97 విజయవంతమైన బోన్‌ మ్యారో మార్పిడి

ఈ అద్భుత విజయాన్ని సాధించడంలో తోడ్పడిన తెలంగాణ ప్రభుత్వానికి, సంకల్ప్ ఇండియా ఫౌండేషన్, ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా లిమిటెడ్ లకు టీఎస్ సీఎస్ తన కృతజ్ఞతలు తెలియజేసింది.

హైదరాబాద్, 15 ఏప్రిల్ 2023: తలసీమియా రోగులకు సేవలందిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్‌జిఓ, తెలం గాణ రాష్ట్రంలో ఉన్న తలసీమియా సికిల్ సెల్ సొసైటీ (టీఎస్ సీఎస్) ఉచితంగా 97ఎముక మూలుగు మార్పిడిలను విజయ వంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు ‘సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎముక మూలుగు ప్రక్రియలు, ఇతర అవసరాలకు  అన్ని నిధులతో టీఎస్ సీఎస్ కి సహాయం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి, సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ & ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా లిమిటెడ్ లకు  సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ - ప్రోగ్రామ్ ఎముక మూలుగు మార్పిడి కోసం ఎదురుచూసే రోగులందరికీ ఆశాకిరణాన్ని విస్తరింపజేస్తుంది.

మొత్తం 97 మంది తలసీమియా రోగులకు కొత్త జీవితాన్ని అందించడంలో నిధులు అందించి మద్దతుగా నిలి చిన వారిని సత్కరిస్తోంది మరియు తమసాధారణ జీవితాలకు తిరిగి వచ్చిన పిల్లల కోసం తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తోంది. ఎముక మూలుగు మార్పిడికి సిద్ధంగా ఉన్న తల్లిదండ్రులు, పిల్లలకు   దాని గురించి, భవిష్యత్తు ప్రయోజనాల గురించి సంఘం కౌన్సెలింగ్ సెషన్‌ల ద్వారా అవిశ్రాంతంగా పనిచేస్తోంది. రక్తదానం, యాంటెనాటల్, క్యాస్కేడ్ స్క్రీనింగ్, ఎముక మూలుగు మార్పిడి, HbA2 పరీక్షలు వంటి సేవలను గర్భిణు  లందరికీ తన అన్ని కేంద్రాలలో టీఎస్ సీఎస్ ఉచితంగా అందిస్తోంది.

ఈ సందర్భంగా తలసీమియా సికిల్ సెల్ సొసైటీ (టీఎస్ సీఎస్) అధ్యక్షుడు శ్రీ చంద్రకాంత్ అగర్వాల్ మాట్లాడుతూ, ‘‘ఎముక మూలుగు మార్పిడి మాత్రమే తలసీమియాకు శాశ్వత నివారణ. ఈ మార్పిడి చేయిం చుకున్న 97 మంది పిల్లలు ఇప్పుడు వారి సాధారణ జీవితానికి తిరిగి రావడం మాకు చాలా సంతోషం కలిగి స్తోంది. ఈ మైలురాయిని సాధించడంలో మాకు సహాయం చేసినందుకు టీఎస్ సీఎస్ నిజంగా ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా లిమిటెడ్‌కు రుణపడి ఉంటుంది. తలసీమియా చికిత్సలో ఇది ఒక కొత్త శకానికి నాందిగా మేం భావి స్తున్నాం. తెలంగాణ, భారతదేశం పూర్తిగా తలసీమియా రహితం అయ్యే వరకు మా సేవలను అందించడంలో మా వంతు కృషిని కొనసాగిస్తామని మేం హామీ ఇస్తున్నాం. మరిన్ని ఎముక మూలుగు మార్పిడిని అందించ డానికి మేం మా స్థాయిలో ఉత్తమంగా పని చేస్తాం’’ అని అన్నారు.

తలసీమియా రోగులకు అన్ని సేవలను ఉచితంగా అందించడం ద్వారా టీఎస్ సీఎస్ తలసీమియా రోగులకు,  వారి తల్లిదండ్రులకు ఎలాంటి అవాంతరాలు లేని అనుభవాన్ని అందిస్తోంది. తన చిన్న సేవా కేంద్రంలో కేవలం 20 మంది రోగులతో ప్రారంభించబడిన టీఎస్ సీఎస్ ఇప్పుడు తన కేంద్రంలో 3600 మందికి పైగా రోగులకు సేవలు అందిస్తోంది. 

More Press News