విజయవాడలోని లైలా మాల్ వద్ద తమ మూడవ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన ఐనాక్స్
· ఈ నూతన మల్టీప్లెక్స్‌లో 959 సీట్లతో మూడు స్ర్కీన్‌లు ఉన్నాయి
· ఈ మూడు స్ర్కీన్‌లు లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీ కలిగి ఉండటం వల్ల షార్ప్, స్పష్టమైన విజువల్స్‌కు భరోసా అందిస్తాయి. ఈ మూడు ధియేటర్లూ డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ కలిగి ఉన్నాయి
· ఈ ప్రారంభంతో, ఐనాక్స్ ఇప్పుడు 10 సినిమాలను 39 స్ర్కీన్‌లతో ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది
విజయవాడ, 25 డిసెంబర్ 2022 : భారతదేశంలో సుప్రసిద్ధ మల్టీప్లెక్స్ చైన్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ (ఐనాక్స్) నేడు విజయవాడ నగరంలో తమ మూడవ మల్టీప్లెక్స్‌ను ఎంజీ రోడ్ లో ఉన్న లైలా మాల్ వద్ద ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ నూతన మల్టీప్లెక్స్ లో పూర్తిగా లీనమయ్యే రీతిలో తీర్చిదిద్దిన ఆడిటోరియా ఉంది. ఈ మూడు స్ర్కీన్‌ల మొత్తం సామర్ధ్యం 959 సీట్లు. ఐనాక్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 10 మల్టీప్లెక్స్‌లలో 39 స్ర్కీన్‌లను నిర్వహిస్తుంది.
ఈ మల్టీప్లెక్స్‌లోని మూడు స్ర్కీన్‌లలోని ప్రతి ఒక్కటీ పూర్తి సౌకర్యవంతమైన అనుభవాలను అందించడంతో పాటుగా అత్యున్నత శ్రేణి సినిమా సాంకేతికతలకు సౌండ్ మరియు ప్రొజెక్షన్ కోసం కలిగి ఉన్నాయి. ఈ మూడు ఆడిటోరియాలలో రేజర్ –షార్స్ విజువల్స్ కోసం అత్యాధునిక లేజర్ ప్రొజెక్షన్ సిస్టమ్ కలిగి ఉంది. అదనంగా, ఈ మల్టీప్లెక్స్ అత్యున్నత శబ్ద అనుభవాలను డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో అందిస్తాయి. లీనమయ్యే వాతావరణం కలిగిన ఈ ఆడిటోరియా వోల్ఫోనీ స్మార్ట్ క్రిస్టల్ డైమండ్ సొల్యూషన్ శక్తిని కలిగి ఉండటం వల్ల అత్యంత ఆహ్లాదకరమైన 3డీ వ్యూ అందిస్తాయి.
ఐనాక్స్ లైలా మాల్ యొక్క ఇంటీరియల్ డెకార్ ను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కాలాతీత డిజైన్ భాషను కలిగిన ఈ ఇంటీరియర్స్ శైలి మరియు విలాసం గురించి పుంఖానుపుంఖాలుగా వెల్లడిస్తాయి. గోల్డ్ ర్యాఫ్టర్స్‌తో డైనమిక్ జ్యామెట్రీలో సాహసోపేతమైన స్టేట్‌మెంట్ అందించే ఎత్తైన లాబీ అతిథులకు స్వాగతం పలుకుతుంది. బంగారు మెటల్ షీట్ మరియు లక్కర్డ్ గ్లాస్ డిజైన్ యొక్క ముఖ్యాంశాలతో ఆహ్వానించతగిన రీతిలో ఎఫ్ అండ్ బీకన్సెషన్ కౌంటర్ ఉండటంతో పాటుగా అతిథులను విస్మయానికి గురిచేసే ఆహ్లాదకరమైన, విలాసవంతమైన అనుభవాలను సృష్టిస్తుంది.
ఈ మల్టీప్లెక్స్‌లో వినియోగదారులు ఇష్టపడే డిజిటల్ ఫీచర్లు అయిన పేపర్ లెస్ చెక్ ఇన్స్, టచ్ స్ర్కీన్ మరియు క్యుఆర్ కోడ్ ఆధారిత టిక్కెటింగ్, ఇంటరాక్టివ్ ఫుడ్ ఆర్డరింగ్ వంటివి కలిగి ఉంది. లైవ్ కిచెన్ మరియు ఎఫ్ అండ్ బీ కన్సెషన్ కౌంటర్లు విస్తృత శ్రేణి పాప్‌కార్న్స్, శాండ్‌విచ్‌లు, నాచోస్, పిజ్జా మరియు బర్గర్లను అందించడంతో పాటుగా హాట్ , కోల్డ్ బేవరేజస్ కూడా అందిస్తాయి. ఐనాక్స్ అభిమానులు ఈ అత్యంత రుచికరమైన ఆహారాన్ని తమ ఇంటిలో కూడా స్విగ్గీ మరియు జొమాటో వంటి వేదికల ద్వారా ఆర్డర్ చేయడం ద్వారా ఆస్వాదించవచ్చు.ఈ ప్రారంభం గురించి ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ , రీజనల్ డైరెక్టర్ –సౌత్, శ్రీ మోహిత్ భార్గవ మాట్లాడుతూ ‘‘విజయవాడ నగరంలో మా మూడవ మల్టీప్లెక్స్ ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ నూతన మల్టీప్లెక్స్ , అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలతో రావడంతో పాటుగా విలాసవంతమైన ఇంటీరియర్స్‌ను కలిగి వినూత్నమైన ప్రోపర్టీగా నిలుస్తుంది. సౌకర్యవంతమైనప్పటికీ క్లాసీ యాంబియన్స్ కలిగిన ఈ మల్టీప్లెక్స్ విజయవాడలోని సినీ అభిమానులను ఆకట్టుకునే రీతిలో ఖచ్చితంగా డిజైన్ చేయడం జరిగింది. దీనిలో కొన్ని అత్యద్భుతమైన ఎఫ్ అండ్ బీ ఎంపికలూ అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంతంలో మా కార్యకలాపాలను బలోపేతం చేసుకోవడంతో పాటుగా అత్యున్నత శ్రేణి సినీ వీక్షణ అనుభవాలను మా అభిమానులకు అందించనున్నాము. మా నూతన మల్టీప్లెక్స్ ఇప్పుడు విజయవాడలోని సినీ అభిమానులకు ప్రాధాన్యతా వినోద కేంద్రంగా నిలువనుందని ఆశిస్తున్నాము. ఐనాక్స్‌కు వారిని స్వాగతించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.
ఈ ప్రారంభంతో, ఐనాక్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 సినిమాలను 39 స్ర్కీన్‌లతో నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఐనాక్స్‌కు 169 మల్టీప్లెక్స్‌లు 720 స్ర్కీన్‌లతో 74 నగరాలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.