అల్లు అర్జున్ బర్త్ డే: పుష్ప అనుకుంటాం కానీ, ఐఎండీబీలో ఎక్కువ రేటింగ్ ఉన్నఅయనసినిమా మరొకటి

అల్లు అర్జున్ తెరంగేట్రం చేసిన రెండు దశాబ్దాల్లోనే ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చివరి చిత్రం పుష్ప: ది రైజ్ - పార్ట్ 1కూడా దేశాన్ని ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ప్రతిచోటా మిమర్స్కికావాల్సినంత ఉత్సాహాన్ని కూడాఇస్తోంది. ఆర్య, అల వైకుంఠపురములో, పరుగువంటి చిత్రాల్లో విభిన్న నేపథ్యాలకు చెందిన పాత్రలను పోషించడంలోఆయన చూపిన బహుముఖ ప్రజ్ఞ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని కూడా అందుకున్నాడు.

అల్లుఅర్జున్నటించినచిత్రాల్లోవేదం చిత్రానికి (8.1)ఐఎండిబిలోఅత్యదిక రేటింగ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబికి 200 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల వీక్షణల ఆధారంగా గత ఏడాది డిసెంబర్ లోరుపొందించిన  టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ 2022జాబితాలోఅల్లు అర్జున్ఐఎండిబి లో తొమ్మిదవ స్థానాన్ని పొందాడు.రాబోయే పుష్ప: ది రూల్ - పార్ట్ 2అనేపుష్ప ఫ్రాంచైజీ రెండో భాగంలో అల్లు అర్జున్ నటించనున్నారు.

 

ఐఎండీబీలో అల్లు అర్జున్ టాప్ 10 మూవీస్ ఇవే.

1.వేదం- 8.1

2. ఆర్య -7.8

3.పుష్ప: ది రైజ్ - పార్ట్ 1- 7.6

4. ఆర్య 2 -7.4

5. అల వైకుంఠపురములో- 7.3

6. జులాయి -7.2

7.రేసుగుర్రం- 7.1

8. పరుగు- 7.1

9. సంతోషం- 7.1

10. S/Oసత్యమూర్తి -7

More Press News