ఆర్థిక పరమైన సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం- ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

హైదరాబాద్, జనవరి 19 :: ఆర్థిక పరమైన సైబర్ నేరాల నియంత్రణ కై పోలీస్ అధికారులు, రిజర్వ్ బ్యాంక్ అధికారులు సమన్వయంతో కృషి
చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ఆర్థిక పరమైన సైబర్
నేరాల నియంత్రణపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశం (SLCC) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగింది. ఈ
సమావేశంలో నాన్ బ్యాంకింగ్ ఆర్ధిక కార్యకలాపాలు, ఆర్థిక మోసాలు, రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్, డిపాజిట్ ల సేకరణ తదితర అంశాలలో ప్రజల
నుండి అందిన ఆర్ధిక లావాదేవీల ఫిర్యాదులు, వాటిపై న్యాయ స్థానాలలో నమోదైన కేసులను సమీక్షించారు.


ఈ సమావేశంలో సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ, నాన్బ్యాం కింగ్ తరహా లోన్ యాప్ ల ద్వారా మోసపూరిత కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నందున, ఈ నేరాలపట్ల ప్రజలను అప్రమత్తత చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆర్థిక పరమైన నేరాలకు సంబందించిన
ఫిర్యాదులు పోలీస్ యంత్రాంగం దృష్టికి వచ్చిన వెంటనే, వాటిపై చర్యలకు తక్షణమే ఉపక్రమించాలని సి.ఎస్ పేర్కొన్నారు. సైబర్ నేరాల
పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఈ సైబర్ ఆధారిత నేరాల నిరోధంపై ప్రజలను చైతన్య పరచడంతోపాటు అవగాహన చేపట్టాలని శాంతి
కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్‌బిఐ రీజినల్ డైరెక్టర్ కె. నిఖిల, ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ రుచి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ IG రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ , రాష్ట్ర సి.ఐ.డి విభాగం డైరెక్టర్ జనరల్ మహేశ్ భగవత్, సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్ సుమిత్ర తదితర అధికారులు పాల్గొన్నారు.
--------------------------------------------------------------------------------------------------------------------------

కమీషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ చే జారీ చేయనైనది.

More Press News