హ్యుగో™ రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీ సిస్టమ్‌ ఉపయోగించి తెలంగాణాలో మొట్టమొదటిసారిగా బేరియాట్రిక్‌ సర్జరీ ని విజయవంతంగా నిర్వహించిన కేర్‌ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌

·       జంట తెలుగు రాష్ట్రాలలో సమగ్రమైన రోబోటిక్‌ ఆధారిత గ్యాస్ట్రో ఇంటెస్టినల్‌ (జీఐ ) మరియు బేరియాట్రిక్‌ సర్జరీ ప్రోగ్రామ్‌ను అందిస్తున్న అతి కొద్ది కేంద్రాలలో ఒకటి కేర్‌ హాస్పిటల్స్‌

·       మెడ్‌ట్రానిక్‌ హ్యుగో రాస్‌ సిస్టమ్‌ వినియోగించి ఆసియా పసిఫిక్‌లో  చేసిన రెండవ బేరియాట్రిక్‌ సర్జరీ (స్లీవ్‌ గ్యాస్ట్రోక్టమి) చేసిన హాస్పిటల్‌గా ఖ్యాతి

·       148 కేజీల బరువున్న వ్యక్తికి బరువు తగ్గేందుకు ఈ  సాంకేతికత వినియోగించి  శస్త్ర చికిత్సను హాస్పిటల్‌ చేసింది.

హైదరాబాద్‌, 07 డిసెంబర్‌ 2022 : హ్యుగో రోబొటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీ సిస్టమ్‌ (Hugo™ Robotic-assisted Surgery System) వినియోగించి బరువు తగ్గేందుకు  విజయవంతంగా  హైదరాబాద్‌లో  మొట్టమొదటి బేరియాట్రిక్‌ శస్త్రచికిత్సను చేసినట్లు కేర్‌ హాస్పిటల్స్‌ వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రక్రియను  కేర్‌ హాస్పిటల్స్‌లోని నిష్ణాతులైన క్లీనికల్‌ బృందం నిర్వహించింది. ఈ బృందానికి కన్సల్టెంట్‌ గ్యాస్ట్రోఇంటెస్టినల్‌ (జీఐ), ల్యాప్రోస్కోపిక్‌ అండ్‌ బేరియాట్రిక్‌ సర్జరీ – డాక్టర్‌ వేణుగోపాల్‌  పరీక్‌ నేతృత్వం వహించారు. ఈ శస్త్రచికిత్సను కేర్‌ హాస్పిటల్‌ గ్రూప్‌కు చెందిన ప్రతిష్టాత్మక  బంజారాహిల్స్‌ కేంద్రం వద్ద నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తి 26 సంవత్సరాల వయసు కలిగిన రవికాంత్‌ (గోప్యత కారణంగా పేరు మార్చడం జరిగింది). శస్త్రచికిత్సకు ముందు ఆయన 148 కేజీల బరువు ఉండేవారు. అంతేకాదు నియంత్రణలో లేని మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలను సైతం ఆయన అధిక  బరువు కారణంగా ఎదుర్కొన్నారు.

ఈ రోబోటిక్‌ శస్త్రచికిత్సను ఆయన ఉదరంలో  పెద్దమొత్తం తొలగించేందుకు నిర్వహించారు. జీర్ణకోశంలో  సన్నటి ట్యూబ్‌ లాంటి పౌచ్‌ లేదా స్లీవ్‌ను వదిలారు. శస్త్రచికిత్స అనంతరం రోగి విజయవంతంగా కోలుకున్నారు. అంతేకాదు ఆయనకున్న ఇతర ఆరోగ్య సమస్యలు సైతం సాధారణ స్థితికి రావడం ప్రారంభమైంది.  ఈ ప్రతిష్టాత్మకమైన శస్త్ర చికిత్సను హ్యుగో రోబోటిక్‌ అసిస్టెడ్‌  సర్జరీ సిస్టమ్‌ వినియోగించి చేశారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో  హ్యుగో రోబోటిక్‌ అసిస్టెడ్‌ సర్జరీ సిస్టమ్‌ వినియోగించి చేసిన రెండవ శస్త్రచికిత్స ఇది.

ఈ రోబొటిక్‌ ప్రోగ్రామ్‌ గురించి మరింత వివరంగా  గ్రూప్‌ చీఫ్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ నిఖిల్‌ మాథుర్‌ వెల్లడిస్తూ ‘‘వైద్య శాస్త్రం మరియు సస్టెయినబల్‌ ఆరోగ్య సంరక్షణ  రంగంలో  అత్యుత్తమతను అందించేందుకు కేర్‌ హాస్పిటల్స్‌ స్ధిరంగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. హ్యుగో రాస్‌  ఇప్పుడు  మా నిష్ణాతులైన సర్జన్లకు  విభిన్నమైన క్లీనికల్‌ స్పెషాలిటీస్‌ వ్యాప్తంగా  అపారమైన అవకాశాలను అందించింది.  దీనితో మరింత మంది రోగులకు కనీస కోత కలిగిన  శస్త్రచికిత్సల ప్రయోజనాల శక్తిని అందజేయడం సాధ్యమవుతుంది’’ అని అన్నారు

ఈ వ్యవస్థ యొక్క ప్రయోజనాలను గురించి సుప్రసిద్ధ రోబోటిక్‌ బేరియాట్రిక్‌ సర్జన్‌,  హ్యుగో రాస్‌ వ్యవస్ధను నియంత్రించడంలో  అపారమైన అనుభవం కలిగిన కేర్‌ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌లోని డాక్టర్‌ వేణుగోపాల్‌ పరీక్‌ మాట్లాడుతూ ‘‘ రోబో అసిస్టెడ్‌ మినిమల్లీ ఇన్వాసివ్‌ సర్జరీలను అత్యధిక సంఖ్యలో రోగులకు చేరువచేస్తూ , హ్యుగో రాస్‌ సిస్టమ్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా  అనేక ప్రాంతాలలోని ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది.  సర్జరీలలో వినియోగించే ఇతర రోబోలతో పోలిస్తే ఈ రోబో  పలు ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో ఖచ్చితత్త్వం మెరుగుపరచడం,  అతి సున్నితమైన శస్త్రచికిత్సలు చేసేటప్పుడు విస్తృతశ్రేణి కదలికలకు తోడ్పడడటం, శస్త్రచికిత్స చేసే సమయం తగ్గడం, శస్త్రచికిత్స సమయంలో ఎదురయ్యే సమస్యలు తగ్గడం వంటివి ఉన్నాయి. విస్తృత శ్రేణిలో సాఫ్ట్‌ టిష్యూ ప్రక్రియలను సైతం  ఈ వ్యవస్ధ యొక్క మాడ్యులర్‌ మరియు మల్టీ క్వాడ్రాంట్‌ ప్లాట్‌ఫామ్‌పై చేయవచ్చు. మన దేశంలో మరింత మంది రోగులు ఈ వ్యవస్ధ ద్వారా ప్రయోజనం పొందగలరు’’ అని అన్నారు

తెలంగాణాలో  సమగ్రమైన రోబోటిక్‌ ఆధారిత గ్యాస్ట్రో ఇంటెస్టినియల్‌ మరియు బేరియాట్రిక్‌ సర్జరీ ప్రోగ్రామ్‌ అందిస్తున్న అతి కొద్ది హాస్పిటల్స్‌లో  కేర్‌ హాస్పిటల్స్‌, బంజారాహిల్స్‌ ఒకటి.  అత్యున్నత నైపుణ్యం కలిగిన డాక్టర్లు, అత్యాధునిక సాంకేతికత సహాయంతో ఈ  కేంద్రం అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలైనటువంటి బేరియాట్రిక్‌ సర్జరీ, జీఐ క్యాన్సర్‌  సర్జరీలు, అతి క్లిష్టమై బైలరీ సర్జరీలు, హెర్నియా రిపేర్‌ సర్జరీలు, పాన్‌క్రియాటిక్‌ సర్జరీలు, అపెండిక్టోమీస్‌ మరియు మరెన్నో అత్యంత ఖచ్చితత్త్వం, స్ధిరమైన ఫలితాలను పొందుతూ చేయవచ్చు.

మెడ్‌ట్రానిక్‌ హ్యుగో రోబో అసిస్టెడ్‌ సర్జరీ సిస్టమ్‌ మెరుగైన సామర్థ్యంతో వస్తుంది మరియు  అతి క్లిష్టమైన శస్త్ర చికిత్సలను సైతం పూర్తి నియంత్రణ, ఖచ్చితత్త్వంతో సర్జన్‌లు చేసేందుకు ఇది తోడ్పడుతుంది. ఇది రిస్టెడ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, 3డీ విజువలైజేషన్‌, టచ్‌ సర్జరీ ఎంటర్‌ప్రైజ్‌, క్లౌడ్‌ ఆధారిత సర్జికల్‌ వీడియో  క్యాప్చర్‌ మరియు మేనేజ్‌మెంట్‌ పరిష్కారాలను ఇది మిళితం చేస్తుంది. దీనికి రోబొటిక్స్‌ ప్రోగ్రామ్‌ ఆప్టిమైజేషన్‌, సర్వీస్‌,  శిక్షణలో  ప్రత్యేక  నైపుణ్యం కలిగిన, పూర్తిగా అంకితం చేసిన సిబ్బంది మద్దతు అందిస్తారు.  కనీస కోత కలిగిన శస్త్ర చికత్స ప్రయోజనాలు – అతి తక్కువ సమస్యలు, చిన్న కోతలు,  అతి తక్కువ సమయం హాస్పిటల్‌లో గడపడం,  వేగంగా సాధారణతకు రావడం,ప్రపంచ వ్యాప్తంగా మరింత మంది రోగులకు చేరువకావడం – అందించే రీతిలో దీనిని తీర్చిదిద్దారు.

కేర్‌ హాస్పిటల్స్‌ గురించి...

బహుళ ప్రత్యేకతలు కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత కేర్‌ హాస్పిటల్స్‌. భారతదేశంలో ఆరు రాష్ట్రాలలో 8 నగరాల్లో 16 హెల్త్‌కేర్‌ ఫెసిలిటీలను ఇది నిర్వహిస్తుంది. ఈ నెట్‌వర్క్‌ హైదరాబాద్‌, రాయ్‌పూర్‌, భుబనేశ్వర్‌, పూనె, విశాఖపట్నం, నాగ్‌పూర్‌, ఇండోర్‌, ఔరంగాబాద్‌లో ఉంది. దక్షిణ మరియు మధ్య భారతదేశంలో ప్రాంతీయ అగ్రగామిగా వెలుగొందుతూనే  భారతదేశంలో అగ్రగామి ఐదు హాస్పిటల్‌ చైన్స్‌లో ఒకటిగా నిలిచింది. కేర్‌ హాస్పిటల్స్‌ ఇప్పుడు 30కు పైగా క్లీనికల్‌ స్పెషాలిటీలలో తమ సేవలను 2700కు పైగా బెడ్స్‌తో అందిస్తుంది. ప్రస్తుతం తమ సేవలను దక్షిణాసియా, ఆఫ్రికాలలో  విస్తరిస్తోన్న ప్రభావిత ఆధారిత హెల్త్‌కేర్‌ నెట్‌వర్క్‌  ఎవర్‌కేర్‌  గ్రూప్‌ ఆధ్వర్యంలో కేర్‌ హాస్పటల్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

More Press News