విద్యుత్ పొదుపు చేసిన సంస్థలకు అవార్డ్ లు ప్రదానం చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై!

  • టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో తెలంగాణ స్టేట్ ఎనర్జి కన్జర్వేషన్ అవార్డ్స్ 2019

  • ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్ కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు, విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా, టీఎస్ రెడ్కో చైర్మైన్ అబ్దుల్ అలీమ్, టీఎస్ రెడ్కో వైస్ ఛైర్మన్ జానయ్య


దేశంలోనే గొప్ప రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం - గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్:

  • ప్రధాన మంత్రి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడిన సమయంలో విద్యుత్ ను పొదుపు చెయ్యాలని చెప్పారు

  • విద్యుత్ పొదుపు చేసేందుకు చొరవ చూపాలని చెప్పారు

  • తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పొదుపు ఎక్కువగా చేస్తున్నారు

  • హైదరాబాద్ లో ఎక్కడ చూసిన ఎల్ ఈడి బల్బ్ లు వాడుతున్నారు ఇది శుభపరిణామం

  • కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇంజనీరింగ్ వండర్, ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది

  • కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మొక్కలు తొలగించారు, అంతే మొత్తంలో కోట్లలో మొక్కలు నాటారు. ఇది చాలా గొప్పతనం

  • చెట్లు పెట్టడం వలన కార్బన్ మొనక్సయిడ్ అరికట్టేందుకు ఉపయోగపడుతుంది

  • హరిత హారం అనేది గొప్ప కార్యక్రమం. పీఎం, సీఎం కేసీఆర్ చాలా గొప్పగా హరితహారం కార్యక్రమం చేస్తున్నారు

  • విద్యుత్ పొదుపు అవార్డ్స్ అందుకుంటున్న వారికి అభినందనలు

  • విద్యుత్ పొదుపు ఒక్కటే కాదు నీటిని కూడా పొదుపు చెయ్యాలి

  • విద్యార్థులు, ప్రజలకి విద్యుత్, నీటి పొదుపుపై అవగాహన కల్గించాలి

  • సీఎం కేసీఆర్ చేస్తున్న కార్యక్రమం బాగా ఉన్నాయి

విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి:

  • తెలంగాణ రాష్ట్రం భారత దేశానికి ఒక్క డిక్సుచి లాగా ఉంది

  • రాష్ట్రం ఏర్పడిన నాటికీ విద్యుత్ లేధు, తెలంగాణ మలిదశ ఉద్యమం విద్యుత్ కోసమే వచ్చిందని చెప్పక తప్పదు

  • తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొదటి పని విద్యుత్ రంగంపై దృష్టి

  • తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంకు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు అప్పుడు కానీ ఇప్పుడు రైతుకు కూడా 24 గంటల విద్యుత్ ఇద్దాం అని సీఎం కేసీఆర్ చెప్పారు

  • దేశంలోనే గొప్ప రాష్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

  • విద్యుత్ ను ఆదా చెయ్యాలి దీనితో పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది

  • టీఎస్ రెడ్కో వలన పవర్ పొదుపు చేసే సంస్థలకు అవార్డులు ఇస్తున్నారు ఇది గొప్ప విషయం

  • గ్రీన్ ఎనర్జి ఉత్పత్తి చేసేవారికి తోడ్పాటు ఉంటుంది

టీఎస్ రెడ్కో కు కృతజ్ఞతలు: ప్రభాకర్ రావు టీఎస్ జెన్కో సిఎండి
  • టీఎస్ రెడ్కో సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతుంది

  • 150 కమర్షియల్ బిల్డింగ్ లలో విద్యుత్ పొదుపు చేస్తున్నారు

  • తెలంగాణ రాక ముందు పవర్ కట్ లు ఉండేవి, గతంలో ఇండస్ట్రీలకు పవర్ హాలిడే లు ఇచ్చేవారు

  • వ్యవసాయ శాఖ రంగంకు విద్యుత్ ఎప్పుడు వస్తుందో లేదో తెల్వదు

తెలంగాణ వచ్చాక వ్యవసాయ రంగంకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్రం తెలంగాణ:

  • 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం

  • దేశంలోనే గొప్ప ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కూడా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నాం

  • విద్యుత్ సరఫరా సీఎం కేసీఆర్ కృషి వలనే సాధ్యం అయింది

  • మంత్రి జగదీష్ రెడ్డి, సీఎం కేసీఆర్ కృషి వలనే ఇవ్వాళ 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం

  • రెడ్కో కూడా అనేక కార్యక్రమాలు చేపడుతుంది

  • ఇప్పటికే అనేక సంస్థలకు సోలార్ విద్యుత్ అందిస్తున్నాంAwards Lists: 


More Press News