హైదరాబాద్‌లోని పాఠశాలల విద్యార్థులకు శాసనసభలో రాజకీయ కార్యకలాపాల గురించి తెలుసుకునే అవకాశం లభించింది

_హైదరాబాద్, April 12, 2023: హైదరాబాద్  విద్యార్థులకు సువర్ణావకాశం దక్కింది. సిటీలోని 50 పాఠశాలల నుంచి 200 మంది విద్యార్థులకు రాష్ట్ర అసెంబ్లీని సందర్శించే ఛాన్స్ లభించింది. భాగ్యనగరానికి చెందిన వాట్ ఈజ్ మై గోల్ అనే స్టార్టప్ కంపెనీ తెలంగాణ అసెంబ్లీలో రోజువారి కార్యాకలాపాలు తెలుసుకొనుటకు  తమ ప్రత్యేక కార్యక్రమం ద్వారా అవకాశం ఇచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విద్యార్థులు సమావేశమైన అనంతరం అసెంబ్లీ పర్యటనకు వచ్చారు. విద్యార్థులు భారతీయ రాజకీయాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు మరియు వారు పెద్దయ్యాక రాజకీయాల్లోకి ప్రవేశించి దేశానికి సేవ చేయడానికి ఎలా ఎదురుచూస్తున్నారో తెలియజేశారు.

నిన్న, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీ కె.టి.రామారావు గారు హైదరాబాద్‌లో వాట్ఐస్ మైగోల్ అనే స్టార్టప్ ద్వారా నిర్వహించబోతున్న U18 ఎలెక్షైన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    ఈ కార్యక్రమంపై టీఎస్ఐసీ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతా తౌటమ్ మాట్లాడుతూ....వాట్ ఈజ్ మై గోల్ సంస్థకు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు వేర్వేరు రంగాల్లో ఉన్న అవకాశాలతో పాటు రాజకీయ ప్రాతినిధ్యం పైనా అవగాహన కల్పించడం మంచి విషయమని మెచ్చుకున్నారు.
    
తెలంగాణ అసెంబ్లీని సందర్శించడం ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రభుత్వాన్ని నేతలు, అధికారులు నడిపించే తీరుతెన్నులు, వారి రోజువారీ కార్యాచరణను తెలుసుకునే అవకాశం విద్యార్థులకు కలిగిందని శాంతా తౌటమ్ తెలిపారు. ఇలాంటి అసెంబ్లీ పర్యటనని చేపట్టడం బహుశా ఇదే తొలిసారని.. ఇది రాష్ట్రవ్యాప్తంగా పిల్లల్లో ఎంతో స్ఫూర్తిని నింపుతుందన్నారు.

     

వాట్ ఈమ్ మై గోల్ నిర్వహిస్తున్న U18 ఎలెక్షైన్స్పై టీహబ్ సీఈవో శ్రీనివాస రావు మహంకాళి మాట్లాడారు. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే విధానం గురించి విద్యార్థులు తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని శ్రీనివాస రావు చెప్పారు. భవిష్యత్తు లీడర్లకు తమ ఆలోచనలను పదునుపెట్టి ఆచరణలో పెట్టేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. 

More Press News