బ‌తుక‌మ్మ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించాలి - టెలీ కాన్ఫ‌రెన్స్ లో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

*బ‌తుక‌మ్మ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించాలి*
*చెరువుల వ‌ద్ద నిమ‌జ్జ‌న‌ ఏర్పాట్లు చేయండి*
*విద్యుత్ దీపాలు, అలంక‌ర‌ణ‌తో ఆక‌ర్ష‌ణీంగా నిమ‌జ్జ‌న స్థ‌లాలు ఉండాలి*
*మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త ఏర్పాట్లు జ‌ర‌గాలి*
*బ‌తుక‌మ్మ‌ల పోటీ పెట్టి బ‌హుమ‌తులు అంద‌చేయండి*
*ప్ర‌జాప్ర‌తినిధులు అధికారులు, పోలీసుల‌తో స‌మ‌న్వ‌యంతో మెల‌గాలి*
*బ‌తుక‌మ్మ చీరలు మ‌హిళ‌లంద‌రికీ అందేలా చూడాలి*
*బ‌తుక‌మ్మ చీర‌ల‌ను అవ‌మానించే వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండండి*
*టెలీ కాన్ఫ‌రెన్స్ లో రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు*

రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ప్ర‌తి  ఏటా ఘనంగా నిర్వ‌హిస్తున్న బ‌తుక‌మ్మ వేడుకల ఈ ఏడాది కూడా క‌న్నుల పండుగ‌గా నిర్వ‌హించాలని  రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్రా వు అన్నారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని పాల‌కుర్తి, దేవ‌రుప్పులు, కొడ‌కండ్ల‌, పెద్ద వంగ‌ర‌, తొర్రూరు, రాయ‌ప‌ర్తి మండ‌లాల‌ ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, పోలీసుల‌తో మంత్రి శ‌నివారం టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసిఆర్ గారు, బ‌తుక‌మ్మ పండుగ‌ను రాష్ట్ర పండుగా ప్ర‌క‌టించి, క‌న్నుల పండుగ‌గా ప్ర‌భుత్వం త‌ర‌పున‌నే నిర్వ‌హిస్తున్నార‌న్నారు. అంతేగాక దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప్ర‌తి ఏటా కోటి మందికి పైగా బ‌తుక‌మ్మ చీర‌ల‌ను అందిస్తున్నార‌ని తెలిపారు. 339 కోట్లు ఖ‌ర్చు చేసి, అద్భుతంగా
నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు.  ఈ ద‌శ‌లోఈ ఏడాది పండుగ‌ను గ‌తంలో కంటే మ‌రింత వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని మంత్రి ఆదేశించారు. చెరువుల వ‌ద్ద నిమ‌జ్జ‌న‌ ఏర్పాట్లు చేయండి. విద్యుత్ దీపాలు, అలంక‌ర‌ణ‌తో ఆక‌ర్ష‌ణీంగా నిమ‌జ్జ‌న స్థ‌లాలు ఉండాలి.
మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త ఏర్పాట్లు జ‌ర‌గాలి. ఎక్క‌డ ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. నిమ‌జ్జ‌నం వ‌ద్ద మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండండి. అంద‌రినీ, లోతైన ప్ర‌దేశాల‌కు నిమ‌జ్జ‌నానికి ఎవ‌రినీ అనుమ‌తించ‌వ‌ద్దు. అని హిత‌వు ప‌లికారు. ప్ర‌జాప్ర‌తినిధులు అధికారులు, పోలీసుల‌తో స‌మ‌న్వ‌యంతో మెల‌గాలి. బ‌తుక‌మ్మ చీరలు మ‌హిళ‌లంద‌రికీ అందేలా చూడాలి. బ‌తుక‌మ్మ చీర‌ల‌ను అవ‌మానించే వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండండి. అలాంటి వాళ్ళ‌ని ఉపేక్షించ వ‌ద్ద‌ని మంత్రి సూచించారు. బ‌తుక‌మ్మ‌ల పోటీ పెట్టి బ‌హుమ‌తులు అంద‌చేయండి. డ‌ప్పు చ‌ప్పుళ్ళ‌తో సంప్ర‌దాయ బ‌ద్దంగా ఊరంతా వేడుక‌లా
బ‌తుక‌మ్మ పండు జ‌ర‌గాల‌ని చెప్పారు. అలాగే ద‌స‌రా వేడుక‌ల‌కు కూడా ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని మంత్రి ఆదేశించారు.



More Press News