క్రిస్మస్ విందుకు పకడ్బందీగా ఏర్పాట్లు: మంత్రి కొప్పుల ఈశ్వర్

క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రైస్తవ కుటుంబాలకు ఇచ్చే విందు ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని రాష్ట్ర మైనారిటీ, షెడ్యూల్ కులాల అభివృద్ధి, దివ్యాన్గుల, సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బుధవారం లాల్ బహదూర్ స్టేడియంలో క్రిస్మస్ విందు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ క్రిస్మస్ పండగ సందర్భంగా క్రైస్తవ కుటుంబాలకు ఇచ్చే విందు ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న సుమారు 14 శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. పెద్ద మొత్తంలో క్రైస్తవ కుటుంబాలు ఈ కార్యక్రమానికి హాజరవుతుందున అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని వారికి ఏరకంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ సలహాదారు ఎ.కె.ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, GHMC డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా,  మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షాన్ వాజ్ ఖాసీం, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ MD కాంతి వెస్లీ పాల్గొన్నారు. 


More Press News