ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల తిరిగొచ్చిన భారతీయ మెడికోలకు సన్మానం

- ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్  కోసం ఎఫ్ఎంజీఈ (స్క్రీనింగ్ టెస్ట్)లో ఉత్తీర్ణత

 

హైదరాబాద్, మార్చి 6: నియో-జెడ్ఎస్ఎం యూనివర్సిటీలో చదువుతున్న, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వల్ల తిరిగి వచ్చిన భారతీయ మెడికోలందరూ ఈ రోజు పట్టభద్రులయ్యారు. వీరిలో, 72 మంది విద్యార్థులు ఎన్ఎంసి రిజిస్ట్రేషన్ కోసం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు, ఇది వారి మొదటి ప్రయత్నంలో దాదాపు 70% విజయ రేటు. ఇది భారతదేశంలో కఠినమైన మెడికల్ లైసెన్సింగ్ పరీక్ష. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో నిర్వహించిన 2022 గ్రాడ్యుయేషన్, సక్సెస్ మీట్ లో ఎఫ్ఎంజీఈలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉత్తీర్ణులైన విద్యార్థులందరినీ ఘనంగా సన్మానించారు.

ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ప్రధాని మోడీ చేపట్టిన ఆపరేషన్ గంగా వల్ల చాలా మంది భారతీయ మెడికోలు ప్రాణ రక్షణ కోసం తమ వైద్య విద్య సమయంలో స్వదేశానికి రావాల్సి వచ్చింది. ఏదేమైనా, ఎన్ఎంసి సడలింపుపై, జపోరిజ్జియా స్టేట్ మెడికల్ యూనివర్శిటీ (జెద్ఎస్ఎంయూ)లోని ఎన్ఈఓ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎన్ఈఓ) చివరి సంవత్సరం మెడికోల ఉమ్మడి కృషితో డిగ్రీలను పూర్తి చేయగలిగారు. అదే సమయంలో 70% మంది వారి మొదటి ప్రయత్నంలోనే ఎఫ్ఎంజిఇ (స్క్రీనింగ్ టెస్ట్) లో ఉత్తీర్ణులయ్యారు.

   వారి విద్యా ప్రయాణంలో కొ విడ్ -19 మరియు యుద్ధ సంక్షోభం వంటి అపారమైన సవాళ్లను ఎదుర్కొన్న ఈ మెడికోల కృషి మరియు అంకితభావానికి ప్రశంసా సంకేతంగా ఈ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు.  జి.కిషన్ రెడ్డి గారు (కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రి) ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన విద్యార్థులకు డిగ్రీలు, ఎఫ్ ఎమ్ జిఇ పాస్ పై బంగారు పతకాలు, కొవిడ్ వారియర్ & ఎవాక్యుయేషన్ బ్రేవరీ అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరెడ్డి, పి.విజయబాబు, డాక్టర్ దివ్య రాజ్ రెడ్డి, డాక్టర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

More Press News