గేమింగ్ కన్సోల్‌ను గుర్తించినప్పుడు ఏఎల్ఎల్ఎమ్ యాక్టివేట్ అవుతుంది. ఇది 120 హెచ్ జెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది వీఆర్ఆర్ మరియు ఎమ్ఈఎమ్సీ 120హెచ్ జెడ్ ను కలిగి ఉంటుంది, ఇది ప్రతి ఫ్రేమ్‌ను చాలా స్పష్టంగా మారుస్తుంది. హయర్ యొక్క కొత్త గూగుల్ టీవీ క్రోమ్ కాస్ట్ లో ఉన్న గూగుల్ డ్యూయో వీడియో సహాయంతో పాటు మెరుగైన హ్యాండ్స్-ఫ్రీ నియంత్రణ దూరంగా ఉన్న వాయిస్ ని కూడా ఇది అందుకోగలదు.



ఇతర ఫీచర్స్

క్యూఎల్ఈడీ టీవీ సీపీయు సామర్థ్యం కలిగి ఉంది. టీఈఈ 1.3జీహెచ్ జెడ్ తో ఆర్మ్ సీఏ73 క్వాడ్ కోర్, జీపీయు:జీ52 ఎమ్ సీ1 @550ఎమ్ హెచ్ జెడ్ 3జీబీ 32జీబీ ఫ్లాష్ మెమరీతో వస్తుంది. కనెక్టివిటీ ఫీచర్లు వై-ఫై 5( 2.4జీ 5జీ) క్రోమ్ కాస్ట్, బ్లూటూత్ 5.1,హెచ్.డి.ఎమ్.ఐ 2.1, యూ ఎస్ బి 2.0 లాంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి.



ధర మరియు అందుబాటు వివరాలు

·       హయర్ క్యూఎల్ఈడీ టీవీ దేశవ్యాప్తంగా రూ.69,999లకు అందుబాటులో ఉంటుంది


·       హయర్ ఈ-కామర్స్ స్టోర్స్ మరియు ఇతర రిటైల్ ఔట్ లెట్స్ లో అందుబాటు 

More Press News