తమ రెండవ ప్లాట్‌ ప్రాజెక్ట్‌, జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ సిటీని విజయవాడ హైవే వద్ద ప్రారంభించిన జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ !

·       జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌
·       దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా  1242 ఎకరాల ఇంటిగ్రేటెడ్‌ సిటీ. దీనిలో  267–533 చదరపు గజాల విస్తీర్ణంలో  368 ప్రీమియం విల్లా ప్రాజెక్ట్‌లు భాగంగా ఉంటాయి

హైదరాబాద్‌, 06 జనవరి 2023 : జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ సిటీని ప్రారంభించింది. రెరా మరియు హెచ్‌ఎండీఏలు పూర్తిగా అనుమతించిన జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ సిటీ,   పలువురు రియల్‌ ఎస్టేట్‌ నిపుణు లు ‘కాబోయే  గచ్చిబౌలి’గా పేర్కొంటున్న  హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారి మార్గంలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌ 1242 ఎకరాల విస్తీర్ణంలో  ఉంటుంది. మొదటి దశ ప్రాజెక్ట్‌లో 368 ఎకరాలను 140కు పైగా అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ది చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్లాట్‌లను కొనుగోలు చేసిన వారందరికీ హైదరాబాద్‌లో అతి  పెద్ద క్లబ్‌ హౌస్‌ (5.65 ఎకరాలు) సేవలను  వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.  జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ సిటీకి 24 గంటలూ సిసీటీవీ నిఘా ఉంటుంది. ఈ  ప్రాజెక్ట్‌లో పలు ఇంటిగ్రేటెడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సదుపాయాలు కూడా భాగంగా ఉంటాయి. వాటిలో 100 ఎకరాల గోల్ఫ్‌ కోర్స్‌, 40 ఎకరాల లగ్జరీ రిసార్ట్‌, వెల్‌నెస్‌ కేంద్రం, స్పోర్ట్స్‌ అకాడమీ, స్కూల్‌, కాలేజీ మరియు మరెన్నో ఉంటాయి.

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై కొండలు, పంట భూముల మధ్యన  దాదాపు 279 ఎకరాల సహజసిద్ధమైన చెరువు ప్రాంతం సమీపంలో జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ సిటీ ఉండటంతో పాటుగా హైదరాబాద్‌లో అతి పెద్ద రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌టలో ఒకటిగా నిలుస్తుంది. హైదరాబాద్‌–విజయవాడ హైవే మార్గంలో వేగవంతమైన వృద్ధి కనిపిస్తుండటం చేత ఈ కారిడార్‌లో తప్పనిసరిగా ధరలు పెరుగుతాయి.
తూర్పు కారిడార్‌లో గతంలో ఎన్నడూ చూడనంత అభివృద్ధి కనిపిస్తుంది. దాదాపు 35వేల నూతన ఉద్యోగాలు ఈ కారిడార్‌లో సృష్టించబడ్డాయి. భారీ బహుళ జాతి కంపెనీలు తమ నూతన క్యాంపస్‌ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. దాదాపు ఐదు ఐటీ పార్క్‌లు,  పారిశ్రామిక ఎస్టేట్‌లు, ఎంఎస్‌ఎంఈలు,పలు లాజిస్టిక్‌ హబ్‌లు ఈ మార్గంలో రాబోతున్నాయి. ఈ హైవే మార్గంలోనే దాదాపు 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద  ఫిలిం స్టూడియో రామోజీఫిలింసిటీ నిర్మించబడింది. దీనికి తోడు ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం విజయవాడ హైవేను  ఆరు లేన్ల రోడ్‌గా విస్తరించనున్నట్లు ప్రకటించింది. దీనికి తగిన పనులు కూడా ప్రారంభమమ్యాయి. ఆరు లేన్ల రోడ్డుకు దగ్గరలో  ప్రోపర్టీ అంటే  ధరలు కూడా  పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి.

జీస్క్వేర్‌ హౌసింగ్‌ సీఈఓ  ఈశ్వర్‌ ఎన్‌ మాట్లాడుతూ ‘‘ఇటీవలనే మా మొదటి ప్రాజెక్ట్‌ జీస్క్వేర్‌ ఈడెన్‌ గార్డెన్‌ను బీఎన్‌ రెడ్డి నగర్‌లో  ఆవిష్కరించాము. దానికి అపూర్వమైన స్పందన లభించింది.  హైదరాబాద్‌లోని మా వినియోగదారులకు  అపూర్వమైన ప్రాజెక్ట్‌లను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. నేడు మా మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ జీస్క్వేర్‌ ఎపిటోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ సిటీని  విజయవాడ హైవే వద్ద ప్రారంభించాము.  పలు జీవనశైలి ఫీచర్లతో 1242 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉండనుంది. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ పరంగా తూర్పు కారిడార్‌లో పెట్టుబడులు పెట్టడం అత్యంత అనుకూలం. రాబోయే కొద్ది సంవత్సరాలలో ఈ కారిడార్‌లో భారీగా ధరలు పెరగనున్నాయి. ఇప్పుడు పెట్టుబడి పెట్టిన వారికి మంచి రాబడులు సైతం వస్తాయి’’అని అన్నారు.
 

More Press News