గ్లకోమా గురించి తెలుసుకుందాం అవగాహన వారోత్సవాలు జనవరి 3 నుండి 9 వరకు

డా. బి. ప్రణతి
సీనియర్ కన్సల్టెంట్ & హెచ్ఓడి ఆఫ్తామాలజీ విభాగం
కిమ్స్ హస్పిటల్స్, సికింద్రాబాద్.


గ్లకోమా / నీటి కాసులు వ్యాధి ఒక దీర్ఘకాలికమైన, అంధత్వానికి దారితీసే వ్యాధి. ఈ వ్యాధి గురించి సాధారణమైన ప్రజలలో అవగాహన లేదు. ప్రతి ఏడాది, ప్రపంచ వ్యాప్థంగా సుమారు 7 కోట్ల, 96 లక్షలమంది, మరియు మన భారతదేశంలో ఒక 1 కోటి, 2 లక్షలమంది ప్రజలు ఈ వ్యాధిబారిన పడతారు అని అంచన. వారిలో 10 లక్షలకు పైగా ప్రజలు అంధులుగా మరుతున్నారు. ఈ గ్లకోమా వ్యాధిగ్రస్థులు సుధీర్ఘకాలంగా తమ కంటిలోని ఒత్తిడి పెరగడం వలన, కంటినరం దెబ్బతిని చూపును కోల్పోతారు. కానీ, ఒక శుభవార్త ఏమిటంటే ఈ వ్యాధి మొదలవుతున్న దశలో కనుక మనం తెలుసుకుంటే, అంధత్వాన్ని నివారించుకోవచ్చు.
సాధారణంగా, ఈ వ్యాధి ఉన్నవారు తమ చూపులో మార్పులు వస్తున్నాయి అని గ్రహించలేకపోవచ్చు. ఎందుకంటే, ఈ వ్యాధి ఉన్నవారిలో ప్రథమంగా ప్రక్కచూపు త్రగ్గడం మొదలయ్యి, క్రమంగా పూర్తి చూపు కోల్పోయే అవకాశాలు ఉన్నయి.
గ్లకోమా ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నయి?
1. హై మయోపియా, లేదా హైపరోపియా ఉన్నవారు
2. కుటుంబంలో గ్లకోమా వ్యాధిగ్రస్థులు ఉన్నవారు
3. కంటికి దెబ్బలు తగిలినవారు
4. శరీరంలో వేరే సమస్యలకు ఏ రూపంలోనైనా స్టెరాయిడ్ మందులు వాడినవారు.
5. దీర్ఘకాలిక మధుమేహం మరియూ రక్తపోటు ఉన్నవారు.
వార్షిక కంటి పరీక్షలో భాగంగా చూపు పరీక్ష, కంటి ఒత్తిడి పరీక్ష, కంటినాడి పరీక్ష చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని ముందే పసిగట్టవచ్చు. చాలా మంది వారి ఇంటి వద్ద ఉన్న కళ్ళజోళ్ళ దుకాణాలలో పూర్తి పరీక్ష చేయించుకోలేకపోవడంతో ఈ వ్యాధి ఉన్నా బయటపడడంలేదు. ఈ ప్రక్రియలో ఎంతో మంది ఆలస్యంగా చూపు మందగించింది అని తెలుసుకుని కంటివైద్యుల వద్దకు వచ్చేసరికే సగానికిపైగా చూపును కోల్పోతున్నారు. కొత్తగా వచ్చిన లేజర్లు, కంటిలోవేసే చుక్కల మందులు మరియు సూక్షమైన శస్త్ర చికిత్సల ద్వారా కొన్ని వేలమంది గ్లకోమా బాధితులు తమ చూపును కాపడుకోగలుగుతున్నారు. అందుచే, ఈ జనవరి మాసంలో, గ్లకోమా అవగాహన నెల సందర్భంగా మీరు కంటి పరీక్ష చేయించుకోండి. మీ చూపుని కాపాడుకోండి, మీ కంటి వెలుగును రక్షించుకోండి.

More Press News