ఉడాన్‌ వేదికపై చేరుతున్న సుప్రసిద్ధ ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్లు ; గత ఆరు నెలల కాలంలో 150 కు పైగా బ్రాండ్లు ఉడాన్‌పై చేరాయి

 ఉడాన్‌పై ఎఫ్‌ఎంసీజీ విభాగంలో 250కు పైగా బ్రాండ్లు  చిరు వ్యాపారులు, కిరాణాలకు భారత్‌ వ్యాప్తంగా సేవలనందిస్తున్నాయి
·       ఈ ప్లాట్‌ఫామ్‌పై విస్తృతశ్రేణిలో లభించే ఉత్పత్తుల ద్వారా రిటైలర్లులబ్ధి పొందుతున్నారు
బెంగళూరు, సెప్టెంబర్‌ 07,2022 : భారతదేశంలో  అతిపెద్ద బీ2బీ ఈ–కామర్స్‌ వేదిక  ఉడాన్‌, గత ఆరు నెలల కాలంలో తమ ప్లాట్‌ఫామ్‌పై 150కు పైగా సుప్రసిద్ధ ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్ల  చేరాయని వెల్లడించింది. ఈ బ్రాండ్లు  చేరడంతో ఉడాన్‌ వేదికపై ఎఫ్‌ఎంసీజీ  విభాగంలో  ఉన్న బ్రాండ్ల సంఖ్య 250కు చేరుకుంది. భారత్‌లోని చిరు వ్యాపారులు, కిరాణా స్టోర్లకు ఇవి తమ సేవలను అందించనున్నాయి.
గత ఆరు నెలల కాలంలో ఈ వేదికపై చేరిన ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్లలో సిప్లా హెల్త్‌, పెర్‌ఫెట్టీ వాన్‌ మిల్లీ,రేనాల్డ్స్‌, పిడిలైట్‌ మొదలైనవి ఉన్నాయి. ఈ ఎఫ్‌సీఎంజీ విభాగం ప్రస్తుతం 1200 నగరాలలో సేవలనందిస్తుంటే, దానిని 1500 నగరాలకు త్వరలోనే విస్తరించనున్నారు. 
ఉడాన్‌, హెడ్‌– ఎఫ్‌ఎంసీజీ బిజినెస్‌ వినయ్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘‘ వేగవంతమైన డిజిటలీకరణ  మరియు సాంకేతిక స్వీకరణ భారత్‌ వ్యాప్తంగా జరుగుతుండటంతో సుప్రసిద్ధ ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్లు ఉడాన్‌ ప్లాట్‌ఫామ్‌పై చేరడంతో పాటుగా తమ పంపిణీ నెట్‌వర్క్‌ను గణనీయంగా విస్తరించ గలుగుతున్నాయి. ఈ బ్రాండ్లకు ప్రాధాన్యతా  భాగస్వామిగా మారడం పట్ల సంతోషంగా ఉన్నాము. తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు మరిన్ని జాతీయ, ప్రాంతీయ బ్రాండ్లు తమ వ్యాపారాలను మా వేదికపై విస్తరించుకోవడం ద్వారా భారత్‌లోని  చిరు వ్యాపారులు, కిరాణా స్టోర్లకు తగిన సాధికారితనందించగలవని ఆశిస్తున్నాము’’ అని అన్నారు
ఉడాన్‌కు ప్రస్తుతం  మూడు మిలియన్‌ రిజిస్టర్డ్‌ యూజర్లు మరియు 25–30000 విక్రేతలు  దేశవ్యాప్తంగా 1200కు పైగా నగరాలలో ఉన్నారు. వీరు 12 వేలకు పైగా పిన్‌కోడ్స్‌ కవర్‌ చేస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై మూడు మిలియన్‌ల మంది  రిటైలర్లు, కెమిస్ట్‌లు, కిరాణా షాప్‌లు, హోరెకా, రైతులు ఉండటంతో పాటుగా నెలకు 5 మిలియన్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నారు.

More Press News