క్రికెట్‌ సెన్సేషన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంచుకున్న భారతదేశంలో సుప్రసిద్ధ ఫాస్ట్‌ ఫ్యాషన్‌ మెన్స్‌వేర్‌ బ్రాండ్‌ TIGC

డిజిటల్‌ ఫస్ట్‌ ఫ్యాషన్‌ ప్రచారంలో ఈ క్రికెటర్‌ కనిపించడంతో పాటుగా పూర్తి సరికొత్త ఫ్యాషన్‌ శ్రేణిని ప్రచారం చేయనున్నారు


బెంగళూరు, 07 మార్చి 2023 :  భారతదేశంలో సుప్రసిద్ధ, దేశీయంగా వృద్ధి చెందిన  ఫాస్ట్‌ ఫ్యాషన్‌ డీ2సీ మెన్స్‌వేర్‌ బ్రాండ్‌ Indian Garage Co చెందిన సంస్ధ TIGC  తాము  తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా భారతీయ క్రికెటర్‌ సూర్యకుమార్‌యాదవ్‌ను ఎంచుకున్నట్లు వెల్లడించింది.


సూర్యకుమార్‌ యాదవ్‌ (SKY)ప్రపంచంలో  అగ్రగామి వైట్‌ బాల్‌ క్రికెటర్లలో ఒకరు. మిస్టర్‌ 360 గా అందరికీ తెలిసిన ఎస్‌కె వై ,  ఐసీసీ యొక్క టీ 20 ఇంటర్నేషనల్‌ బ్యాటర్లలో నెంబర్‌ 1. అసాధారణ క్రీడాకారుడు సూర్యకుమార్‌, అత్యంత తేజోవంతమైన యూత్‌ ఐకాన్‌ అతను.  ఇవే అంశాలు ఖీఐఎఇకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సూర్యకుమార్‌ను నిలిపాయి.


TIGC ఇప్పుడు అతని ప్రజాదరణపై ఆధారపడి డిజిటల్‌ క్యాంపెయిన్స్‌ ద్వారా తమ బ్రాండ్‌ విజిబిలిటీ పెంచుకోవడం, వీక్షకులతో సంబంధాలను వృద్ధి చేసుకోవడం మరియు భారతీయ యువత నడుమ అగ్రగామి ఫ్యాషన్‌ ఎంపికగా నిలువడం చేయనుంది.  SKY ఇప్పుడు పూర్తి సరికొత్త శ్రేణి క్యాజువల్‌ అప్పెరల్‌ శ్రేణికి ప్రచారం చేయనున్నారు. వీటిలో  ఓవర్‌సైజ్డ్‌ టీ షర్టులు, క్యాజువల్‌ షర్ట్స్‌, స్వెటర్స్‌, షార్ట్స్‌, హుడీస్‌, జాకెట్లు, చినోస్‌, డెనిమ్‌ మరియు స్వెట్‌షర్ట్స్‌ ఉన్నాయి.


ఈ భాగస్వామ్యం గురించి Indian Garage Co ఫౌండర్‌ మరియు సీఈఓ  అనంత్‌  టాంటెడ్‌ మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో  డిజిటల్‌ ఫస్ట్‌ ఫ్యాషన్‌ మార్కెట్‌ను చేజిక్కుంచుకునేందుకు మా తొలి అడుగు ఇది. TIGC బ్రాండ్‌ అంబాసిడర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంచుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. అతను అత్యద్భుతమైన క్రీడాకారుడు. అతని  ఉత్సాహం క్రీడలకు ఆత్మీయంగా ఉంటుంది. ఆవిష్కరణ, భయంలేనితనం , సాహసం, సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచే TIGCకి  ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. అతనితో బలమైన బంధం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు తమ అధికారిక వెబ్‌సైట్‌ TIGC.IN తో పాటుగా TIGC ఇప్పుడు Ajio, Myntra, Flipkart, Amazon పై కూడా లభ్యమవుతుంది.  ఈ బ్రాండ్‌ క్లాతింగ్‌లో సాధించిన విజయాన్ని ఫుట్‌వేర్‌ విభాగంలో సైతం సాధించాలనుకుంటుంది. ఇప్పటికే ఇది మహిళల వస్త్రాల విభాగంలో ప్రవేశించడంతో పాటుగా ప్లస్‌ సైజ్‌ ఫ్యాషన్‌లో  హౌస్‌ ఆఫ్‌ బ్రాండ్స్‌ ఫార్మాట్‌ కింద ప్రవేశించింది.

     


ఈ భాగస్వామ్యం పట్ల తన ఆనందాన్ని సూర్యకుమార్‌  యాదవ్‌ వెల్లడిస్తూ ‘‘ నా వరకూ ఫ్యాషన్‌ అంటే శైలి, సౌకర్యంల సమ్మేళనం. TIGC లాంటి బ్రాండ్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాను. నా అభిమానులతో  అనుసంధానించబడటంతో పాటుగా నా శైలి ప్రదర్శించగలననుకుంటున్నాను’’ అని అన్నారు.


ఫ్యాషన్‌ ఫార్వాడ్‌ మరియు స్వాభావికంగా ప్రయోగాత్మకంగా సుపరిచితమైన పేరు TIGC. ఈ బ్రాండ్‌ అందరికీ ఫాస్ట్‌ ఫ్యాషన్‌ను అందిస్తుంది. అంతేకాదు వినియోగదారులకు సమగ్రమైన, ట్రెండీయెస్ట్‌ శ్రేణి శైలి నుంచి ఎంచుకునేందుకూ స్ఫూర్తి కలిగిస్తుంది.తన వైవిధ్యమైన  ఆఫరింగ్స్‌తో పాటుగా వీక్లీ ఫ్యాషన్‌ ఆవిష్కరణలు, సాంకేతిక ఆధారిత వినియోగదారుల ప్లాట్‌ఫామ్‌తో ,  TIGC స్పష్టంగా ఫ్యాషన్‌ అభిమానులకు ప్రాధాన్యతా కేంద్రంగా నిలుస్తుంది. మరీ ముఖ్యంగా తమ శైలి పరంగా ప్రయోగాత్మకంగా ఉండటంతో  పాటుగా  అందరిలో కూడా ప్రత్యేకంగా ఉండాలనుకునే వారికి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ బ్రాండ్‌ ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో  పాటుగా సాంకేతిక ఆధారిత ఫ్యాషన్‌ను వినియోగదారులకు తమ అంతర్గత సాంకేతికత చాణక్య ద్వారా అందిస్తుంది.
 

More Press News