తెలంగాణాలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ఉతమిచ్చేలా మెదక్‌లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ ఏర్పాటుచేసిన ఐటీసి
మెదక్, జనవరి 30, 2023 : తెలంగాణా రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఐటీ , ఈ అండ్ సీ , పురపాలక పరిపాలన మరియు నగరాభివృద్ధి శాఖామాత్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు నేడు ఐటీసీ యొక్క అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ ని తెలంగాణాలోని మెదక్ వద్ద ఐటీసీ లిమిటెడ్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజీవ్ పురి సమక్షంలో ప్రారంభించారు. దాదాపు 59 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ 6.5 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో ఉంటుంది. మొదటి దశలో 450కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతుంది. సస్టెయినబల్ అగ్రి–వాల్యూ చైన్ వ్యాప్తంగా భారీ స్ధాయిలో జీవనోపాధి అవకాశాలను ఇది సృష్టించనుంది. ఈ ఫ్యూచర్ రెడీ ఫెసిలిటీ సమగ్రమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను కలిగి ఉండటంతో పాటుగా ఐటీసీ యొక్క ప్రపంచశ్రేణి ఫుడ్ బ్రాండ్లు అయిన ఆశీర్వాద్ ఆటా, సన్‌ఫీస్ట్ బిస్కెట్లు, బింగో చిప్స్ మరియు యిప్పీ నూడిల్స్ వంటి వాటిని దశల వారీగా ఉత్పత్తి చేయనుంది.
ఐటీసీ యొక్క అగ్రి–బిజినెస్, వరి, జొన్న, తృణధాన్యాలు మరియు మిర్చి, పసుసు వంటి పంటలపై ప్రత్యేకంగా దృష్టి సారించి పంటల అభివృద్ధి కోసం తెలంగాణాలోని రైతులతో అతి సన్నిహితంగా పనిచేస్తుంది . ఈ కంపెనీ పెద్ద మొత్తంలో ఆహార పదార్థాలను రాష్ట్రం నుంచి సేకరించి ఎగుమతి చేయడం ద్వారా తెలంగాణా రైతులను అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుసంధానిస్తుంది. డిజిటల్ సాంకేతికతల శక్తిని రైతుల చెంతకు తీసుకురావడంలో భాగంగా ఐటీసీ వినూత్నమైన ఫిజిటల్ నమూనా ఐటీసీ మార్స్– మెటా మార్కెట్ ఫర్ అడ్వాన్స్‌డ్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ సర్వీసెస్– ను విడుదల చేసింది. రైతుల అవసరాలను తీర్చే సొల్యూషన్ ఇంటిగ్రేటర్‌గా ఇది పనిచేస్తుంది. నేడు రాష్ట్రంలో ఐటీసీ మార్స్ పర్యావరణ వ్యవస్థ 6 ఎఫ్‌పీఓలతో కలిసి పనిచేయడంతో పాటుగా 1600 మందికి పైగా రైతులకు ప్రయోజనం కలిగిస్తుంది. దీనిని 15కు విస్తరించడం ద్వారా రాబోయే సంవత్సరానికి 45వేల మంది రైతులకు ప్రయోజనం కలిగించనున్నారు.
రాష్ట్రంలో తమ సీఎస్‌ఆర్ కార్యకలాపాలను సైతం ఐటీసీ విస్తరించింది. వీటిలో మహిళా సాధికారిత, నైపుణ్యాభివృద్ధి, ప్రాధమిక విద్య, పశు సంరక్షణ, ఆరోగ్యం,పారిశుద్ధ్యం మరియు ఘన వ్యర్థాల నిర్వహణ వంటివి ఉన్నాయి.