ముందుజాగ్ర‌త్త‌ల‌తో ఆర్థ‌రైటిస్ నివార‌ణ


* వ‌చ్చిన త‌ర్వాత జీవితం బాధాక‌రం
* అవేర్ గ్లెనీగ‌ల్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రిలో అన్నిర‌కాల చికిత్స‌లు
* అవ‌గాహ‌న శిబిరంలో వైద్యుల సూచ‌న‌
* ఆర్థ‌రైటిస్ నిర్ధార‌ణ‌కు ప్ర‌త్యేక ప్యాకేజి ప్ర‌క‌ట‌న‌
* అంత‌ర్జాతీయ ఆర్థ‌రైటిస్ డే సంద‌ర్భంగా వెల్ల‌డి
 
హైద‌రాబాద్, అక్టోబ‌ర్ 12, 2022: ఆర్థ‌రైటిస్‌పై ముందునుంచి త‌గిన అవ‌గాహ‌న‌తో ఉండి, ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటే దాని బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రికి చెందిన‌ క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ వి.వి. స‌త్య‌నారాయ‌ణ సూచించారు. అంత‌ర్జాతీయ ఆర్థ‌రైటిస్ డే సంద‌ర్భంగా బుధ‌వారం ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో నిర్వ‌హించిన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు.
 
సాధార‌ణంగా మొత్తం ఆర్థ‌రైటిస్ కేసుల్లో 90 శాతం వ‌ర‌కు డీజ‌న‌రేటివ్‌.. అంటే వ‌య‌సుతో పాటే వ‌స్తాయ‌ని, కానీ కొన్నిసార్లు చిన్న వ‌య‌సులోనూ వ‌స్తాయి. ఇవి కాక ఇంకా రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్‌, ఇన్‌ఫ్ల‌మేట‌రీ ఆర్థ‌రైటిస్ కూడా ఉంటాయి. కొంత‌మందిలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండ‌టం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంది. ఆర్థరైటిస్ వస్తే, ఆలస్యం చేయొద్దు, వైద్యుల వద్దకు తప్పక రావాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అంటారు కాబట్టి, ముందుగానే కొన్ని వ్యాయామాలు చేయాలి, జంక్ ఫుడ్స్ తినకూడదు, ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలి. రోజూ సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర ఉండాలి. ఆర్థరైటిస్‌లో కీళ్ల నొప్పులు వస్తే కొన్నిసార్లు మోకాళ్ల మార్పిడి కూడా చేయాల్సి ఉంటుంది.పెద్ద పెద్ద సర్జరీల వల్ల రోగులు మంచానికే ప‌రిమితం అవుతారు, వాళ్లు త‌మ రోజువారీ పనులు చేసుకోలేరు.
 
ల‌క్ష‌ణాలు ఎన్నో ఉన్నాయి..

 కీళ్ల‌నొప్పులు, వాపులు, ఎర్ర‌బార‌డం, బిగుతుగా అవ్వ‌డం.. వీటితో పాటు పొద్దున్నే నిద్ర‌లేచాక మంచం మీద నుంచి లేవ‌లేక‌పోవ‌డం ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఇవికాక మోకాళ్లు, అరిచేయి, అరికాలు, తుంటినొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పి, స్పాండిలైటిస్‌, ఇవన్నీ ఆర్థరైటిస్ లక్షణాలే. ఈ వ్యాధి రాకుండా కూడా మ‌నం జాగ్ర‌త్త ప‌డొచ్చు. పురుషుల కంటే మ‌హిళ‌ల్లో ఈ స‌మ‌స్య ఎక్కువగా కనిపిస్తుంది. అది ఎందుకంటే, వాళ్లకి ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. రుతుక్రమం, హార్మోన్లలో మార్పుల వల్ల ఎముకలు త్వరగా అరిగిపోతాయి. మృదులాస్థి కూడా పాడ‌వుతుంది. అందువల్ల వారిలో ఈ స‌మ‌స్య ఎక్కువగా ఉంటుంది.
 
ప్ర‌త్యేక చికిత్స‌లు 

ఆర్థ‌రైటిస్ చికిత్స కోసం అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రిలో ప్రత్యేక చికిత్సా విభాగం ఉంది. జాయింట్ రీప్లేస్‌మెంట్, హిప్ రీప్లేస్‌మెంట్, మోకాళ్ల మార్పిడి, అన్నిర‌కాల ఆర్థోస్కోపిక్ ప్రొసీజ‌ర్లు ఇక్క‌డ చేస్తాం.  ఫిజియోథెరపీ క్లాసులు ఇస్తాం, జీవనశైలి మార్పులు చెబుతాం. ఇవి కాక‌, ఆర్థ‌రైటిస్ రాకుండా ఉండేందుకు ఏం చేయాల‌న్న విష‌య‌మై ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య‌శిబిరాలు, అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తాం. ప్రతినెలా రెండో శనివారం, ఈ నెల‌లో మాత్రం నాలుగు శనివారాలు ఈ క్యాంపులు ఉంటాయి అని చెప్పారు.
 
ఈ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి ఆర్థోపెడిక్ విభాగాధిప‌తి, అత్యంత సీనియ‌ర్ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్ట‌ర్ జె.విద్యాసాగ‌ర్, ఇంకా ఆర్థోపెడిక్ వైద్యులు  డాక్టర్ అశ్విన్ కుమార్ రెడ్డి, డాక్టర్ వీవీ సత్యనారాయణ, ఆస్ప‌త్రి సీఓఓ సత్వీందర్ సింగ్ సభర్వాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

     ప్ర‌త్యేక ప్యాకేజితో రూ.799కే అందుబాటులో ప‌రీక్ష‌లు 

అంత‌ర్జాతీయ ఆర్థ‌రైటిస్ డే సంద‌ర్భంగా అవేర్ గ్లెనీగ‌ల్స్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రిలో ఒక ప్ర‌త్యేక ఆర్థ‌రైటిక్ ప్యాకేజి ప్ర‌క‌టించారు.  రూ.799కే అన్నిర‌కాల ప‌రీక్ష‌లు, ఎక్స్ రేతో పాటు నిపుణుల క‌న్స‌ల్టేష‌న్ కూడా ఉంటుంది. ఈ ప్యాకేజిలో సీబీసీ 20 ర‌కాల ప‌రీక్ష‌లు, ఈఎస్ఆర్, సీఆర్‌పీ, ఎస్‌జీఓటీ, ఎస్‌జీపీటీ, ఎక్స్-రే జాయింట్ ఆఫ్ ఇంట్ర‌స్ట్ అండ్ లేట‌ర‌ల్, యూరిక్ యాసిడ్, క్రియాటినైన్‌, నిపుణుల క‌న్స‌ల్టేష‌న్ ఉంటాయి. ఇవ‌న్నీ అక్టోబ‌ర్ 12 నుంచి న‌వంబ‌ర్ 11 వ‌ర‌కు అమలవుతాయి. ఇవి కాక‌.. ఈ నెల 12, 22, 29 తేదీల‌లో ఉచిత బీఎండీ (బోన్ మిన‌ర‌ల్ డెన్సిటీ ) క్యాంపు ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 1 వ‌ర‌కు ఉంటుంది.

More Press News