మరణించినా..సజీవుడిగా ఆరు అవయవాలు దానం
హైదరాబాద్, జనవరి 27 :
పుట్డెడు దు:ఖంలో ఉండి కూడా ఇతరులకు సాయం చేయాలని ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం అందరికీ మార్గదర్శంగా మారింది. కుటుంబ పెద్ద మరణిస్తే అతని అవయవాలు దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో నివాసం ఉండే అన్నపురెడ్డి నరసింహరెడ్డి (50) ఈ నెల 23న పనుల నిమిత్తం తన ద్విచక్ర వాహనం మీద ఇంటి నుండి బయలుదేరాడు. చిలుకానగర్ సమీప ప్రాంతంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కార్ ఢీ కొట్టింది. దీంతో చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకవెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిత్రికి తరలించారు. అతన్ని రక్షించడానికి వైద్యులు ఎంతో శ్రమించారు. కానీ దురుదృష్టవశాస్తూ గురవారం బ్రెయిన్ డెడ్ అయ్యారు.
ఆ తర్వాత అవయవదానంపై కిమ్స్ ఆస్పత్రిలోని అవయవదాన సమన్వయ కర్తలు, మృతురాలి కుటుంబ సభ్యులకు, బంధువులకు, అవగాహన కల్పించారు. అనంతరం వారి అంగీకారంతో లివర్, కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె దానం చేశారు. చనిపోతూ మరో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింనందుకు గర్వంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య అన్నపూర్ణ, కుమారుడు విజయ్ కార్తీక్, కుమార్తె ఇషా రెడ్డిలు ఉన్నారు. జీవన్‌ధాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానెల్ ద్వారా అవసరం ఉన్నచోటికి అవయవాలను తరలించారని జీవన్ దాన్ కమిటీ సభ్యులు తెలిపారు.