పిల్లలను వెంటాడుతున్న ఊబకాయం జాతీయ వ్యతిరేక ఊబకాయ దినోత్సవం నవంబర్ 26న
డా. సి.హెచ్ నవీన్
కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కిమ్స్ హాస్పటల్, కొండాపూర్
ఊబకాయం అనేది దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్య. అనారోగ్య సమస్యల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ అధిక బరువు సమస్య ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు మరియు యుక్తవయస్కులను ప్రభావితం చేస్తుంది. దాదాపు 14.4 మిలియన్ల స్థూలకాయ పిల్లలతో భారతదేశం ప్రపంచంలోనే 2వ దేశంగా ఉంది. భారతదేశంలో అధిక బరువు సమస్య ముఖ్యంగా చిన్నారుల్లో ఆహారపు అలవాట్ల వల్లే వస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ పెరుగుదల వెనుక ఉన్న కారణం కేలరీల అసమతుల్యత. చాలా మంది పిల్లలు వినియోగించే శక్తి మరియు ఖర్చు చేసిన శక్తి యొక్క సమతౌల్యాన్ని కొనసాగించడంలో విఫలమవుతున్నట్టు గుర్తించాయి.
గతంతో పోలిస్తే 10రెట్లు ఎక్కువగా పెరిగిన ఊబకాయం సమస్య తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, పిల్లలలో ఊబకాయం రేటు గత సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు 10రెట్లు ఎక్కువ అని అంచనా వేయబడింది. 2030 నాటికి ప్రతి 10 మంది భారతీయ పిల్లలలో ఒకరు ఊబకాయం బారిన పడతారని అంచనా. ఐరోపాలో పాఠశాల వయస్సు పిల్లలు ప్రతి ఐదుగురిలో ఒకరు అధిక శరీర బరువుతో బాధపడుతున్నారు. బాల్య, కౌమార దశలో అధిక బరువు మరియు ఊబకాయం యొక్క ప్రాబల్యం సుమారు 14% ఉన్నట్టు ప్రస్తుతం లెక్కలు చెప్తున్నాయి.
పిల్లల ఆహారపు అలవాట్ల వల్లే ఊబకాయం నేటి జీవనశైలి పిల్లలలో ఊబకాయం అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. పిల్లలు బయట ఆటలకు దూరంగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం, జీవనశైలి మరియు కొవ్వు అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అధిక శరీర బరువు కొందరిలో జన్యుపరమైన కారకాలు, ఎండోక్రైన్ రుగ్మతలు లేదా కొన్ని ఔషధాల పర్యవసానంగా ఉండవచ్చు.
చెడు ఆహారపు అలవాట్ల వల్లే ఊబకాయం టీవీ స్క్రీన్ ముందు కూర్చుని టీవీ చూస్తూ భోజనం చేయడం, బ్రేక్‌ఫాస్ట్‌లు మానేయడం, చక్కెర-తీపి పానీయాలు తాగడం, తరచుగా బయట తినడం మరియు పిజ్జాలు, బర్గర్ ల వంటి జంక్ ఫుడ్ లు, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఊబకాయం వస్తుంది. ఆహారపు అలవాట్లు సాధారణంగా బాల్యంలోనే ఏర్పడతాయి. తల్లిదండ్రులు వారి ఆహార అలవాట్ల అభివృద్ధిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అందుకే చిన్నతనం నుండి వారి ఆహారపు అలవాట్లను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలి. మంచి ఆహారం తీసుకోవటాన్ని మాత్రమే ప్రోత్సహించాలి.
ఊబకాయంతో పిల్లలలో శారీరక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఊబకాయంతో బాధపడే చిన్నారులకు టైప్ 2 డయాబెటిస్ హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. శ్వాసకోశ రుగ్మతలతో, ఆస్తమా వంటి సమస్యలు అధిక బరువు ఉండటం వల్ల వస్తుందని నివేదికలు చెబుతున్నాయి.
అధికబరువు వల్ల ఫ్యాటీ లివర్, ఎముకల సమస్యలు కూడా వచ్చే అవకాశముంది. ఫ్యాటీ లివర్ సమస్యను చిన్న వయసులోనే ఎదుర్కోవాల్సి వస్తుందని, అనేక మానసిక సమస్యలు కూడా వారిని వేధిస్తాయి. కాబట్టి చిన్నారులలో ఊబకాయం సమస్యకు ప్రధాన కారణమైన ఆహారపు అలవాట్లను తల్లిదండ్రులు మొదటి నుంచి నియంత్రించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు పాటించండి
పోషకాహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, ఆటలు ఆడాలి, టీవీని తక్కువగా చూడాలి, టీవీ చూస్తు తినవద్దు.