గోల్డెన్ అవర్‌పై అవగాహన కలిగించడంలో భాగంగా వరల్డ్ ట్రామా డేవేడుక నిర్వహించిన ఎస్ఎల్‌జీ హాస్పిటల్స్
తెలంగాణ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్‌తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహణ
హైదరాబాద్, అక్టోబర్ 17, 2022ః ఎస్ఎల్‌జీ హాస్పిటల్స్, వైద్యారోగ్య సేవల్లో నగరంలోనే ప్రముఖ సంస్థ వరల్డ్ ట్రామా డే 2022ను పురస్కరించుకొని నేడు రోడ్డు ప్రమాదాలు లేదా తీవ్రగాయాల పాలైన సమయంలో కీలకమైన గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతమ మరియు బాధితుల ప్రాణాలు కాపాడటం గురించి అవగాహన కల్పించింది. తెలంగాణ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తో కలిసి ఈ అవగాహన కార్యక్రమం చేపట్టింది. అత్యవసర సందర్భం ఏర్పడినపుడు సీపీఆర్ ప్రొసీజర్ నిర్వహించడం గురించి అంబులెన్స్ డ్రైవర్లకు సైతం ఈ సందర్భంగా శిక్షణ అందించారు.
అక్టోబర్ 17న ప్రతి ఏటా వరల్డ్ ట్రామా డే నిర్వహిస్తుంటారు. అత్యవసర పరిస్థితి ఎదురైనపుడు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ ప్రత్యేక రోజు నిర్వహించిన అవగాహన కల్పిస్తారు. అత్యవసర సమయంలో తీవ్ర గాయాలు పాలవడం మరియు మృత్యువాత పడటం గురించి సైతం ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డాటా ప్రకారం, మన దేశంలో ప్రతి 1.9 నిమిషాలకు ఓ వ్యక్తి మృత్యువాత పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా కన్నుమూస్తున్న వారిలో అత్యధికం పాదాచారులు, ద్విచక్రవాహనదారులు మరియు సైకిల్ నడిపేవారే!.
ఎస్ఎల్‌జీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ డాక్టర్ నరసింహారెడ్డి అవగాహన కల్సించాల్సిన ఆవశ్యకత గురించి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ``హఠాత్తుగా జరిగే ప్రమాదాల్లోనే అధిక శాతం గాయాలపాలవుతున్న పరిస్థితి కలుగుతోంది. ఇలాంటి స్థితిలో ఉన్నవారికి అత్యవసరంగా వైద్య సహాయం అందించాల్సి ఉంటుంది. తీవ్రమైన గాయాల పాలైన ఇలాంటి వ్యక్తులు షాక్‌కు గురవడం సహజంగా జరిగే ప్రక్రియ. పలు ఉదంతాల్లో అయితే అంగవైకల్యం చోటుచేసుకోకుండా ఉండేందుకు వైద్య సేవలు అందించడం తప్పనిసరి అవుతోంది. తీవ్రగాయాలపాలైన వారిలో అంగవైకల్యానికి గురి అవుతున్న వారి సంఖ్య సైతం పెద్ద ఎత్తున్నే నమోదు అవుతోంది. భారతదేశ జీడీపీలో 2-2.5% కేవలం రోడ్డు ప్రమాదాల గాయాల వల్ల జరుగుతున్న పరిణామాల వల్లే కోల్పోవాల్సి వస్తోంది. సరైన అవగాహన మరియు వైద్య సహాయం అందించడం వల్ల దేశానికి చెందిన ఈ విలువైన వనరులను పొందడం సాధ్యమవుతోంది. ఎస్ఎల్‌జీ హాస్పిటల్స్ ఈ విషయంలో, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.`` అని తెలిపారు.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఏసీపీ శ్రీ జి.హనుమంతరావు ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా, ఎస్ఎల్‌జీ హాస్పిటల్స్‌కు చెందిన అంబులెన్స్‌లు నిజాంపేట్ మరియు బాచుపల్లి ప్రాంతాలలో అవగాహన కల్పించాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్‌జీ హాస్పిటల్స్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దండు శివరామరాజు, ఎస్ఎల్‌జీ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ డీవీఎస్ సోమరాజు, ఎస్ఎల్‌జీ హాస్పిటల్స్ సీఈఓ శ్రీ గౌరవ్ ఖురానా, ఎస్ఎల్‌జీ హాస్పిటల్స్ వైద్యులు మరియు సిబ్బంది ఈ సందర్భంగా పాల్గొన్నారు.