పేదలందరికీ జగనన్న ఇళ్ళు పథకమునకు సంబందించి వివిధ శాఖల అధికారులతో సమీక్షా
విజయవాడ నగరపాలక సంస్థ ది.15-11-2022.
పేదలందరికీ జగనన్న ఇళ్ళు పథకమునకు సంబందించి వివిధ శాఖల అధికారులతో సమీక్షా,
నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్. జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ ఐ.ఏ.ఎస్, సబ్ కలెక్టర్ అదితి సింగ్ ఐ.ఏ.ఎస్.
జగనన్న గృహ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి పేదలందరికీ జగనన్న ఇళ్ళు అందిచే విధంగా చేయాలని కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ తెలిపారు. జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం లో మంగళవారం సాయంత్రం కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ ఐ.ఏ.ఎస్, సబ్ కలెక్టర్ అదితి సింగ్ ఐ.ఏ.ఎస్, లతో కలసి వివిధ శాఖల అధికారులతో వైఎస్ ఆర్ జగనన్న సంపూర్ణ గృహ నిర్మాణ పథకంపై సమీక్షా సమావేశము నిర్వహించారు. విజయవాడ నగరాన్నికి సంబందించి లేఔట్ స్థలములలో లబ్దిదారుల వివరాలు, గృహ నిర్మాణాల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను సంబందిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా లేఔట్లలో అంతర్గత రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అధికారులు కృషి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, స్పెషల్ ఆఫీసర్లు, ఏ.పి.హౌసింగ్ అధికారులు, సిబ్బంది మరియు కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
పబ్లిక్ రిలేషన్ అధికారి i/c