క్రిస్మస్‌ సంతోషాన్ని తీసుకువచ్చిన ఇనార్బిట్‌ మాల్‌, హైదరాబాద్‌

క్రిస్మస్‌ స్ఫూర్తిని  వేడుక చేసుకునేందుకు డిసెంబర్‌ 16 నుంచి నగరవాసులు ఇనార్బిట్‌ మాల్‌ను సందర్శించవచ్చు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 15, 2022 : హైదరాబాద్‌ నగరవాసులు అత్యంత ఆహ్లాదకరమైన క్రిస్మస్‌ సంబరాలను ఇనార్బిట్‌ మాల్‌ వద్ద డిసెంబర్‌ 16 నుంచి ఆస్వాదించవచ్చు. అత్యంత ఉత్సాహపూరితమైన కార్యక్రమాలు, వినోదం, శాంతా మీట్‌ అండ్‌ గ్రీట్‌ మరియు మరెన్నో వేడుకలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి!

ఈ మాల్‌ పలు కార్యక్రమాలను చిన్నారుల కోసం డిసెంబర్‌ 17–18 తేదీలలో  నిర్వహిస్తుంది.  అలాగే డిసెంబర్‌ 24–25 తేదీలలో  హ్యాండ్‌ పెయింట్‌ టాటూలు వంటి వాటినీ అందుబాటులో ఉంచింది.

మాల్‌ సందర్శకులు, అభిమానులు  డిసెంబర్‌ 24–25 తేదీలలో శాంతాను కలుసుకుని అభినందించవచ్చు, దీనికి మీకు కావాల్సిందల్లా ఇన్‌ రివార్డ్స్‌ సభ్యులు కావడంతో పాటుగా మీ సర్‌ప్రైజ్‌ను ఎంచుకోవడం. ఈ సభ్యత్వం ప్రారంభించడం కోసం 7998079980 కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వడమే! అలాగే ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన, పండుగ ఫోటోబూత్‌ పాడ్‌ కూడా అందుబాటులో ఉంది. తమ మధురక్షణాలను కలకాలం పదిలపరుచుకోవాలనుకునే వారిని ఆకట్టుకునే రీతిలో ఇది ఉంటుంది. మీరు మీ కస్టమ్‌ ఫోటో ప్రింట్స్‌ను సైతం ఇంటికి తీసుకువెళ్లవచ్చు !
ఈ సంవత్సరం మాల్‌లో డెకార్‌ కూడా  అత్యంత ఆహ్లాదంగా  సీజన్‌ ఆఫ్‌  జాయ్‌ నేపథ్యంతో తీర్చిదిద్దారు. సందర్శకులను అత్యంత ఆకర్షణీయమైన క్రిస్మస్‌ ఆర్చ్‌ స్వాగతిస్తుంది. సెంట్రల్‌ అట్రియం వద్ద పెద్దదైన, ఆకట్టుకునే క్రిస్మస్‌ ట్రీ ఉంటుంది. క్రిస్మస్‌ సందడిని మరింతగా తీసుకువస్తూనే, సందర్శకులు ఆకట్టుకునే చిత్రాలను తీసుకునేందుకు ఖచ్చితమైన వేదికగా జింజర్‌బ్రెడ్‌, బౌబ్లెస్‌, క్యాండీ కేన్‌ వంటివి అలంకరించారు.

    ఈ సీజన్‌ ఆఫ్‌ జాయ్‌లో  ఇనార్బిట్‌మాల్‌ హైదరాబాద్‌ను సందర్శించండి , సంతోషకరమైన రీతిలో క్రిస్మస్‌ వేడుకలను జరుపుకోండి !

More Press News