హైదరాబాద్ నుంచి శిశువులను కాపాడేందుకు మిలాప్‌పై ఏకమైన ఉదార దాతలు
హైదరాబాద్ , 21 నవంబర్ 2022 : సమాజానికి అతి ముఖ్యమైన ఆస్తి పిల్లలు. నవజాత శిశువులకు కనీసం ఒక సంవత్సరం నిండే వరకూ అయినా వారికి తగిన పోషణ అందించడంతో పాటుగా వారిని జాగ్రత్తగా కాపాడుకోవడం పట్ల తగిన అవగాహన కల్పించుకోవడమూ అత్యంత కీలకం. శిశువు పుట్టిన మొదటి మూడు నెలలూ తగిన సంరక్షణ అందించడం అత్యంత కీలకం. దీనితో పాటుగా తగిన రీతిలో పౌష్టికాహారం అందించడం, వైద్య సదుపాయాల లభ్యత వంటివి వారు తరువాత మైలురాయి చేరుకోవడానికి దోహదపడతాయి. గత కొద్ది దశాబ్దాలుగా నవజాత శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ ప్రభుత్వ నివేదికల ప్రకారం ప్రతి 36 శిశు జననాలలో ఒకరు తమ తొలి పుట్టిన రోజు జరుపుకోకుండానే భారతదేశంలో మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా గణనీయంగా వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయి. ఈ తరహా సమస్యలకు తగిన పరిష్కారాలను అందిస్తున్నారు. అయితే అందరికీ ఆర్ధికంగా అవి అందుబాటులో లేవు.
భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ మిలాప్ డాట్ ఓఆర్‌జీ ఈ అంతరాలను పూరిస్తోంది. వైద్య అత్యవసరాలు అవసరమైన ప్రజలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రపంచవ్యాప్తంగా అపరిచిత దాతల నుంచి అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై ప్రజలు నెలలు నిండకుండానే జన్మించిన శిశువులు, ఇంట్రాపార్టమ్ సంబంధిత సమస్యలు (పుట్టుక సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది), ఇన్‌ఫెక్షన్స్, పుట్టుకతో వచ్చు లోపాలు వంటి వాటి సమస్యల కోసం ఫండ్ రైజింగ్ కోసం ఫండ్ రైజర్లను ఏర్పాటుచేస్తున్నారు, తప్పనిసరి పరిస్థితుల్లోనే వారు అపరిచితుల నుంచి సహాయాన్ని ఇంటర్నెట్‌పై చికిత్స కోసం అవసరమైన ఫండింగ్ కోసం అర్ధిస్తున్నారు. ఈ కుటుంబాలలో చాలా వరకూ ఈ తరహా సంఘటనలకు సిద్ధమై ఉండవు. క్రౌడ్ ఫండింగ్ వీరికి ఈ తరహా పరిస్థితులను అధిగమించేందుకు తోడ్పడుతుంది.
హైదరాబాద్‌కు చెందిన నరేష్, నిర్మల దంపతులు ఇటీవలనే తల్లిదండ్రులుగా మారారు. గతంలో నిర్మలకు పలు మార్లు గర్భస్రావం అయింది. అయితే ఈసారి ప్రసవం జరిగినప్పటికీ నెలలు నిండకుండానే తల్లికి అధిక రక్తపోటు ఉండటం వల్ల చేయాల్సి వచ్చింది. కవలలు పుట్టిన ఆనందం ఓ వైపు ఉన్నా వారిలో ఒకరు అతి తక్కువ బరువుతో పుట్టడంతో పాటుగా శ్వాసతీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో పాటుగా పేటెంట్ డక్టస్ ఆర్టిరియస్ సమస్యతో బాధపడుతున్నారు. మిలాప్ పై ఆ శిశువు చికిత్స కోసం ఫండ్ రైజర్‌ను ఏర్పాటుచేశారు. దాదాపు 1900 మంది దాతలు ముందుకు రావడంతో పాటుగా 16లక్షల రూపాయలను అందించారు. ఆ శిశువు ఇప్పుడు చికిత్సకు స్పందిస్తుంది. ఆ శిశువు ఆరోగ్యం నిలకడగా ఉండటంతో పాటుగా వేగంగా కోలుకుంటుంది.
ఇదే తరహా సంఘటన నగరానికి చెందిన భారతికి కూడా జరిగింది. ప్రెగ్నెన్సీ సమమంలో శిశువు కదలికలు లేకపోవడం చేత ఏడో నెలలోనే ఆమెకు డెలివరీ చేశారు. ఆమె మాట్లాడుతూ ‘‘ ఆమె ఈ ప్రపంచానికి వచ్చి కేవలం మూడు వారాలు మాత్రమే అయింది. ఇప్పటికే ఆమె జీవితం కోసం పోరాడుతుంది. ఆమె సొంతంగా శ్వాసించలేదు. ఎందుకంటే ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా రూపుదిద్దుకోలేదు. ఓ ఆరోగ్యవంతమైన పాపకు నేను జన్మనివ్వాలనుకున్నాను. కానీ నేను విఫలమయ్యాను. ఇప్పుడు నేను ఆమెను కాపాడుకోలేకపోతే, తల్లిగా కూడా నేను విఫలమవుతాను’’ అని అన్నారు.
ఆమె తన భావోద్వేగాలను నియంత్రించుకుంటూనే మాట్లాడుతూ ‘‘ఓ తల్లిగా మా పాప అనుభవిస్తోన్న నరకానికి తల్లడిల్లిపోతున్నాను. ఆమె నోటి నుంచి మాత్రమేకాదు ఆమె శరీరం అంతటా పైపులు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులు అయితే ఆమెను చూసి అలా ఏడుస్తూనే ఉండిపోయాను. ఆమె శ్వాసతీసుకోవడానికి పడుతున్న కష్టం చూసి నా గుండె ఆగిపోతున్నంత బాధ అనుభవించాను. ఈ బాధల నుంచి విముక్తి కలిగించమని భగవంతుడిని కోరుకుంటూనే ఉన్నాను’’ అనిఅన్నారు.
ఆమె కథను చదివిన కొంతమంది ఉదార వాదులు ఆమెకు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడంతో పాటుగా ఈ కష్టం నుంచి గట్టెక్కడానికి తమ వంతు తోడ్పాటునందించారు. ఆ తోడ్పాటు ఫలితమే మిలాప్ వేదికపై 6 లక్షల రూపాయలు ఆమెపేరిట జమయ్యాయి. బేబీభారతి ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. సంతోషకరమైన జీవితాన్నీ గడుపుతుంది. మిలాప్‌పై ఆమె దాతలకు ఆమె ధన్యవాదములు తెలుపుతుంది.
ఈ ప్లాట్‌ఫామ్‌పై ఇటీవలనే ఓ ఫండ్ రైజర్ నడుస్తుంది. ఉషారాణికి పుట్టిన కవల పిల్లలను కాపాడటం కోసం ఇది జరుగుతుంది. ఈ శిశువులు నెలల నిండకుండానే, తగినంత బరువు లేకుండా ఈఎల్‌బీడబ్ల్యు, ఆర్‌డీఎస్/హెచ్‌ఎండీ, హైపర్‌టెన్షన్, ప్రోబబల్ సెప్సిస్ సమస్యలతో జన్మించారు. వీరిని నగరంలోని సుప్రసిద్ధ హాస్పిటల్‌లో ఎన్‌ఐసీయు వార్డులో చేర్చారు. వీరి చికిత్సకు దాదాపు 20 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని ఆ హాస్పిటల్ అంచనా వేసింది. ఈ జంట తమ పిల్లల ఆరోగ్యం కోసం సహాయపడాల్సిందిగా అర్ధిస్తున్నారు. వీరు తమ పిల్లలను ఆరోగ్యంగా ఇంటికి తీసుకువెళ్లగలమనే నమ్మకంతో ఉన్నారు.
ప్రజలు తరచుగా ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్‌ను తమ చివరి అవకాశంగా, మరీ ముఖ్యంగా తమ వనరులు, ఆర్ధిక అవకాశాలు అయిపోతే తమ వైద్య అవసరాల కోసం వీటిని వినియోగించుకుంటున్నారు. మిలాప్ ఆ తరహా ఓ వేదిక. ఇది కేవలం ఫండ్ రైజింగ్ సేవలను అందించడం మాత్రమే కాదు, దాతలకు విశ్వసనీయ వేదికగా నిలుస్తూనే క్రౌడ్ ఫండింగ్ ప్రచారాలు చేసేందుకు తగిన మార్గనిర్ధేశనమూ అవసరార్థులకు చేస్తుంది. మిలాప్ ప్లాట్‌ఫామ్‌పై 72 లక్షల ఖాతాలున్నాయి. వీరు టియర్ 2, టియర్ 3 నగరాలకు చెందిన వారు. అలాగే క్రౌడ్ ఫండింగ్ పట్ల ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్నప్రాంతాలకు చెందిన వారు సైతం ఉన్నారు. దేశీయంగా ఈ ప్లాట్‌ఫామ్‌పై 46 లక్షల మంది దాతలు ఉండగా, విదేశాలలో 4 లక్షల మంది దాతలు ఉన్నారు.
టెరిషియరీ కేర్ లేదా క్యాన్సర్, అవయవ మార్పిడి, ప్రీమెచ్యూర్ బేబీస్, ఐసీయు, పీడియాట్రిక్ ఐసీయు, ట్రౌమా కేసులు మరియు రోడ్డు ప్రమాద అత్యవసరాలు సహా క్రిటికల్ కేర్ వైద్య అవసరాలకు అవసరమైన నిధుల సేకరణ కోసం క్రౌడ్‌ఫండింగ్ వేదికలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేల ద్వారా అందుకున్న నగదును సురక్షితంగా అవసరార్థులకు బదిలీ చేయడంతో పాటుగా వారు వెల్లడించిన కారణాల కోసం మాత్రమే సద్వినియోగం చేస్తున్నారనే భరోసా అందిస్తుంది.