5కె వాక‌థాన్‌తో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌ను జ‌రుపుకొన్న ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి

* స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా మోకాళ్ల సంర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక ప్యాకేజి ఆవిష్క‌ర‌ణ‌
 
హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 15, 2022: న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో 5కె వాక‌థాన్‌తో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. దాంతోపాటు.. ఆర్థో క‌న్స‌ల్టేష‌న్, ఫిజియో క‌న్స‌ల్టేష‌న్, డైటీషియ‌న్ క‌న్స‌ల్టేష‌న్, మోకాళ్ల ప‌రిస్థితిని తెలుసుకునేందుకు ఎక్స్-రే అన్నీ క‌లిపి ప్ర‌త్యేకంగా కేవ‌లం రూ.499/-తో ఒక ప్యాకేజిని ప్రారంభించారు. ఈ ప్యాకేజి ఆగ‌స్టు 15 నుంచి సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు అమ‌లులో ఉంటుంది.
 
ఈ సంద‌ర్భంగా ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ డీవీఎస్ సోమ‌రాజు మాట్లాడుతూ, “భార‌త‌దేశం  75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని జ‌రుపుకొంటోంది. మ‌న‌మంతా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ చేసుకునేట‌ప్పుడు, మ‌నిషి జీవితానికి స్వాతంత్య్రం చాలా ముఖ్య‌మ‌ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అది ఉంటేనే మ‌నం ఏం చేయాల‌నుకుంటే అది చేయ‌గ‌లం. ఆరోగ్యం విష‌యంలో, వ్యాధుల‌తో మ‌నం ఇబ్బంది ప‌డ‌న‌ప్పుడే నిజ‌మైన స్వాతంత్య్రం అనుభ‌వించ‌గ‌లం. అందువ‌ల్ల‌, ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం చాలా ముఖ్యం. అప్పుడే సుల‌భంగా క‌ద‌ల‌గ‌ల స్వాతంత్య్రాన్ని అనుభ‌వించి, సంతోషంగా జీవించ‌గ‌లం” అని చెప్పారు.
 
అంత‌కుముందు ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి ఛైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ దండు శివ‌రామ‌రాజు త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసి, 5కె వాక‌థాన్‌ను ప్రారంభించారు. ఇందులో నిజాంపేట ప్రాంతానికి చెందిన ప‌లువురు ఔత్సాహికుల‌తో పాటు ఆస్ప‌త్రి వైద్యులు, న‌ర్సులు, ఇత‌ర సిబ్బంది కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆస్ప‌త్రిలోని రోగుల‌కు గౌరవ్ ఖురానా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రతన్ సింగ్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ క‌లిసి పండ్లు పంపిణీ చేశారు. ఆస్ప‌త్రిలో ప్రారంభించిన మోకాళ్ల ప్యాకేజి వ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ త‌మ మోకాళ్ల వాస్త‌వ ప‌రిస్థితి ఏంటో తెలుసుకుని, అవ‌స‌ర‌మైతే చికిత్స పొందే అవ‌కాశం ఉంటుంది.

      

More Press News