మరింత బలపడుతోంది: మారుతీ సుజుకి 3,500వ నూతన కార్ల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించింది

హైదరాబాద్, 18 నవంబర్ 2022: దేశవ్యాప్తంగా తన పరిధిని బలోపేతం చేసుకుంటున్న మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్, తన 3,500 కొత్త కార్ల విక్రయ కేంద్రాల ఏర్పాటు మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం భారతదేశవ్యాప్తంగా 2,250 నగరాల్లో ఇంతటి విస్తృత నెట్‌వర్క్‌ను సాధించిన ఏకైక కార్ల కంపెనీగా మారుతి సుజుకి నిలిచింది. నేడు హైదరాబాద్‌లో ప్రారంభించిన నెక్సా సేల్స్ అవుట్‌లెట్ కంపెనీకి 3,500వ విక్రయ కేంద్రం.

హైదరాబాద్‌లో మారుతి సుజుకి 3,500వ సేల్స్ అవుట్‌లెట్‌ను మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్‌ మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మరియు మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ మరియు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నోబుటకా సుజుకి సమక్షంలో ప్రారంభించారు

 
సంతోషకరమైన కారు యాజమాన్యపు అనుభవాన్ని వినియోగదారులకు అందించేందుకు, వారితో మరింత సన్నిహితంగా ఉండాలన్న నిరంతర ప్రయత్నాలతో మారుతి సుజుకి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 237 సేల్స్ అవుట్‌లెట్‌లను ప్రారంభించింది. ముఖ్యంగా, ప్రస్తుత ఆర్థిక ఏడాది 2022-23లో ఏప్రిల్ నుంచి  అక్టోబర్ మధ్య 170 అవుట్‌లెట్‌లను జోడించి నెట్‌వర్క్‌ను భారీ స్థాయిలో పెంచుకుని తన ఊపును కొనసాగిస్తోంది.

మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ హిసాషి టేకుచి మాట్లాడుతూ, “దేశవ్యాప్తంగా మా నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు మేము చేస్తున్న ప్రయత్నాలకు మారుతి సుజుకి మరియు మా డీలర్ భాగస్వాములను నేను అభినందిస్తున్నాను. ఈ మైలురాయి భారతదేశ ప్రజలతో సుజుకి తన భాగస్వామ్యానికి 40వ వార్షికోత్సవం కలిసి వచ్చింది. ఇప్పుడు 3,500 సేల్స్ అవుట్‌లెట్‌లకు మా పరిధిని విస్తరించడం మా వినియోగదారులకు అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు కంపెనీ నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. మా మల్లీ-ఛానల్ సేల్స్ నెట్‌వర్క్ విభాగాల్లో డిమాండ్‌ను పరిష్కరించడంలో, మా బ్రాండ్‌పై వినియోగదారులకు ఉన్న నమ్మకాన్ని బలోపేతం చేయడంలో మాకు సహాయపడుతుంది. బలమైన హైబ్రిడ్ మరియు విశాలమైన సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌తో సహా మా అతి పెద్ద ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో మా వినియోగదారులతో అనుసంధానం అయ్యేందుకు మాకు చాలా దృఢమైన ఆధారాన్ని అందిస్తుంది’’ అని పేర్కొన్నారు.

దీని గురించి ఆయన మరింత వివరిస్తూ, “దేశంలో కేవలం 3 శాతం మంది మాత్రమే వాహనాలు కలిగి ఉన్నారని ఒక అంచనా. ఇది మాకు వృద్ధి అవకాశాలను అందిస్తుంది మరియు నాలుగు చక్రాల వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి చలనశీలతను అందిస్తుంది. మేము వీలైనంత ఎక్కువ మంది వ్యక్తులకు ‘జాయ్ ఆఫ్ మొబిలిటీ’ని అందించాలనుకుంటున్నాము. ఇక్కడ వారు ప్రయాణించే, కనెక్ట్ అయ్యే మరియు వ్యక్తులతో అనుబంధాన్ని పెంచుకునే స్వేచ్ఛతో సాధికారతను పొందుతారు. మా సేల్స్ నెట్‌వర్క్‌ని విస్తరించడం ఈ దృక్పథాన్ని గ్రహించే దిశలో ఒక ముందడుగు నేడు కంపెనీ మూడు ఫార్మాట్లలో కొత్త కార్ల విక్రయాలను చేపట్టింది- మారుతి సుజుకి అరేనా, నెక్సా మరియు కమర్షియల్. ఇవి, కంపెనీ డిజిటల్ ప్లాట్‌ఫారాలలో వేగవంతమైన ఏకీకరణతో పాటు, వినియోగదారుల కొనుగోలు అనుభవాన్ని మరింత మెరుగుపరచడంలో మరియు వారికి ఆనందాన్ని సృష్టించడంలో సహకరిస్తున్నాయి.
 

More Press News