మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ

నూతన ఆలోచనలను స్వాగతిద్దాం

ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సెమినార్ లో మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ

భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఔత్సాహిక  మహిళా పారిశ్రామికవేత్తల బలోపేతానికి, మార్కెట్ పోటీని తట్టుకునే విధంగా నూతన ఆలోచనలను స్వాగతిద్దామని మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ అన్నారు..

జాతీయ మహిళా కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సంయుక్తంగా నిర్వహించిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల ఒక రోజు సదస్సు శుక్రవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ గొల్లపూడి నందు జరిగింది. సదస్సుకు ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ, మహిళా కమిషన్ సభ్యులు గడ్డం ఉమా, రోఖయా బేగం, వినీత పాల్గొని ప్రసంగించారు..

తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్ ను శ్రీమతి వాసిరెడ్డి పద్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్ వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మన రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకునే మహిళలతో ఈ సెమినార్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

   ప్రభుత్వము నుండి ఎటువంటి ప్రోత్సాహం కోరుకుంటున్నారు అని వాళ్లు వ్యాపారాల్లో ఎదగడానికి ఇంకా ఏం ప్రోత్సాహం కావాలని చర్చించడానికి వీలుగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పచ్చళ్ళు పెట్టిన జ్యూట్ బ్యాగులు తయారు చేసిన ముగ్గు వేసినా ఆకుకూరలు పండించిన మహిళలుగా తమ ప్రత్యేకతను చాటుకున్నారు అని అన్నారు. మార్కెటింగ్ లో లోపాలు ఉంటే తప్ప తయారు చేసే ఉత్పత్తుల క్వాలిటీ గాని రుచి గాని వాటి మన్నికకు సంబంధించిన దాంట్లో ఎక్కడా రాజీ లేకుండా ఉన్నారు అని చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను మీరందరూ కూడా గమనిస్తున్నారు. దేశంలో బహుశా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ప్రభుత్వం ఒక యజ్ఞం లాగా పనిచేస్తుంది. మహిళలకు సంబంధించి వారి జీవితాల్లో మార్పు రావాలని అమ్మ ఒడి పథకం దగ్గర నుండి ఏ పథకమైన మహిళలు సంతోషంగా ఉండాలని ప్రతి పథకం కూడా తీసుకువచ్చారు. వైయస్ ఆసరా కాని, 0 వడ్డీ పథకం కింద చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునేందుకు వీలుగా ఈరోజున ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ఇక్కడ స్టాల్ లో డిస్ప్లే పెట్టారు మిల్లెట్స్ తో తయారు చేసిన టీ కప్స్ ఇలాగా కొత్త ఆలోచన రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళలు ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటున్నారు. అదే విధంగా  వైయస్సార్ చేయూత వంటి పథకాలు 40 నుంచి 50 ఏళ్ల పై ఉన్న మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. మహిళల పేరున ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. యజమాని అంటే మహిళ అనేది సమాజానికి అలవాటు చేస్తున్నాము అన్నారు. ఇటువంటి భరోసా ముఖ్యమంత్రి గారు మహిళలకు కల్పించారు. మన రాష్ట్రంలో గ్లోబల్ సమితి నిర్వహంచే స్థాయికి మహిళా పారిశ్రామిక వేత్తలు ఎదగాలి అన్నారు. సాంకేతికతను అందించి మరింత ఎక్కువ మంది మహిళలు వ్యాపార రంగంలో ప్రవేశించడానికి మహిళా పారిశ్రామికవేత్తల వేదిక ఇది అన్నారు. కార్యక్రమంలో మహిళ కమిషన్ సెక్రటరీ శైలజా,  రైతు సాధికార సంస్థ అధికారి అరుణ, మెప్మా, జిల్లా గ్రామీణ సంస్థ అధికారులు, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు  పాల్గొన్నారు. 

More Press News