మైనారిటీల విద్య, ఆర్థిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ప్రచురణార్థం హైదరాబాద్, 19 సెప్టెంబర్, 2022.

* అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతిలో దేశానికే దిక్సూచిగా వున్న తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల విద్య, ఆర్థిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

* షాదీముబారక్ ద్వారా 2,17,565 మంది ఆడబిడ్డల పెండ్లికి రూ. 1751 కోట్ల ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం

* సిఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం కింద రూ. 6.30 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం.

* రంజాన్, క్రిస్మస్ కు కొత్త బట్టలను పండుగ కానుకగా అందిస్తున్న ప్రభుత్వం

   అల్పసంఖ్యాక వర్గాల ప్రజలు భారతదేశంలో వందల సంవత్సరాలుగా నివసిస్తున్నారు. దేశంలో మరెక్కడా లేనంతగా తెలంగాణ
ప్రభుత్వం అల్పసంఖ్యాక వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం అల్పసంఖ్యాక వర్గాలవారికి తెలంగాణను ఆత్మీయప్రాంతంగా మార్చివేసింది. అల్పసంఖ్యాక వర్గాల శ్రేయస్సుకు అనేక పథకాలను అమలు చేస్తున్నది. తెలంగాణ ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైనది షాదీ ముబారక్ పథకం. పేద మైనారిటీ కుటుంబాలలో పుట్టిన ఆడబిడ్డ ఎదుగుదల, విద్యాభివృద్ధికి, బాల్య వివాహాలను అరికట్టుటకు షాది ముబారక్ పధకం దోహదకారిగా నిలిచింది. పేదింటి అల్పసంఖ్యాక వర్గాల ఆడపిల్ల పెండ్లి తల్లిదండ్రులకు గుండెలమీద కుంపటి కావద్దని భావించిన సీఎం కేసీఆర్ షాదీముబారక్ అనే విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. తొలుత ఈ పథకం కింద ఆల్పసంఖ్యాక వర్గాల యువతుల వివాహానికి రూ.51వేల ఆర్థిక సాయాన్ని అందజేయగా. అటు తరువాత 2017లో పథకం కింద అందిస్తున్న ఆర్థికసాయాన్ని రూ 75,116కు పెంచారు. ఆ తరువాత మార్చి 19, 2018 నుంచి ఆ మొత్తాన్ని రూ. 1,00,116 లకు పెంచి ప్రభుత్వం అమలు చేస్తున్నది.షాదీముబారక్ కింద ఇప్పటివరకు 2లక్షల 17వేల 565 మంది ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామగా రూ. 1751. కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను, ఈ పథకం కోసం రూ. 300 కోట్లను ప్రభుత్వం కేటాయించడం జరిగింది.

     షాదీముబారక్ పథకo నిరుపేద తల్లిదండ్రులకు ఎంతో అండగా నిలుస్తున్నది . అదేవిధంగా షాదీముబారక్ పథకం ద్వారా లబ్ది
పొందిన ఆడబిడ్డల్లో అత్యధికశాతం మంది అటు తరువాత కేసీఆర్కి ట్లను అందుకుంటుండడం మరో విశేషం. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి క్రుషి చేస్తున్నది. తెలంగాణ ఏర్పడి నప్పుడు రాష్ట్రంలో ఉన్న మైనారిటీ గురుకులాల సంఖ్య 12 మాత్రమే ఉండేవి. 2014 అనంతరం అదనంగా 192 గురుకులాలను ఏర్పాటు
చేసింది. అందులో 50 శాతం గురుకులాలను అల్పసంఖ్యాక వర్గాల బాలికల కోసమే ప్రత్యేకంగా కేటాయించింది. గురుకులాల ద్వారా మొత్తం లక్షా 14 వేలమంది విద్యార్థులు లబ్దిపొందుతున్నారు. చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం క్రింద ఇప్పటివరకు రూ. 6.30 కోట్ల ఆర్ధిక సహకారాన్ని అల్పసంఖ్యాక వర్గ విద్యార్థులకు అందించడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 100 కోట్లు ఈ పథకం కోసం కేటాయించడం జరిగింది.

    మైనారిటీల సంక్షేమంలో భాగంగా నాంపల్లిలోని అనాథ శరణాలయం అనీస్ -ఉల్ - గుర్బాను రూ.40 కోట్లతో పునర్నిర్మాణం చేస్తున్నది.

మసీదుల్లో ప్రార్థనాదికాలు నిర్వహించే 10 వేలమంది ఇమాం, మౌజంలకు నెలకు రూ.5 వేలచొప్పున గౌరవవేతనంఅందిస్తున్నది.
రంజాన్ కానుకగా 4లక్ష ల65వేల మందికి, క్రిస్టస్ పండుగకు ఏటా సుమారు 5లక్షల మందికి కొత్తబట్టలను కానుకగా అందిస్తున్నది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ జారీచేస్తున్న గ్రూప్స్పో స్టులకు జిల్లాలలో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నది.
------------------------------------------------------------------------------
శ్రీయుత కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ చే జారిచేయనైనది

More Press News