ఒత్తిడిని ఆందోళ‌నను దూరం పెట్టండి- అంత‌ర్జాతీయ మాన‌సిక ఆరోగ్య దినోత్స‌వం- అక్టోబ‌ర్ 10న

డాక్ట‌ర్‌. చ‌ర‌ణ్ తేజ కోగంటి
కన్సల్టెంట్ న్యూరోసైకియాట్రిస్ట్,
కిమ్స్ హాస్పిట‌ల్స్‌, కొండాపూర్‌
 
శారీర‌కంగా ఎంత దృఢంగా ఉన్నా... స‌రే మాన‌సికంగా మ‌నిషి స‌రిగా లేక‌పోతే అనేక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. కోవిడ్-19 త‌ర్వాత అనేక మంది మాన‌సిక ఇబ్బందుల‌కు గురవుతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా మాన‌సిక ఆరోగ్యంపై అవ‌గాహ‌న పెంచ‌డానికి ప్ర‌తి సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 10వ తేదీన వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌డుతారు. ఈ సంవ‌త్స‌రం'మేకింగ్ మెంటల్ హెల్త్ & వెల్బీ యింగ్ ఫర్ ఆల్ ఎ గ్లోబల్ ప్రయారిటీ అనే థీమ్‌తో ముందుకు వెళ్తున్నారు.
 
మానసిక క్షోభ.. దానిని ఒత్తిడి అని కూడా అంటారు ఇది కేవలం మనసుకు సంబంధించినది మాత్రమే కాదు.. శరీరంపై కూడా పెను ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి అన్నది కేవలం ఆ సమయానికే పరిమితం కాదు. దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. దాని ప్రభావం కారణంగా పలు రకాలైన వ్యాధులకు దారితీస్తుంది. కొన్ని శారీరకమైన మార్పులూ వస్తాయి. ఫలితంగా శరీరం దెబ్బతింటుంది. త్వరగా వృద్ధాప్యం బారినపడేలా చేస్తుంది.
 
ఒంటరితనం, ఒత్తిడి మాత్రమే కాదు.. అనేక ఇతర మానసిక కారకాలు వేగంగా వృద్ధాప్యం సంభవించాటానికి కారకాలుగా పరిశోధకులు గ్రహించారు. వీటిలో భయం, నిస్సహాయత, నిస్పృహ, అసంతృప్తి, నిద్రలేమి కూడా ఉన్నాయి. ఇవన్నీ మనల్ని వేగంగా వృద్ధాప్యం బారినపడేలా చేస్తున్నాయి.
ధూమపానం కంటే ఒంటరితనం,ఒత్తిడి నిజంగా ఆరోగ్యానికి అధ్వాన్నమైన ప్రమాద కారకాలు అని నివేదిక‌లు చెబుతున్నాయి.
 
నేటి జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణమైపోయాయి. కానీ, ఈ ఒత్తిడి, టెన్షన్ పెరిగి మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగితే అది నేరుగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మానసిక ఆరోగ్యంతోపాటు పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేటప్పుడు, మానసికంగా దృఢంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. మానసిక స్థితి, ప్రవర్తన, రోజువారీ పని, ఆహారంపై ప్రభావం చూపుతుంది. కావున ఆరోగ్యకరమైన మనస్సును కలిగి ఉండటం ద్వారా మొత్తం శరీరం ఫిట్‌గా ఉంటుంది. మీరు కూడా, ఒత్తిడి, టెన్షన్‌తో ఇబ్బందులు పడుతుంటే చింతించాల్సిన అవసరం లేదు.
 
మానసికంగా దృఢంగా ఉండటానికి ఈ చిట్కాలను అనుసరించండి..
 
ఆరోగ్యకరమైన ఆహారంః ఆరోగ్యకరమైన ఆహారం శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మంచిగా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. మానసికంగా దృఢంగా ఉండాలంటే ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. ఎందుకంటే బయటి ఆహారం తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల మీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
 
ధ్యానం చేయండిః మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ధ్యానం అవసరం. ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే ధ్యానం చేయడం వల్ల ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటారు. రెగ్యులర్‌గా ధ్యానం చేస్తుంటే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటారు. ఇది కాకుండా ధ్యానం చేయడం ద్వారా మీ జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
 
సానుకూల వ్యక్తులతో సమయం గడపండిః సానుకూల వ్యక్తులతో సమయం గడపడం మానసిక ఆరోగ్యానికి మంచిది. మంచి వ్యక్తులతో జీవించడం వల్ల మనసుకు మంచి ఆలోచనలు వస్తాయి. కావున సామాజికంగా చురుగ్గా ఉండే వ్యక్తులతో, ఇష్టమైన వారితో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి.
 
వ్యాయామం చేయండిః వ్యాయామం చేయడం వల్ల శరీరం అలసిపోయి.. రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. అందుకే ఉదయం, సాయంత్రం వేళల్లో రెగ్యులర్‌గా వాకింగ్‌ చేస్తే ప్రయోజనం ఉండటంతోపాటు.. రాత్రి వేళ హాయిగా నిద్రపడుతుంది.


More Press News