‘ఆహా’లో డిసెంబర్ 9న వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా ‘ఊర్వశివో రాక్షసివో’
‘ఆహా’ 100% తెలుగు లోకల్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్. ఇప్పటికే ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను, ఒరిజినల్స్‌ను, టాక్ షోస్, వెబ్ సిరీస్‌లను తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ లిస్టులోకి మరో సూపర్ హిట్ మూవీ చేసింది. అదే ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా. ఈ చిత్రం డిసెంబర్ 9 నుంచి ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. జీఏ 2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్ బ్యానర్స్ రూపొందించిన ఈ చిత్రంలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, సునీల్, ఆమని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. భావోద్వేగాలనేవి ప్రస్తుతానికి బలంగానే ఉన్నట్లు అనిపిస్తాయి. కానీ ఏ సమయంలోనైనా అవి మారే అవకాశాలున్నాయి. మనం మనకు అన్ని అదుబాటులో ఉంటున్నాయి. అయితే మనుషుల మధ్య ఉండే బంధాలనేవి చాలా సంక్లిష్టంగా మారుతున్నాయి. ప్రస్తుత కాలంలోని అలాంటి సంక్లిష్టమైన బంధాలను గురరించి తెలియజేసే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఊర్వశివో రాక్షసివో’.
ఈ చిత్రానికి రైటర్, డైరెక్టర్ రాకేష్ శశి. శ్రీకుమార్ (అల్లు శిరీష్) మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఐటీ ఉద్యోగి. మధ్య తరగతివాడు కావటంతో కొన్ని కట్టుబాట్లతో పెరుగుతాడు. తల్లిదండ్రులతో చాలా సన్నిహితంగా ఉంటాడు శ్రీకుమార్. ముఖ్యంగా తల్లి (ఆమని)తో అతనికి మంచి అనుబంధం ఉంటుంది. అతనికి మంచి పిల్లను చూసి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకుంటుంటారు. అయితే శ్రీకుమార్ మాత్రం సింధుజ (అను ఇమ్మాన్యుయేల్)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా శ్రీకుమార్ కంపెనీలోనే పని చేస్తుంటుది. ఆమె అధునికి భావాలున్న అమ్మాయి. జీవితంలో కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలను కలిగి ఉంటుంది. దీంతో శ్రీకుమార్ ఆమెతో పెళ్లి ప్రతిపాదన తెచ్చినప్పటికీ ఆమె లివ్ ఇన్ రిలేషన్ వైపుకే మొగ్గు చూపుతుంది. మరి ఇంత విరుద్ధమైన భావాలున్న వారిద్దరూ ఒకటిగా కలుస్తారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
Link - https://www.youtube.com/watch?v=AEpAgcfJeAU
ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుత కాలానికి చెందిన అమ్మాయి, అబ్బాయికి చెందిన ప్రేమకథా చిత్రమిది. నేటి తరం యువ జంటలు ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇలాంటి సినిమాను ఆహా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటం చాలా సంతోషంగా ఉంది.’’
ఓ భావోద్వేగాన్ని మన చుట్టూ ఉండే అనే పరిస్థితులు ముందుకు నడిపిస్తాయి. ప్రతి సంబంధం దేనికదే ప్రత్యేకం. పెళ్లి మంచిదా.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ మంచిదా అనే దానిపై ఎవరికీ స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పలేరు. అలాంటి ఓ ఆలోచనను సమాజం ఆకట్టుకునేలా ఊర్వశివో రాక్షసివో చిత్రాన్ని తెరకెక్కించారు.
‘ఆహా’లో డిసెంబర్ 9న ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీమియర్ కానుంది. కాబట్టి మీ క్యాలెండర్‌లో ఆ డేట్‌ను మార్క్ చేసి పెట్టుకోండి.